Suryaa.co.in

Andhra Pradesh

గిరిజన సమస్యలపై మాట్లాడితే అక్రమ కేసులు బనాయిస్తారా?

– బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమాధానం చెప్పాల్సిన రాజన్నదొర పోలీసులను ఇళ్లకు పంపడం నీచం
– రాష్ట్ర టిడిపి ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం. ధారు నాయక్

రాష్ట్రంలో గిరిజనులకు రక్షణ లేకుండా పోయింది. ఇది ప్రజాస్వామ్యమా? లేక పులివెందులస్వామ్యమా అన్నట్లు ఉంది? సమస్యలపై గళం విప్పితే పోలీసులతో ఇళ్లకు నోటీసులు పంపుతామన్నట్లు ప్రభుత్వ పెద్దల వ్యవహరిస్తున్నారు. ఒక గిరిజనుడిగా గిరిజన సమస్యలపై మాట్లాడితే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నాపై కేసుపెట్టి పోలీసులను పంపడం ఎంతవరకు సబబు? సంక్షేమ పథకాలు కరువై కొండ, గుట్టల్లో కొట్టుమిట్టాడుతున్న గిరిజనుల సమస్యలపై మాట్లాడే హక్కు మాకు లేదా?

వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు సంబంధించిన 16 సంక్షేమ పథకలను రద్దు చేస్తే మేం ప్రశ్నించకూడదా? బాధ్యయుతమైన ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్న పీడిక రాజన్నదొర అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పోలీసులను పంపడం ఏంటి. రాష్ట్రంలో గిరిజనులపై రోజుకొక దాడి జరుగతోంది. గిరిజనుల మాన, ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వం గిరిజనులపై అక్రమంగా, అన్యాయంగా మోపుతున్న కేసులపై జాతీయ ఎస్టీ కమీషన్‌లో పిర్యాదు చేస్తాం.

పోలీసులను పంపి అరెస్టులు చేస్తామంటే గిరిజన సమస్యల గురించి మాట్లాడటం మానేయాలా? రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులు ఈ రాష్ట్రంలో గిరిజనులకు వర్తించవా? సమాజంలో వేలాది సంవత్సరాల నుంచి సామాజికంగా, ఆర్ధికంగా వెనకబడిన గిరిపుత్రులు ఇంకా వెనకే ఉండాలా?

LEAVE A RESPONSE