– ఎర్రచందనం సాగు అనుమతి తుగ్లక్ ఆలోచన
– ఎర్రచందనం స్మగ్లర్లను ఉక్కు పాదంతో అణిచివేయడం
కేంద్ర ప్రభుత్వం ఎర్రచందనం సాగు చేసుకునేందుకు అనుమతించేలా నిర్ణయం తీసుకోవడం స్మగ్లర్లకు రాజమార్గంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయంతో జాతీయ సంపద, ప్రకృతి సంపదైన ఎర్రచందనం స్మగ్లర్ల పాలవుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఎర్రచందనం విషయంలో తీసుకున్న “తుగ్లక్” ఆలోచనను విరమించుకోవాలి. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో శేషాచలం కొండలు స్మగ్లర్ల చేతిలో నామరూపాలు లేకుండా పోతాయి. శేషాచలం కొండలను “సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్ రూం” పరిధిలోకి తీసుకురండి.
శ్రీవారి ఎర్రచందనం సంపద దేశ విదేశాలకు తరలించడానికి, స్మగ్లర్లు వినియోగించే రెండు మార్గాలు నౌకాయానం, విమానయానం. ఈ రెండు మార్గాల వద్ద “డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్” స్మగ్లింగ్ ను కట్టడి చేసే(DRI) కేంద్ర నిఘావర్గాల సహకారం తీసుకొని, స్మగ్లర్ల భరతం పట్టి ఉక్కు పాదంతో అణిచి వేయాలి.
టిటిడి అటవీ శాఖ అధికారుల జాయింట్ యాక్షన్ ప్లాన్ “ఆపరేషన్ చిరుత” సూపర్ సక్సెస్ అవుతుంది. మరి “ఆపరేషన్ ఎర్రచందనం స్మగ్లర్” లపై ప్రత్యేక దృష్టి ఎందుకు పెట్టడంలేదన్న అనుమానాలు భక్తులలో కలుగుతున్నాయి.
తిరుమల శ్రీవారి శేషాచలం కొండలలో, ఎర్రచందనం స్మగ్లర్ల కదలికలను సీసీ కెమెరాల ద్వారా జల్లెడ పట్టి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఉక్కు పాదంతో అణిచి వేయాలి. టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో.. శేషాచలం కొండలలో ఎర్రచందనాన్ని దర్జాగా తరలిస్తున్న “పుష్పా”ల అణచివేత పై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో.. అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించి, కఠిన నిర్ణయం తీసుకొని శ్రీవారి సంపదను కాపాడాలి.
తిరుమల అలిపిరి నడక మార్గంలో భక్తులపై దాడి చేస్తున్న “చిరుతలను బోనులు పెట్టీ చిటికెలో బందించి పట్టేస్తున్న” టీటీడీ,అటవీ శాఖ అధికారులు.. “పుష్పా” లను బంధించడం పై ఎందుకు దృష్టి పెట్టడం లేదన్న అనుమానాలు భక్తులలో కలుగుతున్నాయి.
తిరుమల శ్రీవారి శేషాచలం కొండలలో నుంచి ఎర్రచందనం దుంగలు, రోడ్లపైకి ఎలా రాగలుగుతున్నాయి? ఎక్సైట్ (EXIT) దారులు ఎంట్రీ (ENTRY) దారులు ఎక్కడెక్కడ ఉన్నాయి?ఎన్ని ఉన్నాయి?అని గుర్తించి ఆయా మార్గాలలో High technology సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి “శేషాచలం కమాండ్ కంట్రోల్ రూమ్” ద్వారా 24×7 పర్యవేక్షించేలా టీటీడీ ఫారెస్ట్ అధికారుల సమన్వయంతో పటిష్ఠమైన చర్యలు చేపట్టాలి.
శేషాచలం కొండల మంచి తరలిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లు.. అధికారుల, భక్తుల దృష్టి మరలించేందుకు తూతూ మంత్రంగా ఎప్పుడు పట్టుబడినా , పదుల సంఖ్యలో ఎర్రచందనం దుంగలతో పట్టుబడుతూ టాస్క్ ఫోర్స్ అధికారుల కన్నుగప్పి “ఇంటి దొంగల” సంపూర్ణ సహకారంతో భారీ మొత్తంలో back door లో తరలించేస్తున్నారా అన్న అనుమానాలు భక్తులలో కలుగుతున్నా యి. ఎర్రచందనం స్మగ్లర్ల కట్టడికి, కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొచ్చి అమలు చేయాలి.