లంపి స్కిన్ వ్యాధి మృత్యువాతపడుతున్న మూగజీవాలు

2025 వరకు టీకా మోక్షం లేదు

గత కొన్ని నెలలుగా, భారతదేశం అంతటా మరొక వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. ఈసారి పశువులను ప్రభావితం చేస్తుంది. లంపి చర్మ వ్యాధి అనేది పశువుల యొక్క వైరల్ వ్యాధి. ఇది తరచుగా ఎపిజూటిక్ రూపంలో సంభవిస్తుంది. ఈ వ్యాధి చర్మంలోని నోడ్యూల్స్ విస్ఫోటనం ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది జంతువు యొక్క శరీరం మొత్తాన్ని కప్పివేస్తుంది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ తో  సహా పద్దెనిమిది  పైగా రాష్ట్రాల్లో ఈ వ్యాధి కారణంగా మూడు లక్షల పైగా  పశువులు చనిపోయాయి. లంపి స్కిన్ డిసీజ్ రాజస్థాన్‌లో భయంకరమైన వేగంతో వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు గుజరాత్, రాజస్థాన్ లోనే 70,000 కంటే ఎక్కువ జంతువులు, ప్రధానంగా ఆవులు మరణించాయి. దాదాపు  రెండు లక్షల  పశువులకు ఈ వ్యాధి సోకింది.  లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్‌ఎస్‌డి) అనేది పాక్స్‌విరిడే కుటుంబానికి చెందిన వైరస్ వల్ల పశువులలో వచ్చే అంటు వ్యాధి. దీనిని నీత్లింగ్ వైరస్ అని కూడా పిలుస్తారు.

గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్‌లు మరియు ఇమ్యునైజేషన్ (GAVI) నివేదిక ప్రకారం, లంపి స్కిన్ డిసీజ్ (LSD) వ్యాధి Capripoxvirus అని పిలువబడే వైరస్ వల్ల వస్తుంది. ఇది “ప్రపంచవ్యాప్తంగా పశువులకు ముప్పుగా మారుతోంది”. ఇది గోట్ పాక్స్, షీపాక్స్ వైరస్ కుటుంబానికి సంబంధించినది. ఇది రక్తాన్ని తినే కీటకాలు, ఈగలు, దోమలు లేదా పేలు ద్వారా వ్యాపిస్తుంది. ఇది జ్వరం, మరియు చర్మంపై నోడ్యూల్స్ మరణానికి కూడా దారితీస్తాయి. వ్యాధి సోకిన పశువులు కూడా వాటి అవయవాలలో ఎడెమాటస్ వాపును అభివృద్ధి చేయవచ్చు మరియు కుంటితనం వస్తుంది. లంపి స్కిన్ డిసీజ్ వల్ల దీర్ఘకాలిక బలహీనత, పాల ఉత్పత్తి క్షీణించడం, పెరుగుదల మందగించడం, వంధ్యత్వం, గర్భస్రావం మరియు కొన్నిసార్లు మరణానికి దారితీస్తుంది.

లంపి స్కిన్ డిసీజ్ దోమలు, పేలు, ఈగల ద్వారా ఇతర జంతువులకు వ్యాపిస్తుంది. వ్యాధి ఉన్న జంతువుల నుండి ఫోమైట్స్ ద్వారా లంపి స్కిన్ వ్యాపిస్తుంది. లంపి స్కిన్ డిసీజ్ రక్తం పీల్చే కీటకాలు, కొన్ని రకాల ఈగలు మరియు కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా వ్యాపిస్తుంది. ప్రస్తుతానికి లంపి స్కిన్ డిసీజ్ కు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఈ వ్యాధి సోకిన జంతువుల్లో కనిపిస్తున్న లక్షణాలను బట్టి చికిత్స అందిస్తున్నారు. LSD నిర్మూలన కష్టతరమైనది. అయితే ఈ వ్యాధిని నియంత్రించడానికి ముందస్తుగా గుర్తించడమే మెరుగైన మార్గం అని వైద్యులు చెబుతున్నారు.ఆపత్కాలంలో పట్టించుకునే వారు కరువయ్యారు.

సృష్టిలో జీవులన్నీ సమానమే.  ఈ మధ్యకాలం లో గో మాత గురించి రాష్ట్రీయ కామధేను యోజన పేరుతో  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు  అన్ని విద్యాసంస్థలలో  గోవు ప్రయోజనాలు, లాభాలు, గోవు మూత్రం పై మూడు స్టేజీలు  పరీక్షలు నిర్వహించారు.  విభజన అనేది మనుషుల నుండి మొదలై పశువులు వరకు ప్రాకింది. దేశంలో ఎన్నో సమస్యలుండగా  కేవలం గోవు మీదే మన దృష్టి. అంగట్లో  ఆవు మూత్రం  వంద యం ఎల్  వంద రూపాయలు పెట్టి కొంటున్నారు , ఇంత కంటే దారుణం ఏముంటుంది, అసలు అది ఆవుద, కుక్కదా, గొడ్డుదా, గాడిద మూత్రమా, లేక   మురుగు నీరు పట్టి ప్యాక్ చేస్తున్నారా అని ఎప్పుడు విశ్లేషించలేదు.  గో ఆర్కా, తులసి గో ఆర్కా  అని గో మూత్రం నీటిలో కలుపుకొని త్రాగుతున్నారు మేధావులు. ఇప్పుడు లంప్ స్కిన్ వ్యాధి ఆవుల నుండి సేకరించిన మూత్రం  పనికొస్తుందో లేదో చూడాలి.  అది హోలిస్టిక్ ఫ్రాంక్లిన్, జెర్సీ జాతి లేక హిబ్రీడ్  అవుదా నాటి అవుదా గంగడోలు గోపురం ఉన్న అవుదా కదా అనే జ్ఞానం కూడా లేదు ? ఆవు కామధేనువు, ఆవు జాతీయ సంపద, ఆవు మూత్రం పేడ లేని ప్రపంచమే లేదు  పంచగవ్య, గో అమృతం అని భాకా ఊదే సంస్థలు ఎప్పుడైనా గో మూత్రం మీద పరిశోధన చేశారా?   ఏరోజైనా  మిగతా మూత్రాల మీద రీసెర్చ్ చేశారా ? గో మూత్రంలో ఉన్నదేంటి మిగతా  ముత్రాల్లో లేనిది ఏంటి అనే విశ్లేషణ ఏమైనా చేశారా ?

ఈ దేశంలో గేదె లేక పోతే పాలు లేవు, ఒకప్పుడు ఉన్న ఆవు జాతి ( గిర్, తర్పర్కర్, సింధ్, సాహివాల్ , మల్నాడ్ , దేశపావులు, హాలికర్, పుంగనూరు డ్వార్ఫ్ గేదెలు)  పశు సంపద అంటే అన్ని రకాల పశువులు కేవలం ఆవు మాత్రమే కాదు. ఎనిమిది సంవత్సరాల్లో ఎన్ని పశు  మూత్ర పరిశోధన సంస్థలు నెలకొల్పారు?  ఆవు మూత్రంలో ఉండే విశిష్టత తెలియజేసి, మిగతా ముత్రాల్లో లేనిది తెలియచేస్తే మంచిది. గో  ఆధారిత  ప్రాడెక్ట్స్ కొనే ముందు ఒకటికి రెండుసార్లు  సరి చూసుకోండి.  గృహ ప్రవేశం రోజు  ఆవును అడ్డం పెట్టుకుని మీరు చేసే వ్యాపారం సర్కస్ విన్యాసం అంతా ఇంతా కాదు. గ్రౌండ్ ఫ్లోర్ లో గృహ ప్రవేశానికి  నాలుగు వేలు, మొదటి అంతస్తుకు  ఐదు వేలు, మూడో అంతస్తుకు  ఏడువేలు, ఇంట్లో పేడ వేస్తే  మరో వెయ్యి అదనంగా వసూలు చేస్తున్నారు. నగరాలలో  చెత్త కుప్పల దగ్గర, రోడ్డుకు అడ్డంగా, ప్రధాన కూడళ్లలో ఎక్కువగా ఉన్నా  పట్టించుకునే వారు కరువయ్యారు. ఇక నగరాలలో ఉండే ఆవు వేసే పేడ  మానవ వ్యర్థానికంటే దారుణంగా ఉంటుంది.  గడ్డి తినడం మాని  చాల రోజులయ్యింది.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

Leave a Reply