గోవుల అక్రమ తరలింపు, గో మాంసల విక్రయాన్ని నిషేధించాలి

– రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్

హిందువులు పవిత్రంగా ఆరాధించే గోవుల అక్రమ తరలింపును, గో మాంసల విక్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు .కాకినాడ జిల్లా తుని పట్టణ శివారు లో ఉన్న తపోవన్న ఆశ్రమం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

గోవుల అక్రమ తరలింపు పై అలాగే గోమాంసాన్ని విక్రయించడంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. అలాగే ఇటీవలో తుని పట్టణంలో గో కళాబరం నుంచి సేకరిస్తున్న కల్తీ నేను పట్టుబడిందని, ఇటువంటి నూనె వాడడం వల్ల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆయన అన్నారు . ఈ గోవధ కేంద్రాలపై నిఘా ఉంచి నిషేధించాలన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టం చేకూర్చు తుందని ఆయన అన్నారు. రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం నుంచే వచ్చిన బియ్యాన్ని రైతులకు అందజేయాలన్నారు.. రేషన్ డిపోల ద్వారా అక్రమంగా తరలిస్తున్న బియ్యం పై నిఘా కొరవడిందన్నారు. దళారులు ఈ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి న బియ్యాన్నే తిరిగి ప్రజలకు అమ్మకాలు చేస్తుందన్నారు. దళారీ వ్యవస్థను పూర్తిగా నిరోధించాలన్నారు. రైతులకు థరలకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ,నష్టాలు ఊబి నుంచి బయటికి తేవాలన్నారు.

Leave a Reply