Suryaa.co.in

Telangana

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా?

– కేసీఆర్‌ ముసుగు తొలగిస్తాం
– భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

ఉద్యోగులు, ప్రజల పక్షాన భాజపా పోరాడుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఉద్యోగులకు మద్దతిచ్చేందుకే హైదరాబాద్‌ వచ్చినట్టు తెలిపారు. జీవో 317 ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందన్నారు. బండి సంజయ్‌ శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. భాజపా కార్యాలయంలోకి పోలీసులు బలవంతంగా చొచ్చుకెళ్లి అరెస్టు చేశారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ, కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు .. కేసీఆర్‌ పాలన ఉందని ధ్వజమెత్తారు.

‘‘ తెలంగాణలో మా పార్టీ ధర్మయుద్ధం చేస్తోంది. ధర్మ యుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకెళ్తాం. జాతీయ పార్టీగా కేసీఆర్‌ ముసుగు తొలగిస్తాం. భాజపా పోరాటం ప్రజాస్వామ్య పద్ధతిలో అంతిమ నిర్ణయం వచ్చే వరకు సాగుతుంది. హుజూరాబాద్‌ ఫలితాన్ని తెరాసకు రాష్ట్రమంతా చూపిస్తాం’’ అని జేపీ నడ్డా అన్నారు.

LEAVE A RESPONSE