పల్నాడులో గిరిజన మహిళను ట్రాక్టర్ తో గుద్ది చంపటం దుర్మార్గం

– టీడీపీ వాళ్లకు నీళ్లెందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తే చంపేస్తారా?
– త్రాగడానికి గుక్కెడు నీళ్లు అడిగితే ప్రాణాలు తీశారంటే జగన్ పాలన రాతియుగం కాక మరేంటి?
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

ఆఖరి రోజుల్లోనూ వైసీపీ కార్యకర్తల అధికార మదం తగ్గడం లేదు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరంలో బాణావత్ సామిని అనే గిరిజన మహిళను ట్రాక్టర్ తో గుద్ది చంపటం దుర్మార్గం. టీడీపీ వాళ్లకు నీళ్లెందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తే చంపేస్తారా? త్రాగడానికి గుక్కెడు నీళ్లు అడిగితే ప్రాణాలు తీశారంటే జగన్ పాలన రాతియుగం కాక మరేంటి?

తాగే నీళ్ల దగ్గర కూడా పార్టీల పేరుతో పక్షపాతం చూపించటం దౌర్బాగ్యం. పార్టీలు చూడం, కులం చూడం అంటూ డబ్బాలు కొట్టిన జగన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెబుతారు? నా ఎస్సీ,ఎస్టీ అంటున్న జగన్ రెడ్డికి వారిపై జరుగుతున్న మారణకాండ కనిపించటం లేదా? జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో ఎస్టీ,ఎస్సీ,బీసీలపై అరాచకాలు పెరిగిపోయాయి.

స్ధానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే పల్నాడులో వైసీపీ కార్యకర్తలు కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. సామిని బాయిని చంపిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మరో 50 రోజుల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు అధికారమదంతో అరాచకం చేస్తున్న వారందరకీ బడితె పూజ ఖాయం.

 

Leave a Reply