నీ కుటుంబాన్ని వేరేవాళ్లు చీల్చారని నీ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళతో చెప్పించగలవా జగన్?

– తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు

నీ కుటుంబాన్ని వేరేవాళ్లు చీల్చారని నీ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళతో చెప్పించగలవా జగన్? నీ భార్య కుటుంబమే నీ కుటుంబం అన్నట్లుగా వ్యవహరిస్తూ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశావు. నీ తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమంగా వేలకోట్లు సంపాదించావు. అవినీతి కేసుల్లో అరెస్టై జైలుకు వెళితే నీ తల్లి, నీ చెల్లి చెల్లి సహా కుటుంబమంతా పాదయాత్ర చేసి నీకు, నీ పార్టీకి అండగా నిలిస్తే అధికారం వచ్చాక షర్మిళను పట్టించుకోకుండా దూరంగా పెట్టావు. అధికారం మొత్తాన్ని భార్య తరపు బంధువులకు అప్పగించావు. న్యాయబద్ధంగా ఆస్తిలో వాటా ఇవ్వకుండా..నీ చెల్లిని తెలంగాణలో రోడ్లపై తిరిగేలా చేశావు. మీ బాబాయ్ ని అంతమొందించిన నీ భార్య కుటుంబానికి కొమ్ము కాస్తున్నావు. మీ బాబాయ్ కుమార్తె..అల్లుడిపై అక్రమ కేసులు పెట్టావు. రాజశేఖర్ రెడ్డి భార్య ప్రస్తుతం ఎలా ఉందో ప్రజలంతా చూస్తున్నారు.

Leave a Reply