Suryaa.co.in

Andhra Pradesh

చేతకాని తనంతో కరెంట్ కష్టాలు తెచ్చారు

– జీఎస్టీ పైవచ్చే పన్నుల పై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు
– ఆఫీస్ కి వెళ్ళని ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్
– ప్రభుత్వం ఫ్రాడ్ అని సుప్రీంకోర్టు చెప్పింది
– క్రమశిక్షణ లేనిది భక్తులకు కాదు,ధర్మారెడ్డికి
– . తిరుపతికి జగన్ఇ చ్చే గౌరవం ఇదేనా?
– ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఢిల్లీ: పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాను. అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేయాలని గతంలో చంద్రబాబు ప్రణాళిక వేశారు. కానీ ఇప్పటి ప్రభుత్వం పనులు కూడా మొదలు పెట్టలేదు. సీఎం జగన్ కేబినెట్ ఏర్పాటు చేసి అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.

కోతల రాయుడు ,బాదుడు వీరుడు.రాష్ట్రంలో విద్యుత్ కోతల ఇబ్బందులపై మాట్లాడుకోవాలి. ఐటీ ఉద్యోగులు ఇబ్బందులో ఉన్నారు, వర్క్ ఫ్రొం హోమ్ లో ఉన్నారు కరెంట్ లేదు. పరిశ్రమ నడవాలంటే విద్యుత్ అవసరం ఇప్పుడు కరెంట్ కోతలు పెడితే ఏం చేయాలి? చేతకాని తనంతో ఇసుక దొరకకుండా రెండేళ్లు నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారు. రాష్ట్రంలో చేతకాని తనం తో కరెంట్ కష్టాలు తెచ్చారు. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ అద్దెకు ఇవ్వాలని చూశారు. విద్యుత్ ప్లాంట్స్ నడపకుండా ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతారా? ఏ పని చేయాలన్న కరెంట్ కావాలి,కానీ ఇలాంటి సందర్భంలో కరెంట్ లేకపోతే ఎలా?

కేంద్రం పెట్రోల్ రేటు పెంచితే మన జీఎస్టీ పైవచ్చే పన్నుల పై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. 15 రేట్లు ఇండస్ట్రియల్ పవర్ రేటు పెంచారు ఆర్టీసీ చార్జీలు పెంచడం లేదు,పెరిగిన డీజిల్ పై పన్ను వేస్తున్న అంటున్నారు. డీజిల్ ,పెట్రోల్ రేటు పై రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించుకోవాలి. మీకు వచ్చే పన్నుల వాటా మాత్రం తగ్గించుకోరా? హెలికాప్టర్ లో తిరుగుతూ, ప్రజల కొరకు త్యాగం చేస్తున్న. ఒక్క రూపాయ జీతం తీసుకోవడం లేదని జగన్ అంటున్నారు.

విద్య దీవెన అంత బోగస్.రాష్ట్రంలో అమ్మ ఒడి తప్ప అన్ని పాత పధకాలే ,మిగతావి అన్ని కూడా బోగస్. అమ్మఒడి ఇచ్చి మన ఇళ్లను గుల్ల చేస్తున్నారు. ఏపీ పథకాల పై చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను ఎవరైనా రావొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి ఫోకస్ లేకపోవడం కారణం. ముఖ్యమంత్రి ఆఫీస్ కి వె ళ్ళ డు,ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది? జగన్ ఆఫీస్ కి రావడం లేదని ఇతర మంత్రులు ,అధికారులు కూడా సెక్రటేరియట్ రావడం లేదు. ఏపీ చరిత్రలో ఆఫీస్ కి వె ళ్ళ ని ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్.

ఎస్సీ,ఎస్టీలకు,బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామని అంటున్నారు. ఒక ఎస్సీ కు ముఖ్యమంత్రి ఇవ్వండి జగన్ చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. ముఖ్యమైన పదవులన్ని మీకు,మాములు పదవులు వేరే వాళ్ళకా? పని చేయాలని ప్రభుత్వాన్ని అడగతున్నా .

పిడి అకౌంట్స్ లోకి డబ్బులు మార్చి వైస్సార్ రైతు భరోసా వాటి లోకి మారుస్తున్నారు. సుప్రీంకోర్టు కోవిడ్ తో చనిపోయిన వారికి 50 వేలు ఇవ్వమంటే ఒక్క రూపాయ లేదు అన్నారు. పల్లా శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు ఆయనకు ధన్యవాదాలు. దిక్కుమాలిన ప్రభుత్వాలు వచ్చినప్పుడు పరిశ్రమలు నడిపే వారికి ఇలాంటి ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం ఫ్రాడ్ అని సుప్రీంకోర్టు చెప్పింది ప్రజల కొరకు ఎంత ఫ్రాడ్ అయిన చేస్తానని చెప్పండి.

హైకోర్టులో శ్రీలక్ష్మి పిటిషన్ వేస్తే తిరస్కరించింది. ఐఏఎస్ లు వచ్చిందే ప్రజలకు సర్వీస్ చేయడానికి కదా? ఈ ప్రభుత్వానికి కోర్టు ఆర్డర్ల్స్ ,కోర్టులు అంటే భయం కూడా లేదు కోర్టు తీర్పు చెప్తే రాజీనామా చేసి గతంలో వెళ్లిపోయేవారు ఉండేవారు. కోర్టులు మన రాష్ట్రం విషయంలో చర్యలు తీసుకోకపోతే న్యాయ వ్యవస్థను పట్టించుకోరు. న్యాయస్థానం కోర్టు తీర్పును ఉల్లఘించే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి. టీటీడీ కి వచ్చే భక్తులకు క్రమశిక్షణ లేదని భక్తులను ధర్మారెడ్డి అవమానించారు. భక్తుల నుంచి వచ్చే నిధుల నుంచి జీతాలు తీసుకుంటున్నారు. క్రమశిక్షణ లేనిది భక్తులకు కాదు,ధర్మారెడ్డి కి .

