ప్రభుత్వాసుపత్రులలో మందులు సమకూర్చలేని జగన్…ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థతో ప్రజల ప్రాణాలు కాపాడతామని చెప్పడం పెద్ద జోక్
• 4 ఏళ్లలో జగన్ రాష్ట్ర వైద్యరంగం బలోపేతానికి తీసుకున్నచర్యలేమిటి?
• ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడా వైద్యసిబ్బందిని ఎందుకు నియమించలేదు?
• ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు, మందులు ఎందుకు సరఫరాచేయలేకపోతున్నారు?
• ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కుక్కకాటు, పాముకాటు ఇంజెక్షన్లు కూడా ఎందుకు అందుబాటులో ఉంచలేకపోయారు?
• 4 ఏళ్లలో 49వేలకు పైగా వైద్యసిబ్బందిని నియమించామని జగన్ చెప్పడం పచ్చి అబద్ధం.
– మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
జగన్ తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ఎందుకూ పనికిరాదని, వైద్యరంగాన్ని పూర్తి గా నిర్వీర్యంచేసిన వైసీపీప్రభుత్వం, 4ఏళ్ల నుంచీ ప్రభుత్వఆసుపత్రుల్ని నిర్లక్ష్యంచేసి, తగినం తమంది వైద్యులు, సిబ్బందిని నియమించకుండా కాలయాపనచేసిందని, పీ.హెచ్.సీలు ఉ న్నాయో లేవో అనే అనుమానం ప్రజల్లోఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…
“ప్రభుత్వాసుపత్రుల్లో కనీససౌకర్యాలు కల్పించలేని జగన్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ అనే కామెడీ ప్రోగ్రామ్ కు శ్రీకారంచుట్టింది. ప్రజల్ని కాపాడటానికే 2,875మంది వైద్యులతో వైద్య సేవలు అందించడానికే కార్యక్రమం చేపట్టామని చెప్పడం పచ్చిబూటకం. ప్రభుత్వ వైద్యశాల లు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఎలాంటి వసతులు, సౌకర్యాలు కల్పించకుండా, తగినంత సి బ్బందిని నియమించకుండా, మందులు, ఇతరసామగ్రి అందించకుండా ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని చెప్పడం సిగ్గుచేటు. పేదలకు ఎంతోఉపయోగపడే ఆరోగ్యశ్రీ వ్యవస్థను కూడా జగన్ నిర్వీర్యం చేశాడు. ఆరోగ్యశ్రీ బిల్లులుచెల్లించకపోవడంతో ప్రైవే ట్ యాజమాన్యాలు పేదలకు వైద్యసేవల్ని నిరాకరిస్తున్నాయి.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లో తగినంత సిబ్బందిని, వైద్యపరికరాలు, మందుల్ని అందించలేని ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థతో ప్రజల ప్రాణాలు కాపాడుతుందా?
చంద్రబాబుహాయాంలో ప్రజలకు అందిన వైద్యసేవలెన్నో, ఇప్పుడురాష్ట్రంలో అమలవుతున్న సేవలు ఏమిటో ప్రభుత్వం చెప్పగలదా? తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్, 108, 104 వాహనసేవలు, గిరిజ నప్రాంతాల్లో మొబైల్ వాహనేసేవలు చంద్రబాబు హయాంలో నిర్విరామంగా పేదలకు అందు బాటులో నిలిచాయి. చంద్రబాబు ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడనికి తీసుకొచ్చిన అనేకపథకాల్ని జగన్ రాగానే రద్దుచేశాడు. జగన్ అధికారంలోకి వచ్చాక 108 వాహనాల్ని ఏ2 విజయసాయి వియ్యంకుడి కంపెనీకి ధారాధత్తంచేశాడు. 108 వాహనాలు ఎప్పుడువస్తాయో, ఎక్కడ ఉం టాయో ప్రజలకు తెలియని పరిస్థితి కల్పించాడు. కరోనా సమయంలో ఆక్సిజన్ కూడా అందిం చలేక వందలాదిప్రాణాలు బలిగొన్న జగన్, ఇప్పుడు ఫ్యామిలీడాక్టర్ తో ప్రజల్నిరక్షిస్తాను అనిచెప్పడం ముమ్మాటికీ పచ్చిబూటకం. ఎన్టీఆర్ ఆరోగ్యవిశ్వవిద్యాలయం పేరుమార్చిన జగన్, దానిపరిధిలోని కార్పస్ ఫండ్ నిధుల్ని కూడా కాజేశాడు. జగన్ వైద్యులు, వైద్యసేవల గురించి ఆలోచించేవాడే అయితే ప్రభుత్వవైద్య కళాశాలల్లో సీట్లభర్తీకి సంబంధించి కేంద్రప్రభుత్వంతో, ఎం.సీ.ఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ఎప్పుడైనా మాట్లాడారా? ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో రూ.1300కోట్ల నిధుల్నిచూపి, క్షేత్రస్థాయిలో వాటిని విడుదలచేయలేని అసమర్థ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. జగన్ చెబుతున్న మాటలు, తీసుకొచ్చిన కార్యక్రమాలతో ఇప్పటివరకు ఎంతమందికి ఎలాంటి న్యాయంజరిగిందో చెప్పాలి.
