Home » భారత్‌-నేపాల్‌ సరిహద్దు మూసివేత

భారత్‌-నేపాల్‌ సరిహద్దు మూసివేత

బిహార్‌: లోక్‌సభ ఎన్నికల మూడో దశ నేపథ్యంలో బీహార్‌ను ఆనుకుని ఉన్న నేపాల్‌ సరిహద్దును మూడు రోజుల పాటు మూసివేశారు. సరిహద్దు ప్రాంతాలైన మధు బని, ఖుటోనా, జయనగర్‌ నుంచి నేపాల్‌ మీదుగా వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. మంగళవారం బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సరిహద్దులను మూసివేశారు. మరోవైపు సరిహద్దు వద్ద భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు.

Leave a Reply