Suryaa.co.in

Features

ఇండియా అనే పేరు పెట్టినది ఇంగ్లీష్ వారు కాదు..

– పారసీకులు హింద్ ని, గ్రీకులు ఇండ్ అనే పదాలను సృష్టించారు
– వేదాలు,ఉపనిషత్తులు,ఇతిహాసాలు మొ.వానిలో ఎక్కడా హిందూ అనే పదం కనపడదు
– ఆధునిక ఐరో పావాసులు మన దేశాన్ని ఇండియాగా పిలిచారు

క్రీ.పూ.6వ శతాబ్దంలో పారశీక చక్రవర్తులు మధ్యధరా సముద్రం నుండి, మన దేశ హద్దుల దాకా జయించారు. అనంతరం వారు సింధు,పంజాబు ప్రాంతాలను జయించారు. అచట ఉన్న పెద్దనది సింధు పేరు మీదుగా, ఆ ప్రాంతానికి సింధు దేశం అన్న పేరు ఉండేది. పారశీక భాషలో స బదులు హ పలుకుతారు. కనుక ఆప్రాంతా న్ని హింద్ అని పిలిచారు. పారసీకుల అఖామినియన్ సామ్రా జ్యములో హింద్ 20 వ శాత్రపీ గా ఉన్నదని హెరొడోటాస్ (Father of the historians)అనే చరిత్ర కారుడు వ్రాసాడు.

తరువాత 4వ శ.బీసీ లో అలెగ్జాండర్ 3వ డేరియస్ ను ఓడించి, పారసీక సామ్రాజ్యాన్నీ ఆక్రమించాడు. తర్వాత 326 BC లో హింద్ మీద దాడి చేసి పంజాబ్,సింద్ లను ఆక్రమించాడు. గ్రీకులు హింద్ ను ఇండ్ అని పిలిచారు.(Hind_ Ind).

వారి చరిత్రలలో ఈ దే శాన్ని India గాపిలిచారు. మెగస్తనీస్ తన పుస్తకాన్ని ఇండికా అన్నాడు. ఈ రకం గా పారసీకులు హింద్ ని, గ్రీకులు ఇండ్ అనే పదాలను సృష్టించారు. కానీ ఈ పదాలకు బహుళ ప్రచారం కల్పించిన వారు వేరే ఉన్నారు.

మధ్య యుగాలలో మన దేశం పై దండె త్తి,ఆక్రమించిన మహమ్మ దీయులు,అరబ్బులు, తురుష్కులు,ఆఫ్ఘన్ లు. అందరూ మన దేశాన్ని హింద్/హిందూస్తాన్ అని, ఇచటి ప్రజలు అనుసరిస్తూ ఉన్న మతాన్ని హిందూమతము అని పిలిచారు. మొగలుల కాలానికి మనము కూడా, కాబోలు అనుకొని హిందూ అనే పదం వాడటం మొదలెట్టాము.

చూడండి మన ప్రాచీన పవిత్ర గ్రంథాలలో…వేదాలు,ఉపనిషత్తులు,ఇతిహాసాలు మొ.వానిలో ఎక్కడా హిందూ అనే పదం కనపడదు. ఎందుకంటే అది మనం పెట్టుకొన్నది కాదు. పశ్చిమ ఆసియా దండయాత్రీకులు మనకు పెట్టిన పేరు.

అలాగే గ్రీకులననుసరించి ఆధునిక ఐరో పావాసులు మన దేశాన్ని ఇండియా
గా పిలిచారు. మొదట వచ్చిన పో ర్చుగీ సు లు, తరువాత డచ్చి, ఫ్రెంచ్, ఇంగ్లీష్, ఇతర యూరోపియనులు అందరూ మన దేశాన్ని, గ్రీకులను అనుసరించి ఇండియా అని పిలిచారు.

వారు 16 వ శ తాబ్ద0 మొదట పెట్టిన కంపెనీ లు అన్నీ, East India Company లే.కనుక ఇండియా అనే పేరు ఇంగ్లీష్ వారు కాదు పెట్టినది.
స్థూలంగా ఇది హింద్,మరియు ఇండియా పదాల చరిత్ర.

– సేకరణ

LEAVE A RESPONSE