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంకింద కేవలం 2,875 మంది వైద్యులతో రాష్ట్రంలోని ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు ఎలా అందుతాయో ముఖ్యమంత్రి చెప్పాలి
ట్రయల్ రన్ నిర్వహించి, 105 రకాలమందులిచ్చి, 27లక్షల మందికి వైద్యసేవలు అందించి న తరువాతే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ రాష్ట్రమంతా అమలుచేస్తున్నట్టు జగన్ చెప్పాడు. కేవ లం 2,875 మంది వైద్యులతో రాష్ట్రంలోని 5కోట్లమందికి ఉత్తమవైద్యసేవలు అందించడం ఎ లా సాధ్యమో ముఖ్యమంత్రి చెప్పాలి. 4ఏళ్లలోకేవలం 13,987 మంది వైద్యసిబ్బంది, పారామెడికల్ సిబ్బందిని నియమించిన జగన్, 49వేల మందిని నియమించానని చెప్పడం పచ్చిఅబద్ధం. 13,987 నియామకాలుకూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగినవే. ప్రభుత్వా సుపత్రుల్లో కనీసం పారాసెట్మాల్ టాబ్లెట్లుకూడా దొరక్కుండా చేయడమేనా జగన్ వైద్య రంగంలో సాధించినప్రగతి? వాస్తవాలు ఎలాఉన్నాయో తెలుసుకోకుండా ఇప్పటికీ ప్రతిప క్షంలో ఉన్నట్టే జగన్ మాట్లాడుతున్నాడు. అధికారంలోకి వచ్చి4ఏళ్లు అయినా ఇప్పటికీ గతప్రభుత్వంపై నిందలేస్తూ, మోసపూరిత ప్రకటనలతో ప్రజల్ని వంచించడానికి ప్రయత్ని స్తూనే ఉన్నాడు. రాష్ట్రంలోని అన్నీ పీ.హెచ్.సీలు, ప్రభుత్వాసుపత్రుల్లో తగినంత మంది వైద్యసిబ్బంది, మందులు, పరికరాలు ఉన్నాయని జగన్ చెప్పగలడా? రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకుల నిర్వహణ ఎలాఉంది? అత్యవసరపరిస్థితుల్లో రోగులకు సరిపడినంత రక్తం అందుతోందా? పాముకాటు, కుక్కకాటు ఇంజెక్షన్లు ప్రాథమికఆరోగ్యకేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయా? వైద్యం అంటే ప్రజలతో ఆడుకోవడంకాదని జగన్ గుర్తించాలి. రాష్ట్ర వైద్యరంగం స్థితిగతులపై పూర్తివాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయగల దమ్ము, ధైర్యం జగన్ కు ఉన్నయా అని ప్రశ్నిస్తున్నాం. జీతాలు అందక, పనిభారంతో ఆశావర్కర్లు, ఏ.ఎన్.ఎమ్. లు రోడ్లపైకి వస్తున్న విషయం జగన్ కుతెలియదా? రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కళాశాలలు జగన్ నిర్మించాడో చెప్పాలి. వాటి నిర్మాణ పనులు మూడుఅడుగులు ముందుకు, ఏడు అడుగులు వెనక్కుఅన్నట్లు సాగుతుంటే, అన్నీ పూర్తయినట్టు జగన్ కట్టుకథలు చెబుతున్నాడు.” అని ఆలపాటి స్పష్టంచేశారు.