-హాస్టల్ విద్యార్థులకు నాడు చంద్రబాబు చికిన్ తో కూడిన భోజనం.. జగన్ పాలనలో పచ్చడి మెతుకులు
– నేటి ధరల్లో ఒక విద్యార్థికి నెల మొత్తం రూ.1250 తో భోజనం పెట్టడము సాధ్యమా?
– 2018 సంవత్సరం లో చంద్రబాబు గారు పెంచిన మెస్ చార్జీలు తప్ప,జగన్ గారు ఈ మూడు సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా పెంచలేదు.
– పెరిగిన ధరలకు అనుగుణంగా ముందు మెస్ చార్జీలు పెంచి, తరువాత విజిలెన్స్ తనిఖీలు చేయించండి
– కనీస వసతులు కూడా లేవు,ముందు హస్టల్స్ లో కనీస వసతులు ఏర్పాటు చేయండి
– తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి
కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో కోవూరు మాజీ జడ్పీటీసీ సభ్యులు,తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. 2018 వ సంవత్సరంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు హాస్టల్ విద్యార్థులకు పెంచిన మెస్ చార్జీలు తప్ప జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్క రూపాయి కూడా మెస్ చార్జీలు పెంచలేదు.
ఇదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.గ్యాస్ సిలెండర్ నాడు రూ.400 ఉంటే నేడు రూ.1100 కి చేరింది.అదేవిధంగా అన్ని రకాల ధరలు పెరిగాయి.అటువంటి పరిస్థితులలో మెస్ చార్జీలు పెంచక పోవడంతో వార్డెన్లు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టలేక పోతున్నారు.
నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో అప్పటి వరకూ ఇస్తున్న మెస్ చార్జీలను రూ.750 నుండి రూ.1250 కి పెంచడమే కాకుండా, వారానికి మూడు రోజులు చికిన్ తో కూడిన భోజనం,వారానికి 6 రోజులు కోడి గుడ్డు ఇచ్చేవిధంగా మేనులో మార్పులు చేసి అమలు చేశారు.ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో మెస్ చార్జీలు పెంచక పోవడంతో పిల్లలకు పచ్చడి మెతుకులే పెడుతున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 వ తేదీ లోపు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని జి ఓ నంబర్ 82 లో 2018 వ సంవత్సరం లో తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
వైసీపీ ప్రభుత్వం 2019 మే నెలలో అధికారంలోకి వచ్చింది.జి ఓ నెంబర్ 82 ప్రకారం వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ నాలుగు సార్లు మెస్ చార్జీలు పెంచవలసి ఉండగా ఒక్కసారి కూడా పెంచలేదు.అటువంటి అప్పుడు వార్డెన్లు ఏ విధంగా పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టగలరు. ప్రభుత్వం చేయవలసింది చేయకుండా హస్టల్స్ పై విజిలెన్స్ అధికారులతో దాడులు చేయించితే ఉపయోగం ఏముంటుంది.ముంది పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచి తరువాత మెనూ ప్రకారం భోజనం పెట్టని వార్డెన్లు పై చర్యలు తీసుకోవాలి.
అనేక హస్టల్స్ లో భవనాలు శిథిలావస్థకు చేరి వర్సానికి ఉరుస్తున్నాయి.విద్యార్థులు వర్షంలోనే తడుస్తూ బిక్కు,బిక్కు మంటూ గడుపుతున్నారు.చాలా హస్టల్స్ లో కనీస వసతులు కూడా లేవు.కావున ప్రభుత్వం వెంటనే హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేయించడం తో పాటు,కనీస వసతులు కల్పించాలి.
గతంలో హాస్టల్ విద్యార్థులకు నాలుగు జతలు యూనిపారంలు, రెండు దుప్పట్లు,నోట్ పుస్తకాలు ఇచ్చేవారు.ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత వాటిని కూడా ఇవ్వడం లేదు.చివరకు విద్యార్థులు కు ఇవ్వవలసిన కాస్మొటిక్ చార్జీలు కూడా ఇవ్వడం లేదు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నదుల రవి కుమార్,కలికి సత్యనారాయణ రెడ్డి,జక్కంరెడ్డి భాస్కర రెడ్డి,మారుబోయిన వెంకటేశ్వర్లు,ఇందుపూరు మురళీకృష్ణ రెడ్డి,ఇంటూరు విజయ్ ,యెస్ కె నాజీర్, గొర్రిపాటి నరసింహ,దువ్వురు రంగారెడ్డి, యెస్ కె ఖాళీలు, చల్లా మురళీకృష్ణ,తాళ్ళపాక లక్ష్మయ్య,భగవాన్,యెస్ డి సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.