Suryaa.co.in

Political News

ఉక్కు మహిళ ఇందిర

దేశానికి ఎటువంటి నాయకులూ అవసరమో చెప్పే సంఘటన ఇది.ప్రధాని మంత్రి నిర్ణయ శక్తి ఎంత బలంగా,వేగంగా ఉండాలో చెప్పే ఉదంతమిది.వివరాల్లోకి వెళితే… 1966 మార్చిలో, ఇందిరా గాంధీ ప్రధానమంత్రి హోదాలో తన మొదటి విదేశీ పర్యటన చేపట్టారు. ప్రపంచ బ్యాంకు మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థలు మన దేశపు రూపాయి విలువను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. దేశీయ ఆహార ఉత్పత్తి తగినంతగా లేదు.
కానీ ఆమె ఈ విషయాల్లో తన ఓటమిని అంగీకరించడానికి నిరాకరించింది.అందుకేనేమో 1971లో అమెరికన్ గాలప్ పోల్ ఇందిరా గాంధీని ప్రపంచంలోనే అత్యంత అభిమానించే బలమైన వ్యక్తిగా ఎంపిక చేసింది. భారతీయ ప్రధానులందరిలో ఇందిరాగాంధీ లాగా మరే ఇతర నాయకులూ అమెరిక అధ్యక్షులకు తమ నిజమైన సత్తా ఏమిటో చూపలేకపోయారు అనేది జగమెరిగిన సత్యం.
అమెరికాలోని భారత రాయబారి నివాసంలో అధ్యక్షుడు జాన్సన్ -ఇందిర మధ్య ఒక ప్రైవేట్ సమావేశం ఏర్పాటైంది. వైట్ హౌస్ విందులో, జాన్సన్ ఇందిరతో కలిసి నృత్యం చేయాలని కోరారు అయితే దీన్ని ఆమె మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తూ, డాన్స్ చేస్తే భారత ప్రజల జనాదరణ పొందలేన ని వివరించడంతో . శ్వేతా సౌధంలో ఇందిరకు ఎటువంటి అమర్యాద జరగకుండా చూడాలని ఆయన తన సహాయకులతో భావోద్వేగంగా చెప్పడం విశేషం.
ఆ పర్యటనలో ‘వియత్నాంపై అమెరికా వేదనను భారత్ అర్థం చేసుకుంది’ అని ఇందిర నేర్పుగా చెప్పడం తో జాన్సన్ భారత్ కి మూడు మిలియన్ టన్నుల ఆహారాన్ని, $9 మిలియన్ల ఆర్ధిక సహాయాన్ని అందించారు.ఒక పక్క తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూనే 66 నటి భరత్ సమస్యసలను ఆమె తెలివిగా పరిష్కరించేశారు.
కానీ ఆమె కాశ్మీర్ విషయంలో సైతం రాజీపడలేదు. న్యూయార్క్లో ఒక ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ ‘ప్రజాభిప్రాయ సేకరణ గురించి మాట్లాడటం ఇప్పుడు చాలా ఆలస్యం అయింది. గత శరదృతువులో కాశ్మీర్ పై పాకిస్తాన్ చేసిన రెండవ దండయాత్ర పాత ఐక్యరాజ్య సమితి తీర్మానం కలిగి విద్యాపరమైన విలువలను నాశనం చేసింది.
ఇప్పుడు ఏ ప్రజాభిప్రాయ సేకరణ అయినా కచ్చితంగా భారతదేశ సమగ్రతను ప్రశ్నించడమే అవుతుంది. ఇది వేర్పాటు సమస్యను లేవనెత్తుతుంది . యునైటెడ్ స్టేట్స్ అంతర్యుద్ధం చేసిన ఈ సమస్య… మత ప్రాతిపదికన భారతదేశం యొక్క రెండవ విభజనకు దారితీయడానికి మేము ససేమిరా వొప్పుకోము అని చెప్పేశారు.
రిచర్డ్ నిక్సన్ తో ఆమె 1971 నవంబరు లో జరిపిన సమావేశం నిష్కపటమైనది. అందులో పాకిస్తాన్లో పాక్ సైన్యం హింసను ఎదుర్కొని భారతదేశానికి పారిపోతున్న మిలియన్ల మంది ప్రజల సమస్య అంతర్జాతీయ సమస్య’ అని ఆమె చేసిన విజ్ఞప్తికి ఆయన ఎటువంటి సానుభూతి చూపలేదు.ప్రపంచ ప్రజా సమస్యల పైన ప్రభుత్వాలు నైతికంగా, రాజకీయంగా స్తంభించరాదన్న ఆమె అభ్యర్ధన ను సైతం నిక్సన్ పట్టించుకోలేదు.
రెండో సమావేశంలో ఇందిరను 45 నిమిషాల పాటు వేచి ఉండేలా చేసినపుడే ఆమెకు విషయం పూర్తిగా అర్ధమైంది. దీనితో పాక్ తో యుద్ధం అనివార్యమని ఆమెకు తెలిసిపోయి భారతదేశం యుద్ధానికి వెళ్లవలసి వస్తే సోవియట్ సైనిక సహాయం చేస్తుందని అధ్యక్షుడు లియోనిడ్ బ్రెజ్నెవ్ , ప్రీమియర్ అలెక్సీ కోసిగిన్ లనుంచి ఆమె హామీలను తీసుకున్నారు.
డిసెంబర్ 3, 1971న, పాకిస్తాన్ వైమానిక దళం తొమ్మిది భారత వైమానిక స్థావరాలపై ముందస్తుగా బాంబులు వేసి అధికారిక దురాక్రమణకు పాల్పడింది. ఇందిర యుద్దానికి పూర్తిగా సిద్ధమైనప్పటికీ ఆమె మొదట దాడి చేయడానికి ఇష్ట పడలేదు కానీ అదే రోజు రాత్రి ఆమె మంత్రివర్గం అత్యవసర సమావేశం నిర్వహించి ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఆమె ‘మనపై పాక్ బలవంత యుద్ధం’ అని దేశానికి రేడియో వార్తను ప్రసారం చేసింది.
మరుసటి రోజు ఉదయం, ఆమె పార్లమెంటులో మాట్లాడుతూ : ‘తొమ్మిది నెలలకు పైగా పశ్చిమ పాకిస్తాన్ సైనిక పాలన బంగ్లాదేశ్లో స్వేచ్ఛ మరియు ప్రాథమిక మానవ హక్కులను అమానుషంగా తుంగలో తొక్కింది. ఆక్రమణ సైన్యం వారి ప్రతీకార క్రూరత్వం వల్ల అనేక లక్షల మంది నిర్మూలించ బడ్డారు.మరో పది లక్షల మంది మన దేశంలోకి నెట్టబడ్డారు.ఈ మొత్తం ప్రజల వినాశనం గురించి, మన దేశ భద్రతకు ఈ ముప్పు గురించి మేము పదేపదే ప్రపంచం దృష్టికి తెచ్చాను అన్నారు.
తరువాత వాజపేయి తో ఆమె సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం మరునాడు రాత్రి భారత సైన్యం డాఖా పై ముప్పేట దాడికి దిగి ప్రతీకారం తీర్చుకుంది. ఇందులో 270 అమెరికన్ పట్టాన ట్యాంకర్లను భారత్ సైన్యం ధ్వంసం చేసి వారి టెక్నాలజీ ను పరిహసించింది. రెండు రోజుల తర్వాత, బంగ్లాదేశ్ ను స్వతంత్ర దేశంగా భారతదేశం గుర్తిస్తున్నట్లు ఆమె పార్లమెంటులో ప్రకటిస్తూ ,పాక్ పైన తమది కేవలం సైనిక విజయం కాదని సమస్యలపైన స్పందించని ఇతర దేశాలకు ఇది విదేశాంగ విధాన తిరుగుబాటు అని ఆమె ధైర్యంగా చెప్పడమే కాక అలనాడు నిక్సన్ చూపిన అహంకారాన్ని సమూలంగా అణచివేశారు.

– డాక్టర్ చల్లా జయదేవ్
సీనియర్ జర్నలిస్ట్, చెన్నై

LEAVE A RESPONSE