– ‘లీడర్ విత్ క్యాడర్’ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
గాజువాక: టీడీపీ పార్టీ కార్యకర్తలే కొండత అండ.. అటువంటి కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండేందుకు పార్టీ శ్రీకారం చుట్టింది. వారి సమస్యల పరిష్కారానికి లీడర్ విత్ క్యాడర్ కార్యక్రమంతో ముందుకు సాగుతుంది. అందులో భాగంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాకలోని 72 వార్డులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో వార్డ్ ఇంఛార్జ్ అక్కిన లక్ష్మణ రావు నివాసంలో సమావేశం అయ్యారు.
కార్యకర్తల సమస్యలతో పాటు వార్డు సమస్యలపై ఆరా తీసి.. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, కార్యకర్తల సంక్షేమం కోసం యువ నేత లోకేష్ బాబు, ముఖ్యమంత్రి చంద్రబాబులు నిరంతరం కృషి చేస్తున్నారని.. అందుకే గ్రౌండ్ లెవల్ లో నాయకులు పర్యటించి సమస్యలను తెలుసుకునేందుకు నడుం బిగించినట్లు తెలిపారు.
కార్యకర్తలకోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు తో పాటు.. ఆపత్కాలంలో కార్యకర్తలకు అండగా నిలుస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీడీపీ పార్టీనే అన్నారు. అటువంటి పార్టీకీ తోడుగా ఉండి.. ప్రతి ఒక్కరూ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిలో భాగస్వాములం కావాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షసులు చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించి ప్రజారంజక పాలనకు సహకరించాలని కోరారు.