మేకతోటి సుచరిత స్టేట్మెంట్ అదిరిపోయింది. ముఖ్యమంత్రికి లేఖ రాశాను,లేఖలో కొత్త మంత్రులకు అభినందనలను తెలపడానికి అంటున్నారు. మేకతోటి సుచరిత ఏ పార్టీ వారితో మాట్లాడిందో కూడా తెలుసు. స్పీకర్ తమ్మినేని జగన్మోహన్ రెడ్డి రథచక్రం కింద నలిగిపోతున్నామని పరోక్షంగా అని ఉంటారు.
కొత్త మంత్రులకు జగనానంద స్వామి దీవెన ఇచ్చాడు. తొమ్మిది మంది నవరత్నాల మంత్రులకు జగన్ ఆశీస్సులు ఇచ్చారు. బొత్స సత్యనారాయణ ప్రమాణస్వీకారం సందర్భంగా హుందాగా వ్యవహరించారు. మిగతావారు జగన్ కాళ్ళు పట్టుకోవడం ఏంటి ? జగన్ (jehovah complex)తనను తాను దేవుడిగా భావించుకుంటున్నారు. మంత్రులు జగన్ కాళ్ల మీద పడొద్దు దరిద్రం. జగదానంద స్వామి దీవెనలు అందిస్తున్నట్టు ఉంది చూసే వారికి. 70 శాతం బీసీ,ఎస్టీలకు ఇచ్చారని అంటున్నారు. సకల శాఖ మంత్రి సజ్జలనే అన్ని చూసుకుంటారు. శ్రీకాకుళంలో ఉన్నదే కొన్ని కులాలు. ఇచ్చింది మళ్ళీ వారికే.
దమ్మిడీ ఆదాయం లేని కార్పొరేషన్లకు చైర్మన్ లను ఇచ్చారు. బిసిలో 120 కి పైగా కులాలు ఉంటే నలుగురికి ఇస్తే అందరికి ఇచ్చినట్టే నా? మంత్రి పదవులు రాక పార్ధసారధి గారు,మరి కొందరు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వారు మంత్రి పదవిపోయిన తర్వాత జగన్ ఎలా చెప్తే అలా చేస్తా అని పేరు పెట్టి పిలుస్తున్నారు. మంత్రి పదవులు రాని వారితో సామాజిక వర్గాల వారీగా వారితో చర్చలు జరుపుతున్నారు. మేకతోటి సుచరిత ఏం పాపం చేసింది,ఆమెతో కూడా మాట్లాడితే బాగుండు. బ్రాహ్మణులకు, క్షత్రియులకు వైశ్యులకు మంత్రి పదవి ఇవ్వలేదు. మూడు కులాలను ఒకరకమైన ద్వేషం ఎందుకు? ముఖ్యమంత్రి బ్రాహ్మణులు, ,క్షత్రియులు, వైశ్యులను తొక్కేశారు. జగన్ మత ద్వేషాన్ని, కులద్వేషంగా చూడొద్దు.

తిరుమలలో నిన్న దారుణం జరిగింది. 90 వేల మంది భక్తులు రావడం సర్వ సాధారణం. గతంలో కూడా చాలా మంది భక్తులు వచ్చారు. ధనార్జన కోసమే మన ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీటీడీ భక్తులు అనుకుంటున్నారు. ఫుల్ టైం టీటీడీ ఈవో నియామకం చేపట్టండి. ఎప్పుడైనా టీటీడీ కి జగన్ వెళ్తే తెలుస్తుంది. జగన్ తిరుపతికి ఇచ్చే గౌరవం ఇదేనా? భక్తుల తరపున,ప్రజల తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు న్నా.. ఫుల్ టైం ఈవో ను నియమించండి. ప్రస్తుతం టీటీడీ లో ఉన్న ఈవో సెక్రటేరియట్ లో సీఎంవో చూస్తున్నారు. టీటీడీ భక్తుల్లో ఒక అభద్రతా భావం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నారు,హిందూ భక్తులను ప్రేమతో చూడండి. టీటీడీ అంశంపై జగన్ దృష్టి పెట్టాలి. రెడ్డి అనే పెద్దరికాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నా .

జగన్ పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు దత్తపుత్రుడు అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఎందుకు అంత భయం? పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు అంటే ఆయన మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుందంటున్నారు. పవన్ కళ్యాణ్ చర్లపల్లి అని అన్నారు. పవన్ కళ్యాణ్ తప్పు గా చంచలగూడ జైల్ ను చర్లపల్లి అని అన్నారు. పవన్ కళ్యాణ్ ని చాలా మంది చూసి నేర్చుకోవాలి. ప్రతిపక్ష ఓట్లు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ అనడంతో మా వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ప్రజలను గెలిపించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉండాలని కోరుకుంటున్నా. రాజకీయాల్లో సొంత డబ్బులతో పని చేస్తున్న వ్యక్తి గ్రంధి శ్రీనివాస్. ఆయనకు మంత్రి పదవి ఇస్తే బాగుండు. ముక్కుసూటిగా ఉన్నందుకు గ్రంధి శ్రీనివాస్ కు పదవి రాలేదని అనుకుంటున్నా. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ జర్నలిస్టుల ను ఆరాధించాలని అన్నారు. జర్నలిస్ట్ అందరూ నిలదీయాలి. మంత్రి అంత ఓపెన్ గా ఆరాధించాలని అనడం ఏంటి ?

LEAVE A RESPONSE