బంగ్లాదేశ్‌లో హిందువులకు రక్షణేదీ?

బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులకు, ఆలయాలకు రక్షణ కల్పించకపోవడంపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఒంగోలులో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాయి.
ఒంగోలు: మన పొరుగునఉన్న బంగ్లాదేశ్ లో అరాచక ముస్లిం తీవ్రవాదులు అక్కడ మైనారిటిలుగ ఉన్న హిందువులపై దాడులు, హిందూ దేవతా మూర్తుల ధ్వంసం, హిందూ దేవాలయముల కూల్చివేత, హిందూ మహిళలపై అఘాయిత్యాలు చేస్తున్న నేపధ్యంలో.. సాటి హిందువులుగా మనం మన గొంతుకను సవరించి ప్రశ్నించి, నిరసన తెలుపక పోతే, మొద్దునిద్రలో ఉన్న హిందువులను మేల్కొపుటకు, హిందువులలో ఐక్యత సాధించుటకు, బుధవారం విశ్వహిందూ పరిషత్, మాతృశక్తి, ఇస్కాన్ తదితర ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యములో నగరంలో నిరసన ర్యాలి నిర్వహించి, అనంతరం గౌరవ భారత రాష్ట్రపతి గారికి ప్రకాశం జిల్లా కలెక్టరు ద్వారా విజ్ఞాపన పత్రం పంపించారు.
కార్యక్రమములో ముందుగ కేశవ స్వామి పేట దేవాలయముల వద్ద నుండి కలెక్టరేట్ వరకు జై శ్రీరామ్, బంగ్లాదేశ్ హిందువులను కాపాడాలని, భారతదేశంలో ఉండాలంటే వందేమాతర గీత పాడాల్సిందే అంటూ… నినాదాలు చేస్తూ ధార్మిక సంస్థల కార్యకర్తలు నిరసన ర్యాలి నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ ద్వారా భారత రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఇస్కాన్ మందిర మేనేజర్ సుభశ్రీ చైతన్య దాస్ (దేవరపల్లి సుబ్బారెడ్డి) మాట్లాడుతూ, భవిష్యత్ లో భారతదేశం సుభిక్షంగా ఉంటూ ముష్కర మూకలను ఎదుర్కొనాలంటే హిందువులందరూ కులాలను ఇంటిలోనే వదలివేయాలని, మన పక్క దేశంలోని సోదర హిందువులను బాధిస్తూ, దేవాలయములను ధ్వంసం చేస్తూ, దసరా పండుగ రోజున దుర్గా మందిరాలను నేలమట్టం చేసి, హిందువుల గృహసముదాయాలను లూటి చేస్తున్న బంగ్లాదేశంలోని ముస్లిం ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తూ ఉన్నామని, నిప్పు మనంటి దాక రాలేదు కదా అని మిన్నకుంటే అది హిందూ సమాజాన్ని కబళించేస్తుందని హెచ్చరించారు.
కార్యక్రమములో విశ్వహిందూ పరిషత్ ప్రాంత సత్సంగ ప్రముఖ్ సోమా సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లిఖార్జున రావు, కార్యదర్శి పందరబోయిన పున్నారావు, నగరఋఅధ్యక్ష కార్యదర్శులు పసుమర్తి వేంకటేశ్వర్లు, నార్నె మురళికృష్ణ, బజరంగదళ్ సంయోజక్ ఐ. సీతారామయ్య, మాతృశక్తి శ్రీరామనేని సీతాలక్ష్మీ రామానుజ దాసి, ఇస్కాన్ గురుజీలు ఆంజనేయ రఘుపతి ప్రభు, మాధవ నారాయణ్ ప్రభు, ప్రచారక్ రాధా రమణ గుప్తా జంధ్యం, మఠంపల్లి దుర్గేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply