Home » నాగరిక ప్రపంచంలో హిందువులపై పెరుగుతున్న దాడులు!

నాగరిక ప్రపంచంలో హిందువులపై పెరుగుతున్న దాడులు!

న్యూఢిల్లీ: భారతదేశం, విదేశాలలో హిందువులు, హిందూ ధర్మంపై దాడులు ఈ వారం కూడా చోటుచేసుకున్నాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, ఇటువంటి హింస మన కళ్ల ముందు జరిగిన మారణహోమం లాంటిది. హిందూ వ్యతిరేక మతోన్మాదులు హత్యలు, బలవంతపు మతమార్పిడులు, భూకబ్జాలు, పండుగలపై దాడులు, దేవాలయాలు, మూర్తిలను అపవిత్రం చేయడం, ద్వేషపూరిత ప్రసంగాలు, లైంగిక హింస వంటివాటికి పాల్పడ్డారు.

23 అక్టోబర్ నుండి 29 అక్టోబర్ 2022 వరకు ఈ వారంలో సంభవించిన సంఘటనలు ఇవి…
1) కేరళ నార్కో జిహాద్ – ఇస్లాంవాదులు హిందూ మహిళలను డ్రగ్స్ రవాణా చేయడానికి ఉపయోగించుకుంటున్నారు.

2) నాలుగు నెలల క్రితం బిలాస్‌పూర్‌లోని ఒక హోటల్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్ జిల్లా కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు సహా ఆరుగురు వ్యక్తులు 16 ఏళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు.

3) గుజరాత్‌లోని వడోదరలో దీపావళి వేడుకల సందర్భంగా ఇస్లాంవాదులు హింసను ప్రేరేపించారు.

4) తమిళనాడులోని 25 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ను చంపినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న అల్ ఉమ్మా చీఫ్ బాషా సోదరుడి ఇంటిపై కోయంబత్తూర్‌ పోలీసులు ఆదివారం (అక్టోబర్ 23) దాడి చేశారు.

5) కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని విజింజం సమీపంలోని పుల్లూర్కోణం ఆలయంపై దాడి జరిగింది. పెట్రోల్, మరో తెలియని ద్రవం కలిపిన బాటిళ్ళను ఆలయంలోకి విసిరారు. ఈ ఘటనతో పోలీసులు సలావుద్దీన్ అనే స్థానికుడిని అదుపులోకి తీసుకున్నారు.

6) రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఒక మహిళను అపహరించి, సామూహిక అత్యాచారం చేశారు. ఇంకా.. బలవంతంగా గొడ్డు మాంసం తినిపించి, చివరకు ఐదుగురు ఇస్లామిస్టులు హత్య చేయడానికి ముందు నమాజ్ చేయమని బలవంతం పెట్టారు. సిక్రి (సికారి) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

7) 17 ఏళ్ళ అమ్మాయిని బలవంతంగా మసీదులోకి లాగి అత్యాచారం చేయడానికి ప్రయత్నించినందుకు అక్టోబర్ 20 న ఒక మౌల్వీని అరెస్టు చేశారు.

8) శుక్రవారం, అక్టోబర్ 21, 2022 నాడు సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 15273) స్లీపర్ కోచ్‌లో నమాజ్ చేస్తున్న పురుషుల బృందం వీడియో సోషల్ మీడియాలో (SM) వైరల్‌గా మారింది. ఈ ఫుటేజీలో ముస్లింలు మార్గంలో ప్రార్థనలు చేస్తూ, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించినట్టు ఆ వీడియో ఉన్నది.

9) భాగ్యనగరంలో ఒక క్రిస్టియన్ కుటుంబం దీపావళి సందర్భంగా హిందూ కుటుంబం ఉంచిన రంగోలిని తన్నింది. ఆ క్రైస్తవ కుటుంబం… హిందూ మహిళను దుర్భాషలాడుతూ చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నించిన మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు క్రైస్తవ కుటుంబంపై కేసు నమోదు చేశారు.

