– ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వర్షం కురిసే అవకాశం
– హైదరాబాద్‌లో మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం
– రానున్న రెండు గంటల్లో పిడుగులు పడే అవకాశం
– హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
హైదరాబాద్: రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వర్షం కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది.
శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. పలుచోట్ల వడగళ్లు కురుస్తాయని చెప్పింది. అలాగే ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలైన ఆసిఫాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో శక్తివంతమైన క్యుములోనింబర్ మేఘాలు ఏర్పడ్డాయని.. రానున్న రెండు గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపలతో వర్షం కురుస్తుందని వివరించింది.