రాజన్న రాజ్యమా?ఇది రాక్షస రాజ్యమా?

94

– రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి

కడప : ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బాబు బాదుడే బాదుడని తనకు ఒక్క చాన్స్ ఇస్తే ఈ బాధలు లేకుండా చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక చేసిన వాగ్దానాలు మరచి విద్యుత్ పన్నులు ఆరు సార్లు పెంచారని,చెత్తపన్ను,ఆస్తిపన్ను,ఓటీఎస్ పన్ను పెంచుకుంటూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రవి శంకర్ రెడ్డి మండిపడ్డారు గురువారం కడప విద్యుత్ భవనం ఎదురుగా పెంచిన కరెంటు చార్జీలను తగ్గించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మక్బూల్ భాష అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ లోనే విద్యుత్ చార్జీలు అత్యధికంగా మన రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా కరెంటు చార్జీలు పెంచిన ఏ ప్రభుత్వం కూడా చాలా రోజుల అధికారంలో లేవు ఇది గుర్తు చేసుకోవాలని ఆయన మన జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. అసలు ఇది రాజన్న రాజ్యమా.? లేక రాక్షస రాజ్యమా.? అని ప్రశ్నించారు.

2019 నుండి రాష్ట్రంలో ప్రజలు కరోనా కష్టాలు, ఇంటి పన్ను, చెత్త పన్నుల పెంపుదలతో ప్రజానీకం సతమతమవుతున్నారన్నారు. దీనికితోడు ఇప్పుడు విద్యుత్ చార్జీలను భారీగా పెంచి జగన్ సర్కార్ షాక్ ఇవ్వటం దుర్మార్గమన్నారు.కేటగిరీలను రద్దుచేసి, 13 స్లాబ్ లను 6 స్లాబ్ లకు కుదించి, కరెంట్ చార్జీలను విపరీతంగా పెంచారన్నారు.పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాలపై విద్యుత్ ఛార్జీల గుదిబండ మోపడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజలపై, నిత్యావసర సరుకుల ధరలు పెంచి కరువు కాటకాలు లో ఉన్న ప్రజల పై మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రతి పక్షంలో చంద్రబాబు పై విమర్శలు చేసిన ఈ పెద్ద మనిషి మూడేళ్ళలో 7 సార్లు శ్లాబులు కుదించి జనంపై భారం మోపాడన్నారు. పేద మధ్య తరగతి ప్రజలపై భారం మోపడం దుర్మార్గమన్నారు పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ప్రజలు తిరగబడితే విద్యుత్ చార్జీలు పెంచిన ఏ ప్రభుత్వాలు కూడా చాలా రోజులు అధికారంలో లేవని నీకు కూడా అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి శేఖర్, పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు లక్ష్మీదేవి, చాపల సుబ్బరాయుడు, బాల చెన్నయ్య, వెంకటేష్, శంకరయ్య, శ్రీనివాస్ రెడ్డి,రాయలసీమ ట్రేడ్ యూనియన్ నాయకులు గంగన్న, పెంచలయ్య, గోవర్ధన్ రావు, శివ, ఆర్ ఎస్ వై ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి శంకర్, ఆప్ కి అవాజ్ నగర నాయకులు కరీముల్లా, రైతు సంఘం నాయకులు ప్రతాప్ రెడ్డి , మునిరెడ్డి, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం కార్యదర్శి వెంకటేష్, అధ్యక్షులు నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.