Suryaa.co.in

Andhra Pradesh

అంగన్వాడీల అక్రమ అరెస్టులు జగన్ నియంతృత్వానికి నిదర్శనం

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

15రోజులుగా తమ న్యాయబద్దమైన డిమాండ్లపై పోరాడుతున్న అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై వైకాపా ప్రభుత్వం కొంచెం కూడా శ్రద్ధ పెట్టలేదు. వేతనాలు పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత వంటి పలు అంశాలను కోరుకున్న అంగన్వాడీలపై కర్కశత్వాన్ని ప్రదర్శించడం దుర్మార్గం. హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీల పై జగన్ రెడ్డి ఉక్కుపాదం మోపడం నిరంకుశత్వమే. శాంతియుతంగా నిరసనలు తెలుపుతూ…తమ డిమాండ్లపై ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అంగన్వాడీలకు లేవా?

విజయవాడ ధర్నాచౌక్ లో నిరసన తెలిపేందుకు ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని అడ్డగోలుగా పీకేసి, అంగన్వాడీలను అక్రమంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో పడేసి అరెస్టు చేయడం జగన్ నియంతృత్వానికి నిదర్శనం. అంగన్వాడీ సోదరీమణుల న్యాయబద్దమైన పోరాటానికి టిడిపి సంపూర్ణ మద్ధతు ఉంటుంది. అంగన్వాడీ సోదరీమణుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను.

LEAVE A RESPONSE