Suryaa.co.in

Andhra Pradesh

76 ఏళ్ల రాజ్యాంగ స్ఫూర్తి ఇంటింటికీ చేరాల్సిన సమయం

– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండ : భారత రాజ్యాంగంలో ఆమోదం పొంది, అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఇకనైనా ఆ స్ఫూర్తి ఇంటింటికీ చేరాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. రాజ్యాంగ వజ్రోత్సవ సందర్భంలో అది పౌరులందరి చేతిపుస్తకంగా మార్చినప్పుడే అనుకున్న లక్ష్యసాధనకు బాటలు పడతాయని అన్నారు. అదే స్ఫూర్తితో రాజ్యాంగానికి అనుగుణంగా, ప్రజాస్వామ్యం, పౌరహక్కుల పరిరక్షణ కేంద్రంగా రాష్ట్రంలో కూటమి పాలన కొనసాగుతోందన్నారాయన.

శనివారం ఈ మేరకు విడుద ల చేసిన పత్రికాప్రకటనలో వినుకొండ నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు చీఫ్‌ విప్ జీవీ ఆంజనేయులు. అంబేద్కర్ రాసిన ఆ రాజ్యాంగం ఉండబ ట్టే నియంతలు, అరాచకశక్తులకు ఎదురొడ్డి ప్రజాస్వామ్యం మనగలుగుతోందన్నారు. గడిచిన అయిదేళ్లు రాష్ట్రంలో పరిస్థితులు కూడా అందుకు నిదర్శనంగా తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు లభించి, అందరూ సమానంగా జీవించాలని కోరుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుందామని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE