Suryaa.co.in

Andhra Pradesh

జిందాల్ లో నష్టపోతున్న గిరిజనుల ను బెదిరించడం సరికాదు

– ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్

బొడ్డవర: జిందాల్ కంపెనీ కోసం భూములిచ్చి నష్టపోతున్న దళిత గిరిజనులకు మేలు చేయాలని భూములు ఇచ్చినప్పుడు చేసుకున్న ఒప్పందాలు అమలు చేయాలని ఆందోళన చెందుతున్న రైతులకు మద్దతుగా ప్రజా సంఘాలు, పార్టీలు పోరాడుతుంటే జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న స్వయానా కలెక్టరే బెదిరించడం సమంజసం కాదని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ కోరారు.

బొడ్డవరలో ఆందోళన చెందుతున్న నిర్వాసితులకు మద్దతుగా మాట్లాడుతూ.. నిర్వాసితులందరూ ఎవరో మభ్యపెడితే ఆశ పెడితే ఆందోళనకు దిగలేదని కేవలం రెండు లక్షల ఐదు వేలకి భూమి తీసుకుంటే ఎలా అని, ఆరోజు ఇస్తామని ఉద్యోగం ఆరోజు ఇస్తానన్న ఉపాధి ఇవ్వకుండా, ఆరోజుకి జిందాల్ కి భూమలిస్తే ఆ భూమిని ఎవరికో సైట్ లో వేసి దారా దత్తం చేస్తే మాకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఇచ్చిన మా పిల్లలు ఏమైపోతారని ప్రజల్లో దళితులు ఆందోళన చెందుతున్నారన్నారు. వారికోసం ఒక్క మాట మాట్లాడకుండా జిందాల్ ప్రతినిధులమాదిరిగా కలెక్టర్ ఇతర ప్రజాప్రతినిధులు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు

గిరిజనలకు దళితులకు మేలు చేయాలంటే చట్టాలే కాకుండా.. సామాజిక న్యాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు , భూమి తీసుకుని 18 ఏళ్లయినా కంపెనీ నిర్మించని జిందాల్ ని ఏమనకుండా.. భూమి కోసం పోరాడుతున్న నిర్వాస్తులని వారికి మద్దతిస్తున్న వారిని బెదిరించడం సరికాదన్నారు ఎప్పటికైనా చట్టం ప్రకారం పేదల వద్ద తీసుకున్న పేదలకి అప్పగించి, మరలా ఆ పేదల వద్ద నుంచే భూసేకరణ చేసి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగా కల్పిస్తే ఎవరు అడ్డురారన్నారు.

కలెక్టర్ ఇతర ప్రజాప్రతినిధులు ఎంత బెదిరించిన నిర్వాసులు పోరాడుతూనే ఉంటారు వారికి ప్రజాసంఘాల మద్దతి ఇచ్చి పోరాటాన్ని ఉదృతం చేస్తామన్నారు, నిర్వాసితుల్ని కాకుండా కలెక్టర్ ని ప్రజాప్రతినిధులను తప్పుతో పట్టిస్తున్నది జందాలేనన్నారు.

LEAVE A RESPONSE