Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?

అభివృద్ధి కేంద్ర వల్లనే జరుగుతోంది
ఏలేరు ఆధునీకరణ హామీ ఏమైంది?
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

కాకినాడ : సమస్యలు పై వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తే అరెస్టు లు చేస్తారా అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తంచేశారు. భీమవరంలో బిజెపి నేతలు ను అరెస్టు చేసి న విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కాకినాడ పర్యటన లో పాత్రికేయుల సమావేశం లో మాట్లాడారు. భీమవరం వస్తున్న ముఖ్య మంత్రి కి వినతి పత్రం ఇవ్వకుండా , పశ్చిమ గోదావరి జిల్లా లో బిజెపి నేతల ను ముందస్తు అరెస్టు చేయడాన్ని పురంధేశ్వరి తీవ్రంగా తప్పు పట్టారు

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ తీవ్ర స్వరంతో మండిపడ్డారు. కార్యకర్తలు మనోభావాలు తెలుసు కోవడం ద్వారా పార్టీ బలోపేతానికి కృషి, రాజకీయ సమీకరణలు కోసం కార్యకర్తలు ను కలవడం జరుగుతోంది అందుకే పర్యటన చేస్తున్నానన్నారు.

అభివృద్ధి కేంద్ర వల్లనే జరుగుతోంది. కేంద్రం సహకారం, ప్రతి జిల్లా లో వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధి. కత్తి పూడి.. రాజోలు జాతీయ రహదారి 2017 లో ఎలక్ట్రానిక్ జోన్ ఇచ్చి న రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయలేదు. కాకినాడ టూరిజం,మడ అడవులు అభివృద్ధి తదితరాలు కు కేంద్రం నిధులు ఇచ్చింది. దేవుడు అనుగ్రహించిన పూజారి అనుగ్రహం ఇవ్వని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనపడుతోంది అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు అంటించారు.

తీర ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్కేంద్రం ఆర్థిక సహకారాన్ని అంది పుచ్చుకునే సామర్థ్యం వైసీపీ ప్రభుత్వానికిలేదు. ఆక్వా రైతులు కు యూనిట్ కరెంట్ రూ పాయిన్నర కు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గోదావరి మెగా ఆక్వా పార్క్ 393 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. సాగరమాల ప్రాజెక్టు 1000కోట్లు పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు. 22లక్షలు పేదలకు ఇళ్లు ఇస్తే ఎన్ని ఇచ్చారు అని ప్రశ్నించారు.

టిడ్కో ఇళ్ళ సిధిలావస్థ కు చేరుకున్న లబ్ది దారులు కు ఇవ్వలేదు. పాదయాత్ర చేసి న సమయం లో ఏలేరు ఆధునీకరణ హామీ ఏమైంది? బిజెపి నేతలు వినతి పత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఇది సమంజసమా? ఇటువంటి ప్రభుత్వం కావాలా… అంటూ ప్రశ్నించారు.

పాత్రికేయుల సమావేశంలో గోదావరి జోన్ ఇంఛార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ,ముత్తా నవీన్ కుమార్, పెద్దిరెడ్డి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE