– బీసీల గురించి బీసీలే మాట్లాడాలా?
– ఓటుకు నోటు దొంగ అని మేం కూడా అనగలం
– అంబేద్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది
-యునైటెడ్ ఫూలె ఫ్రంట్ కన్వీనర్ శివశంకర్
హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులను బలోపేతం చేసింది. బీసీ బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నించడం లేదు. ప్రధాని దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని సీఎం అసెంబ్లీలో చెప్పారు. కాంగ్రెస్ కొందరిని ఢిల్లీకి తీసుకెళ్లి ధర్నా చేయడం విడ్డూరం.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాహుల్ గాంధీ వైఖరి చెప్పాలి. బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదు. బీసీల గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే కాంగ్రెస్ జీర్ణించుకోవడం లేదు. బీసీల గురించి బీసీలే మాట్లాడాలా? రాహుల్ గాంధీ బీసీనా..రేవంత్ రెడ్డి బీసీనా?
బీసీల హక్కుల కోసం కవితక్క మాట్లాడితే అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. ఓటుకు నోటు దొంగ అని మేం కూడా అనగలం. కాంగ్రెస్ నాయకుల నోర్లు ఫినాయిల్‌తో కడగాలి. అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం పెట్టిన ఘనత కేసీఆర్‌ది.
రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత కేసీఆర్‌ది. కవితక్క గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు. బీసీల ఉద్యమానికి కవితక్క నిరంతరం అండగా నిలుస్తున్నారు.