10) ఒక యుక్తవయసులో ఉన్న అమ్మాయిని ఒక ముస్లిం యువకుడు తుపాకీతో ఆమె ఇంటి నుండి బయటకు లాగాడు. ఆ యువకుడు ఆమెను పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ (యుపి) బాగ్‌పత్ జిల్లాలోని బరౌత్ నగరంలో మంగళవారం (అక్టోబర్ 25) మధ్యాహ్నం జరిగింది.

11) ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో మైనర్ బ్రాహ్మణ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన (కొన్ని నివేదికల ప్రకారం అత్యాచారానికి ప్రయత్నించిన) నౌషాద్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

పాకిస్తాన్‌లో…
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్‌లో మైనర్ హిందూ బాలికలను అపహరించడం, అత్యాచారం చేయడం, బలవంతంగా మతమార్పిడి చేయడం. వివాహం చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఒక్క సింధ్ ప్రావిన్స్‌లోనే ప్రతి సంవత్సరం కనీసం 1000 మంది మైనారిటీ బాలికలు ఇటువంటి లైంగిక బానిసత్వానికి గురవుతున్నారు. ఇది కాకుండా, హిందూ దేవాలయాలపై తరచుగా దాడులు, విద్యా పాఠ్యాంశాలపై ద్యేషం, పోలీసు, న్యాయపరమైన వ్యతిరేకత, ప్రాథమిక హక్కుల తిరస్కరణ. అంటరానితనం వంటి వ్యవస్థాగత, సంస్థాగతమైన వివక్ష ఉన్నది. ఇటువంటి నిర్లక్ష్యాలను పాకిస్తాన్ హిందువులు నిత్యం ఎదుర్కొంటున్నారు.

1) పాకిస్తానీ మైనారిటీ హిందూ సమాజం తాండో అల్లాయర్, సింధ్‌కు దీపావళి జరుపుకోవడానికి అనుమతి లేదు. సోమవారం మైనారిటీల ఇళ్ళపైకి వచ్చిన ముష్కరులు తమ అతి ముఖ్యమైన పండుగను జరుపుకునేందుకు బయటకు రాకుండా భయాందోళనకు గురిచేస్తూ కాల్పులు జరిపారు.

బంగ్లాదేశ్‌లో…
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కనికరం లేకుండా సాగుతున్నాయి. దేశం నుండి మతపరమైన మైనారిటీలను క్రమంగా ప్రక్షాళన చేయడానికి ప్రణాళికలు వేశారు. ఢాకా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ అబుల్ బరాకత్ చేసిన అధ్యయనం ప్రకారం, వ్యవస్థాగత, సంస్థాగతమైన హింస కారణంగా 2050 నాటికి బంగ్లాదేశ్‌లో హిందువులు ఎవరూ ఉండరు. దేవాలయాన్ని అపవిత్రం చేయడం, భూకబ్జా చేయడం, తప్పుడు దూషణ ఆరోపణల తర్వాత గుంపు దాడులు, మహిళలపై అత్యాచారం/బలవంతంగా మతమార్పిడి చేయడంతోపాటు ద్వేషపూరిత ప్రసంగాలు హిందువులను భయపెట్టడానికి, వెళ్ళగొట్టడానికి ఉపయోగించే కొన్ని సాధనాలని నిపుణులు పేర్కొంటున్నారు.

1) సోమవారం (అక్టోబర్ 24), బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలోని గోబింద్‌పూర్ గ్రామంలోని మా కాళీ దేవాలయంలో కాళీ పూజ/దీపావళి రోజున స్థానిక ముస్లిం తీవ్రవాదులు ధ్వంసం చేసి అపవిత్రం చేశారు.

2) బంగ్లాదేశ్‌లోని నార్సింగి జిల్లా పలాష్‌లో ఆటోరిక్షా డ్రైవర్ అనిల్ చంద్ర పాల్ (45)ను అతని ఇంట్లోకి ప్రవేశించి దుండగులు నరికి చంపారు. ఈ సంఘటన గత సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు పలాష్ ఉపజిల్లాలోని జినార్డి మధ్య చర్పరా ప్రాంతంలో జరిగింది.

Source: HINDU POST
(vsktelangana.org)

Leave a Reply