పవన్‌ కల్యాణ్‌ తప్పులో కాలేస్తున్నారా?

– ఏపీ సీఎం పదవిపై ఆశ
– కలసిరాని ‘కమలం’
– టీడీపీతో పొత్తుపై అస్పష్టత
– జనసేనకు నిర్మాణ లోపమే అసలు సమస్య
– వ్యవస్థీకృతం కాని పార్టీ యంత్రాంగం
– వ్యూహకర్తలు లేకుండా నిర్ణయాలు
– పవన్‌ ఆలోచనలే పార్టీకి ఆధారం
– జనసేనలో కనిపించేది పవన్‌-మనోహర్‌ ఇద్దరేనా?
– అందుకే ‘ఇప్పటం’లో పార్టీ పరువు పోయిందా?
-వ్యూహకర్తలు లేకనే ‘ఇప్పటం’లో దెబ్బతిన్నారా?
– నియోజకవర్గస్థాయి నేతలు లేని దుస్థితి
– పీఆర్పీ మాదిరిగా కనిపించని పెద్ద నేతలు
– అగ్రనేతల వల్లే నాడు పీఆర్పీకి 74 లక్షల ఓట్లు
– ఫ్యాన్స్‌ పార్టీని అధికారంలోకి తీసుకువస్తారా?
– కాపులపై పవన్‌ అస్పష్ట వైఖరి
– తనకు కులం లేదని చెప్పిన పవన్‌
– మరి కాపులు పవన్‌ను సొంతం చేసుకుంటారా?
– కాపు నియోజకవర్గాల్లోనే ఓటమి పాలయిన పవన్‌
– పవన్‌ రాజకీయ లక్ష్యం నెరవేరుతుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన వస్తే అలజడి. నేల ఈనిందా? ఆకాశం దద్దరిల్లిందా.. అన్నట్లుండే జనసంద్రం. ఎక్కడికి వెళ్లినా యువతరంగ ఈలలు, గోలలే. అభిమానుల కేరింతల కెరటాలే ఆయనకు ఏనుగంత బలం. ఆయన ప్రశ్నిస్తే ఉరుములే. మాట్లాడితే మెరుపులే. ఆయన ఆ ప్రాంతం నుంచి వెళ్లేవరకూ తుపానే. ఆ తర్వాతనేPawan-Kalyan ప్రశాంతత. ఇదంతా ఒకవైపే. మరోవైపు ఆయనలో బోలెండంత మానవత్వం. చిన్నపాటి ఘటనకే చలించే సున్నిత మనస్తత్వం. ఆపన్నులను ఆదుకునే ఆపద్బాంధవుడు. కలసి వెరసి ఆ జన ప్రభంజనం పేరే పవన్‌ కల్యాణ్‌. జనసేనాధిపతి!

అయినా ఈ సినీ బాహుబలి ఎన్నికల రణరంగంలో ఘోరపరాజయం పాలయ్యారు. కారణం వ్యూహలోపం!! పార్టీకి వ్యూహకర్తలు లేని దయనీయం. రాజు-భటుడూ అంతా ఆయనే. అక్కరకు రాని అభిమానుల అరుపులు. ఓట్లు కురిపించని ఫ్యాన్స్‌ కేకలు. పార్టీలో పవన్‌ తప్ప, మిగిలినవారంతా పులుసులో ముక్కలే. మరి సీఎం కావాలన్న పవన్‌ లక్ష్యం ఎలా నెరవేరుతుంది? రాజకీయాల్లో జనసేన ‘గాజుగ్లాసు’ ఎందుకు మెరవడం లేదు? ఇవీ ఇప్పుడు జనసైనికులను వేధిస్తున్న ప్రశ్నలు.

మరో ఏడాదిన్నరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో, జయభేరి మోగించాలన్న జనసేన కోరిక ఫలిస్తుందా? సీఎంగా తనకు ఒక్క చాన్సు ఇవ్వాలన్న, జనసేనాధిపతి పవన్‌ కోరికను జనం నెరవేరుస్తారా? ఆ క్రమంలో ఆయన తప్పటడుగులు వేస్తున్నారా? అన్న అంశాలపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చpavan2 జరుగుతోంది. ఆ సందర్భంలో పవన్‌ లక్ష్యం నెరవేరే క్రమంలో, జనసేన ముందున్న సవాళ్లను ప్రస్తావిస్తున్నారు. పార్టీ నిర్మాణం, నియోజకవర్గ స్థాయి నేతలు లేకుండా.. ఎనిమిదేళ్ల నుంచి పార్టీలో వన్‌మ్యాన్‌షో నడుస్తుండటమే, జనసేన విస్తరణకు ప్రధాన సమస్య అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పుడు, ఆయన వెంట కాంగ్రెస్‌ మహామహులంతా టీడీపీలో చేరారు. నాదెండ్ల, జానారెడ్డి, నల్లపురెడ్డి, బెజవాడ గోపాలకృష్ణారెడ్డి వంటి అగ్రనేతలంతా ఎన్టీఆర్‌ వెంట నిలిచారు. నియోజకవర్గాల్లో ప్రముఖులైన డాక్టర్లు, వ్యాపారస్తులు, యువకులను గుర్తించి.. వారికి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించారు. టీడీపీ స్థాపించిన తర్వాత, గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకూ పార్టీ నిర్మాణం చేశారు. శిక్షణా శిబిరాలు, సభ్యత్వాలు నిర్వహించారు.

చంద్రబాబు చేరిన తర్వాత కార్యకర్తల వివరాలు, పార్టీ కార్యక్రమాలను కంప్యూటరైజ్‌ చేశారు. శిక్షణా శిబిరాలను కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ లేకపోయినా, టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉండటానికి అవే కారణాలన్నది సుస్పష్టం. అందుకే టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. రాజకీయాల్లో తన గుర్తింపు చాటుకుని, స్థిరంగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కూడా టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి భారీ సంఖ్యలో అగ్రనేతలు చేరారు. కేంద్రమాజీ మంత్రి శివ శంకర్‌, భూమా నాగిరెడ్డి, ఉమ్మారెడ్డి, సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస్‌, ఆమంచి కృష్ణమోహన్‌, హరిరామజోగయ్య వంటి ప్రముఖులు చిరంజీవి వెంట నిలిచారు. నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్‌-టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, అగ్రనేతలు చేరడంతో క్యాడర్‌ పీఆర్పీ బలంగా కనిపించింది. ఫలితంగా 74 లక్షల ఓట్లు సాధించిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

కానీ జనసేన పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉండటమే, ఆ పార్టీ వెనుకబాటుకు కారణమని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ 175 నియోజకవర్గంలో పోటీ చేసే స్థాయి గల నేతలు పార్టీకి లేరంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో 25 నుంచి 30 నియోజకవ ర్గాలకు మాత్రమే అసెంబ్లీకి పోటీ చేసే స్థాయి ఉన్న నేతలే కనిపిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు.

మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తప్ప, చెప్పుకోదగిన వారెవరూ పార్టీలో కనిపించరు. వేదికపై కూడా ఆ ఇద్దరే కనిపిస్తుంటారు. నిజానికి నాదెండ్ల మనోహర్‌ రాజకీయ వ్యూహకర్త కాదు. కాంగ్రెస్‌లో కూడా కీలకపాత్ర పోషించిన నేత కూడా కాదు. వైఎస్‌ హయాంలో కులసమీకరణలో భాగంగానే , ఆయనకు స్పీకర్‌ పదవి లభించిందని గుర్తు చేస్తున్నారు. మనహ ర్‌ ఎప్పుడూ తన గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో కూడా బలమైన, ప్రభావం చూపే నేతగా ఎదగని విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికీ నాదెండ్ల సొంత గుంటూరు జిల్లాలో, జనసేన బలహీనంగానే ఉన్న విషయాన్మి విస్మరించకూడదంటున్నారు.

ఆయన ఫోన్లు తీయరని, మిగిలిన వారితో మాట్లాడరన్న విమర్శలున్నాయి. తాను సీఎం స్థాయి నాయకుడన్న భావనలో ఉంటారన్న విమర్శలూ లేకపోలేదు. ఇప్పటిదాకా పవన్‌ నిర్ణయించి.. మనోహర్‌కు చెబితే, ఆయన పార్టీ నేతలకు సమాచారం ఇవ్వడమే తప్ప… నాదెండ్ల తనంటూ సొంత ఆలోచనలు చేయరని, అటు పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి.

పైగా కమ్మ సామాజికవర్గానికి చెందిన మనోహర్‌, ఎప్పుడూ తమ అధినేతపవన్‌ పక్కన ఉండటాన్ని కాపు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. టీడీపీతో పొత్తు ఉంటే .. తన తెనాలిలో జనసేన కాపుల ఓట్లతోపాటు, టీడీపీ కమ్మ వర్గం ఓట్లతో గెలవచ్చన్న కోణం కూడా నాదెండ్లలో లేకపోలేదని జనసైనికులు బహిరంగంగానే చర్చింకుంటున్నారు.

మరోవైపు పవన్‌ వద్ద ఉన్న.. మిగిలిన ఒకరిద్దరికీ రాజకీయానుభవం లేదన్న వ్యాఖ్యలు, సొంత పార్టీలోనే చాలాకాలం నుంచీ వినిపిస్తున్నాయి. పవన్‌కు నచ్చచెప్పగలిగే స్థాయి, సాహసం ఇప్పుడున్న రాజకీయ సలహాదారులకు లేవని స్పష్టం చేస్తున్నారు. మనోహన్‌ మినహా మిగిలినవారంతా ఉద్యోగులే తప్ప, పవన్‌కు సరైన దిశానిర్దేశం చేసే సలహాదారులు కాదని చెబుతున్నారు.

వ్యూహకర్తలు లేని కారణంగానే.. ఇటీవల పవన్‌ పర్యటించిన ఇప్పటం గ్రామంలో, పార్టీ పరువు పోగొట్టుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. అధికారులు కేవలం ప్రహరీగోడలు కూలిస్తే.. దానికి బదులుpavan-ippatamవారి ఇళ్లుకూల్చారంటూ పవన్‌ హడావిడి చేసి, బాధితులకు ఆర్ధికసాయం చేశారు. అయితే, వారంతా తమకు నోటీసులు ఇచ్చిన నిజాన్ని దాచిపెట్టినందుకు, కోర్టు వారందరికీ లక్షరూపాయల చొప్పున జరిమానా విధించింది. ఎవరో ఇచ్చిన సమాచారం ఆధారంగా.. హడావిడి చేసిన పవన్‌ పరువు, హైకోర్టు తీర్పుతో పోయినట్టయిందని చెబుతున్నారు. సరైన వ్యూహకర్తలు లేకపోతే ఇలాంటివే జరుగుతాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

పవన్‌ సినిమా షూటింగులు లేనప్పుడే రాజకీయాలు చేస్తున్నారని.. పార్ట్‌టైం పాలిటిక్స్‌ చేస్తే, అధికారం ఎలా వస్తుందన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఫుల్‌టైం పాలిటిక్స్‌ చేసే చంద్రబాబు లాంటి సీనియర్లే, జగన్‌తో యుద్ధం చేయలేకపోతున్నారని గుర్తు చేస్తున్నారు. ఇది కూడా జనంలో జనసేనపై పెద్దగా నమ్మకం లేకపోవడానికి మరో ప్రధాన కారణమంటున్నారు.

ఇక విశాఖ ఉక్కు, అమరావతి, ప్రత్యేక హోదా వంటి ప్రధాన అంశాలపై పోరాడిన పవన్‌.. వాటిపై తన మిత్రపక్షమైన బీజేపీని ప్రశ్నించకుండా, ఆ అంశాలను అటకెక్కించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాలను కూడా ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్న పవన్‌, రాజకీయాల్లో ఏం సాధిస్తారన్నpavan-modiవ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పేరుకు మితపక్షమైనా బీజేపీ.. పవన్‌ను, ఎప్పుడూ పట్టించుకున్న దాఖలాలు లేవంటున్నారు. ఇటీవల చంద్రబాబును కలిసిన తర్వాతనే.. ప్రధాని ఆయనను పిలిపించారే తప్ప, పవన్‌పై ప్రేమతో కాదని స్పష్టం చేస్తున్నారు.

టీడీపీతో పొత్తుపై కూడా పవన్‌లో స్పష్టత లేదంటున్నారు. ఒకసారి తానే సీఎం అవుతానని, మరోసారి జగన్‌ను దించేందుకు తగ్గుతానని, మళ్లీ తనకు ఒక అవకాశం ఇవ్వాలన్న పవన్‌ ప్రకటనలు, ఆయన రాజకీయ అవగాహనా రాహిత్యం- అస్పష్ట వైఖరిని సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ప్రధానంగా కాపుల పార్టీ అని జనసేనపై ముద్రపడిన్పటికీ, దానివల్ల తమకు ఉపయోగం లేదని జనసేన నేతలే చెబుతున్నారు. ఒకసారి తనకు కులం లేదని, ఇంకోసారి కాపుల గురించి ఎందుకు ఆలోచించరని మాట్లాడే పవన్‌ను, కాపువర్గం ఎందుకు సొంతం చేసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు.ఈ కారణంగానే కాపుల సంఖ్య ఎక్కువగా ఉన్న రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేస్తున్నారు.

విశాఖ ఘటనలో, కాపుల్లో వచ్చిన చైతన్యం- ఆగ్రహాన్ని అవకాశంగా మలచుకోవడంలో పవన్‌ విఫలమయ్యారన్న వ్యాఖ్యలు, పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అదే టీడీపీ ఆఫీసుపై వైసీపీ దాడి తర్వాత, కమ్మ సామాజికవర్గం మేల్కొని, టీడీపీకి దన్నుగా నిలిచిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.

Leave a Reply