-విద్యారంగంలో జగన్ రెడ్డి తెచ్చిన విప్లవాత్మక మార్పు ఇదేనా?
-రాష్ట్ర అధ్యక్షుడు,టీఎన్.ఎస్.ఎఫ్ మాణం ప్రణవ్ గోపాల్
జగన్ రెడ్డి పాలనలో పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక, సరైన పౌష్టికాహారం అందక విధ్యార్దులు ప్రాణాలు కోల్పోతున్నారు. నాడు నేడు పేరుతో విద్యారంగంలో మార్పులు తెచ్చామని వైసీపీ ప్రభుత్వ ప్రచారం తప్ప అందులో ఒక్క శాతం కూడా వాస్తవం లేదు. అనంతపురం జిల్లా కక్కలపల్లి పాఠశాల ఆహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గతంలో శ్రీకాకుళం జిల్లా భామిని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 95 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలల్లో విద్యార్దులకు సరైన పౌష్టికాహారం అందించకుండా నాసిరకం బియ్యం, కుళ్లిన కోడి గుడ్లు సరఫరా చేయటం వల్లే విద్యార్ధులు ఆ ఆహారం తిని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. విధ్యార్దులకు కనీసం మంచి ఆహారం అందించలేని ప్రభుత్వం ఎందుకు? మరో వైపు విజయనగరం కురుపాం హాస్టల్ లో పాము కాటుతో ఓ విధ్యార్ధి మరణించాడు. వీటన్నింటికి కారణం విద్యారంగం పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరే కారణం. విధ్యార్దులు ప్రాణాలు పోతున్నా కనీసం ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి స్పందించపోవటం దారుణం. ముఖ్యమంత్రి మెద్దునిద్ర వీడి విద్యార్ధులపై సమస్యలపై దృష్టి సారించాలి.