– సృజనాత్మకతను వెలికి తీసే విద్యా విధానం రావాలి
– ఇరవై లక్షల బిల్లుకు రెండు లక్షల పని చేసి, 18లక్షలు దోచేశారు
– మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ లు సృష్టించాలంటే టెక్నాలజీ లాంటి విద్య అవసరం
– మాతృభాషను మరచిపోతే ఎలా?
– అఖిల భారతీయ రాష్ట్రీయ షేక్షిక్ మహాసంఘ్, స్కూల్ ఆఫ్ ప్లన్నిన్ అండ్ ఆర్కిటెక్చర్, ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, సవాళ్లు అనే అంశంపై మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి : రెండు రోజులు పాటు నూతన విద్యా విధానం పై చర్చించడం ఆనందంగా ఉంది. నూతన విద్యా విధానంపై విద్యావేత్తలు అందరూ కలిసి చర్చించారు. యాభై రోజుల పాలనలో ఇంకా నేను నేర్చుకునే పనిలోనే ఉన్నాను. ఎన్నో సాదక బాధకాలు తెలుసుకుంటూ వాటిపై అవగాహన పెంచుకుంటున్నాను.
మీరంతా విద్యావేత్తలు.. మీకన్నా నాకు ఎక్కువ అంశాలు ఇందులో తెలియవు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రావాల్సి ఉన్నా..మరో అత్యవసర సమావేశం వల్ల ఆయన రాలేకపోయారు. గత ఐదేళ్లల్లో మన విద్యా విధానం భ్రష్టు పట్టింది. భారతీయ విద్యా విధానం రూపుమాపి.. బ్రిటీష్ విద్యను అమలు చేశారు.
ఇదే బానిస ఆలోచనలతో ఇంకా ఉంటే.. యువశక్తి ని ఉపయోగించుకునే అవకాశం ఉండదు. వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే విద్యా విధానం రావాలి. భారతీయ విలువను జోడించి, కొత్త విద్యా విధానం అమలు చేయాల్సింది.
బ్రిటీష్ విద్యను అమలు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు అన్యాచం చేశారు.1986 లోకొత్త విద్యా విధానం రాజీవ్ గాంధీ నేతృత్వంలో వచ్చినా.. పూర్తిగా అమలు చేయలేదు.2009 లో నాలెజ్డ్ కమీషన్ తీసుకు వచ్చి .. అందులో కొత్త విద్యా విధానం అమలు చేశారు.ఈ దేశానికి ఇంగ్లీష్ అవసరమని విద్యార్దులపై బలవంతంగా రుద్దారు.గతంలో ఏదైతే బానిస విద్య వద్దనుకున్నామో.. అదే అమలు చేశారు.
ఇటీవల మళ్లీ కొత్తగా అమల్లోకి వచ్చిన విద్యా విధానం వల్ల యువత భవిష్యత్ కు ఉపయోగపడుతుంది.అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే సాధ్యం కాదు.ప్రైవేటు సంస్థలలో రాణించాలంటే.. నైపుణ్య శిక్షణ చాలా అవసరం.ఒక వ్యక్తి ప్రభుత్వంపై ఆధారపడకుండా.. ప్రైవేటు సంస్థలలో కూడా రాణించ వచ్చు.
సమస్యలను, అవరోధాలను అధిగమించి ముందుకు సాగేలా విద్యా విధానం ఉండాలిబట్టీ బట్టి చదువుల వల్ల జీవితంలో ఒడిదుడుకులు ఎలా ఎదుర్కొంటారు.ఏ భాష అయినా మాధ్యమం మాత్రమే.. మాతృభాషను మరచిపోతే ఎలా? చైనా, జపాన్ లు పారిశ్రామికంగా ఎలా ఎదుగుతున్నారో చూడాలి.
ప్రాథమిక విద్య మొత్తం మాతృ భాషలో ఉంటేనే.. వారిలో సృజనాత్మకత బయటకు వస్తుంది. అన్ని దేశాల్లో ఇది అమలవుతున్నా.. మన దేశంలో మాత్రం పర భాష పై మోజు పెరిగింది.ఎనిమిదో తరగతి నుంచి ఇతర దేశల భాషలు నేర్చుకునే అవకాశం కూడా నూతన విద్యా విధానంలో ఉంది.
దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినందువల్ల నేను ఇంజనీరింగ్ పూర్తి చేయలేక పోయాను.ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థ ద్వారా విద్యార్దులకు ఎంతో మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితులు, ఇతర ఇబ్బందులు ఉన్నవారికి కూడా ఈ నూతన విద్యా విధానం ద్వారా ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉంది
టెక్నాలజీ, ఇండస్ట్రీయల్, అగ్రికల్చరల్ రెవెల్యూషన్ వచ్చిన సమయంలో దేశం కూలీలను తయారు చేసింది.గతంలో ఉన్న విద్యావవస్థల ద్వారా ఇతరదేశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి ఉండేది.కొన్ని సంవత్సరాల పాటు ఉపాధి కోసమే కాదు.. విద్య కోసం వలసలు పోయారు.ఇప్పుడు ఉన్న విద్యా విధానం విద్యార్దులకు ఒక వరం లాంటింది.
గత పాలకులు సరైన విద్యా విధానం, ఆర్ధిక విధానం తీసుకురావడంలో విఫలమయ్యారు.నేడు మన దేశం ఆర్ధిక వ్యవస్థగా ఎదిగి అగ్ర దేశాలకు ధీటుగా నిలుస్తుంది.నూతన విద్యా విధానం ద్వారా జరిగే మంచిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా వివరించాలి.అయితే కొన్ని సమస్యలు, సవాళ్లు ఉన్న మాట వాస్తవమే.రిక్రూట్మెంట్ పై తప్పకుండా ప్రత్యేక దృష్టి సారిస్తాం.
రాష్ట్రాలు సహకారం లేకపోవడం వల్ల భారం మొత్తం కేంద్రంపై పడుతుంది. విద్య పై ఏమాత్రం ఖర్చు పెట్టడం లేదనేది వాస్తవం.నాడు నేడు పేరుతో కూడా కేంద్రం డబ్బులతోనే నిర్మాణాలు చేశారు. ఇరవై లక్షల బిల్లుకు రెండు లక్షల పని చేసి, 18లక్షలు దోచేశారు.ఇలా చేస్తే ఇక విద్యా విధానం ఎలా మెరుగు పడుతుంది.విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేర నిధులు ఇస్తున్నాయి.
విద్యార్దుల కోసం కేంద్రంతో పాటు, రాష్ట్రాలు కూడా ముందుకు రావాలి.ఇప్పటి వరకు నూతన విద్యా విధానంలో వచ్చిన ఫలితాలు కేంద్రం వల్లే. ఈ నూతన విద్యా విధానం వల్ల భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుంది.వారిలో ఉన్న సృజనాత్మకత కారణంగా మంచి ఉద్యోగాలు సాధించే అవకాశాలు పెరిగాయి. ఈ నూతన విద్యావిధానం పాలసీ పై సెమీనర్ నిర్వహించటం మంచి పరిణామం.
టీచర్స్, -విద్యార్థులకి ఈ జాతీయ విద్యావిధానం నూతన పాలసీ పై లోతుగా సమగ్రంగా అవగాహన చేస్తున్న ABRSM కి అభినందనలు. ఏదైనా కొత్త సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు వాటిపై ముందుగా మనం అవగాహన చేసుకోవాలి. విద్యార్థులకి నైపుణ్య శిక్షణ ఎంతో అవసరం. విద్యార్థి దశలనే నైపుణ్య శిక్షణ తీసుకరావాలి.
కష్టతరమైన విద్య నుంచి నూతన టెక్నాలజీ పరిజ్ఞానం తో ఉండే విద్యా విధానం అందుబాటులోకి రావటం వల్ల విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. భారత దేశం అభివృద్ధిలో ఈ నూతన జాతీయ విద్యా విధానం పాలసీ కీలక పాత్ర ఉంటుంది. మనదేశంలో ఒక మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ లు సృష్టించాలంటే టెక్నాలజీ లాంటి విద్య అవసరం.
రష్యా,చైనా వర్షం వస్తే ఇక్కడ గొడుగు పట్టుకునే భావజాలంతో ఉన్నారు. బయట దేశాల నుంచి తీసుకొచ్చిన విధానంతోనే ఇప్పటికి విధానాలు నడుస్తున్నాయి. అందుకే దీన్ దయాల్ లాంటి కార్యక్రమాలతో లోకల్ తయారీ విధానానికి స్వాగతం పలికాము. అమెరికా లాంటి దేశాలలో ఎక్కువ విద్య పై ఖర్చు పెడుతున్నారు. మన దేశంలో కూడా విద్య పై ఎక్కువ ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతాయి.
చాలా రాష్ట్రాలు విద్య పై ఖర్చు పెడితే మెరుగైన వసతులు, మెరుగైన విద్య ని అందించగలగుతాం. నాడు నేడు పథకం తీసుకొచ్చి కొంచెం ఖర్చు పెట్టి మరికొంత పక్క దారి పట్టిస్తే ఎలా విద్యా విధానం మెరుగుపడుతుంది. అందుకే విద్యార్థుల్లో నైపుణ్య శిక్షణ కలిపించేందుకు అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నాము.