Suryaa.co.in

Andhra Pradesh

ఆరణి నదిలో విచ్చలవిడిగా అక్రమ ఇసుక తవ్వకా లు

– గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డికి లేఖ రాసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య

• రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను అక్రమంగా తవ్వి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు.

సత్యవేడు అసెంబ్లీలోని ఆరణి నదిలో విచ్చలవిడిగా అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారు. అక్రమంగా తవ్విన ఇసుక తమిళనాడుకు తరలిస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలతో రాష్ట్రానికి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా సహజ వనరులకు తీవ్రనష్టం వాటిల్లుతోంది.

ఇసుకను ఏపీ లారీలల్లో లోడ్‌ చేసి వే బిల్లును సిద్ధం చేస్తారు. తర్వాత ట్రక్కు తమిళనాడులోకి ఎంటర్ అవ్వగానే ఇసుక లోడును స్థానిక తమిళనాడు ట్రక్కులోకి మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారు. కే వేబిల్లుపై అనేక మార్లు ఇసుక అక్రమ రవాణ చేస్తున్నారు.. స్థానిక వైసీపీ నేతల అండదండలతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.విచ్చలవిడి అక్రమ ఇసుక తవ్వకాలతో నది గమనంలో మార్పు రావడమే కాకుండా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.

అరణి నది ఒడ్డున ఉన్న గ్రామాలకు తీవ్రమైన వరదల ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. భవిష్యత్ తరాలకు సహజవనరులను రక్షించాలంటే అక్రమ తవ్వకాలను తక్షణమే అరికట్టాలి. ఇంత పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నా అధికారుల స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోంది.

ఇసుక మాఫియాతో అధికారులు కుమ్మక్కయ్యారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులపై కఠిన చర్యలు తీసుకోండి.అరణి నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను తక్షణమే అరికట్టాలి. ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి.

 

LEAVE A RESPONSE