Suryaa.co.in

Andhra Pradesh

జాబు రావాలంటే బాబు రావాల్సిందే

-మొదటి సారి ఓటు వేసే యువత ఆలోచించి ఓటు వేయాలి
– రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబుతోనే సాధ్యం
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

ఎన్నికల కాలం దగ్గర్లోనే ఉంది కాబట్టి ఓటు వేసే యువత ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఎవరికి ఓటు వేస్తే యువత భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందో ఆలోచించి ఓటు వేయాలి. తల్లి దండ్రులు కలలను నిజం చేసేలా యువత ఉద్యోగాలు చేయాలి. జాబు రావాలంటే బాబు రావాల్సిందే.

రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు రెండు టీడీపీ, వైసీపీ. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎలా బాగుపడింది. గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో ఎలా నాశనమయ్యింది అనేది యువత, ప్రజలు ఆలోచించుకోవాలి. ఏ ప్రభుత్వం జీవనోపాధి కల్పించిందో, పరిశ్రమలు తెచ్చిందో, ఉద్యోగ అవకాశాలు, సంపద సృష్టించిందో, వ్యాపార అవకాశాలు కల్పించిందో అందరూ తెలుసుకోవాలి. రాష్ట్ర విభజన తర్వాత 2014-19 టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు. 60 ఏళ్ల కాలంలో మిగిలిన ప్రాంతాల్లో లేనన్ని విధంగా 100 పరిశ్రమలు తీసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. ఉన్న పరిశ్రమలను కూడా తరిమికొట్టింది.

2014 టీడీపీ పరిపాలనలో..
2014 తర్వాత రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో పరిశ్రమలోచ్చాయి. విభజన ముందు వరకు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు, సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు, హైకోర్టు లేదు, చెప్పుకోదగ్గ గొప్ప పట్టణాలు కూడా లేవు. చదువుకున్న యువత ఉద్యోగాలు చేయాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. అప్పట్లో ఏపీలో గొప్ప ప్రదేశాలు ఉన్నాయంటే వైజాగ్, విజయవాడ.

ఇతర రాష్ట్రాలు ఎందుకు పెట్టుబడులు పెట్టారు
విభజన ముందు వరకు రాష్ట్రంలో వైజాగ్ చుట్టుపక్కల ఉన్న కొన్ని పబ్లిక్ హెక్టార్ పరిశ్రమలు, పోర్టు, స్టీల్ ప్లాంట్, ఫార్మా, రాయలసీమలో కొన్ని సిమెంట్ పరిశ్రమలు ఉండేవి. ఆ తర్వాత వచ్చిన శ్రీ సిటీలో కొన్ని కొత్త పరిశ్రమలు మాత్రమే ఉండేవి. టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు కోసం బయటకు వచ్చిన యువతకు లక్షల మంది ఇంజినీర్లు, గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లకు ఐదేళ్లలో ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు కల్పించారు.

2014-19 మధ్యలో వచ్చిన పరిశ్రమలు
తెలుగు దేశం పార్టీ ఐదేళ్లలో అద్భుతాలు చేసి చూపించింది. హైదరాబాద్ మినహా గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన పరిశ్రమలు 60 ఏళ్లలో మిగిలిన ఏ ప్రాంతాల్లో రాలేదు. ప్రభుత్వాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి పరిశ్రమలు, పెట్టుబడులను సృష్టించుకునే విధానాన్ని బట్టే ఇతర రాష్ట్రాల వారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. గత ఐదేళ్లలో 100 పరిశ్రమలు వరకు రాష్ట్రానికి వచ్చాయి వాటిలో ముఖ్యమైనవి అనంతపురంలో కియా కార్లు, హీరో హోండా, ఇసుజు, శ్రీసిటీ, విజయవాడలో లారి పరిశ్రమ, ఎలక్ట్రానిక్, జియో ఫోన్లు, ఐ ఫోన్లు, టీవీఎస్, ఏషియన్ పెయింట్లు, బర్గర్ పెయింట్స్, రామ్ కో సిమెంట్స్, ఫ్లోరా, చెట్టినాడ్ సిమెంట్స్, కళ్యాణి స్టీల్, కోకో కోలా, బ్రిటానియా, తిరుపతి చుట్టు పక్కల కొన్ని టెలిఫోన్ కంపెనీలు ఇలా వందల పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది.

ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి?
ముఖ్యమంత్రి అంటే శంకుస్థాపనలకు వెళ్లి రిబ్బన్ కత్తిరించి రావడం కాదు, ఒక విజన్ ఉండాలి. 70 ఏళ్ల వయసులో కూడా పొద్దున్నే వచ్చి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి దావోస్‌లో గడ్డ కట్టే చలిలో కూడా వారంపాటు ఓపిగ్గా ఉండి పరిశ్రమల గురించి, రాష్ట్రం గురించి రాష్ట్రంలో అమలయ్యే హామీలు గురించి చర్చిస్తూ పలు అధికారులను కలుస్తూ రాష్ట్ర బాగోగుల గురించి వివరిస్తూ, సంపద సృష్టించే విధంగా పరిపాలించి, రాష్ట్రాన్ని గొప్పగా తిర్చిదిద్దిన గొప్ప వ్యక్తి చంద్రబాబు.

2019 రాక్షస పరిపాలన
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని నాశనం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పరిశ్రమలు తరిమికొట్టారు. 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ రిలయన్స్, శ్రీకాకుళంలో ఫుడ్ ప్రాసెసింగ్, విశాఖలో లూలు కంపెనీ, 70 వేల కోట్ల డేటా సెంటర్, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్, హెచ్‌ఎస్‌బీసీ, ఆక్వా కంపెనీలు, ఐటీ కంపెనీలు, సింగపూర్ స్టార్టప్ కంపెనీలు, అమరావతి ప్రజా రాజధానిలో కంపెనీలు, గుంటూరులో సంఘం డెయిరీ, ఏషియన్ పేపర్ పల్ప్, సోలార్ కంపెనీలు, రిలయన్స్, హోలీటెక్, అమర్ రాజా, ఇలా కొన్ని పరిశ్రమలను తరిమికొట్టిన ఘనత జగన్ రెడ్డిది.

రాజధాని లేని రాష్ట్రం
అమరావతిలో ప్రజా రాజధానిని కట్టి యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్న చంద్రబాబు కలను జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. అమరావతిలో భూముల్ని స్మశానాలు, ఎడారులతో పోల్చారు. రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇలా ఎన్నో అరాచకాలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. అందుకే ఇప్పుడు కొత్తగా ఓటు వేయబోతున్న యువత ఆలోచించి ఓటు వేయాలి. రాష్ట్రం బాగుపడాలంటే మీ ఓటు హక్కుతోనే సాధ్యం. యువతకు జాబు రావాలంటే బాబు రావాలని డిమాండ్ చేస్తున్నాం

LEAVE A RESPONSE