– ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన
– రావణాసురుడు కి పట్టిన గతే భవిష్యత్ లో జగన్ కు పడుతుంది
– వైసీపీ అరుపులు వీధి కుక్కల అరుపులు
– చంద్రబాబు నాయుడు దేశానికి ఒక దిక్సూచి
– మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, మహిళ అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి
హైదరాబాద్: చంద్రబాబును అరెస్టు చేసి టీడీపీని నిర్వీర్యం చేయాలన్న ఏపీ సీఎం జగన్ ఆశలు ఫలించబోవని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వేసిన పునాదుల నుంచి పుట్టిన టీడీపీని పెకిలించడం వైఎస్ వల్లనే కాలేదని, ఇక జగన్ ఎంత అని ప్రశ్నించారు. ఇంకా ప్రసూన ఏమన్నారంటే… మా నాయకుడు రాజమండ్రి జైలు లో ఉండటం చాలా బాధాకరం.ఎటువంటి పరిస్థితి అయిన మానసికంగా మేము ఎదురు కోవడానికి సిద్ధం గా ఉన్నాము.
మహిళలకు రిజర్వేషన్ లు కావాలి అని తొలుత గళం ఎత్తిన పార్టీ మా తెలుగుదేశం పార్టీ. 1983 అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశ పెట్టిన ఘనత టీడీపీ ది. ఈ రోజు మిగిలిన పార్టీ లు వాళ్ళు ఎదో భుజాన వేసుకుంటున్నారు. కానీ ఆ కీర్తి మా తెలుగుదేశం పార్టీ సొంతం.
మహిళల కు 33 % రిజర్వేషన్ తెచ్చిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీ కు చెందుతుంది. మనస్ఫూర్తిగా గా మోడీ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గాల లో మహిళలు పాత్ర ఎంత కీలకం అనేది ఇప్పుడు తెలుస్తుంది.ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారత దేశం మహిళా శక్తీ ఏంటో భవిష్యత్ చూడబోతుంది.
ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతుంది. జగన్ కు ఓటమి భయం పట్టుకుంది.రాజకీయ రాక్షస క్రీడా సాగుతుంది. చంద్రబాబు నాయుడు లో భయం అనేది ఎక్కడ లేదు.చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం లాగా బయట పడతారు ఈ రోజు కొన్ని వార్త పత్రిక లో వచ్చే వార్తలు చూస్తుంటే భయం వేస్తుంది. తెలుగుదేశం పార్టీ లో గళం విప్పే వారి పైన పోలీస్ వాళ్ళు ఉక్కు పాదం మోపుతున్నారు. రావణాసురుడు కి పట్టిన గతే భవిష్యత్ లో జగన్ కు పడుతుంది.
తాటాకు చప్పుడులకు భయపడే వాళ్ళము కాదు టీడీపీ వాళ్ళు.మీరు ఎన్ని కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు పైన మచ్చ వేయలేరు.చంద్రబాబు విజన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు.జగన్ లక్షల కోట్ల అవినీతి లో కూరుకు పోయి, కుటుంబాని దూరం చేసుకున్న వ్యక్తి జగన్. బిత్తిరి చూపులు చూసే వ్యక్తి జగన్.జగన్ PT వారెంట్ కాదు ఏ వారెంట్ తెచ్చిన చంద్రబాబు నాయుడుని ఏమి పీకలేరు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేరు.
మహిళ అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు బయటకు రావాలని ప్రపంచంలోని తెలుగువారంతా ప్రార్ధనలు చేస్తుండటం ఆయనలోని దార్శనికుడికి నిదర్శనమన్నారు. చంద్రబాబు ఐటీని ప్రోత్సహిండం వల్ల ఉద్యోగాలు పొందిన సాఫ్ట్‌వేర్ నిపుణులంతా, స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిరసనలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛందంగా ప్రశాంతంగా ధర్నా చేస్తున్న ఐటి ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో తన ధోరణి మార్చుకోకపోతే, ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
జగన్ సైకో ఆనందం ఎక్కువకాలం నిలవదని వ్యాఖ్యానించారు. కాట్రగడ్డ ప్రసూన నాయకత్వం లో మేము మహిళ హక్కుల గురుంచి పోరాటం చేస్తున్నం. జగన్ ది పైశాచిక ఆనందం. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి అడుగు అడుగునా కనపడుతుంది. యావత్ తెలుగు రాష్టాలలోనే కాదు. ప్రపంచం అంత చంద్రబాబు కోసం ఎదురు చూస్తుంది. వైసీపీ అరుపులు వీధి కుక్కల అరుపులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై దేశం అంత ఖండిస్తుంది.
చంద్రబాబు నాయుడు దేశానికి ఒక దిక్సూచి. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాక, ఎవరు ఎవరు అయితే ఆరోపణలు చేశారో వారికి చుక్కలు చూపిస్తాం… మహిళ రిజర్వేషన్ ఇచ్చిన బీజేపీ అధిష్టానానికి, ప్రధాని మోడీ కు తెలంగాణ తెలుగుదేశం విభాగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మహిళా బిల్లు తో రెండు సభలలో మహిళలతో కళకళలాడుతుంది. మహిళా రిజర్వేషన్ వెనుక తెలుగుదేశం కృషి ఎంతో ఉంది.దేశం బాగుండాలి అంటే మహిళా బాగుండాలి.మహిళలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లు ఇవ్వలేని బీఆర్‌ఎస్, మహిళా రిజర్వేషన్ బిల్లును తామే తెచ్చామనమడం సిగ్గుచేటని షకీలారెడ్డి ఎద్దేవా చేశారు.