బాధిత కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

– రూ.3లక్షల చెక్కు అందజేత

విజయనగరం జిల్లా, విజయనగరం మున్సిపాలిటీ 29వ వార్డు ఎమ్మార్వో ఆఫీసు రోడ్డు సమీపంలోని టీడీపీ కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక కోరాడ అప్పారావు గుండెపోటుతో 10-09-2023న మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అప్పారావు భార్య పద్మావతి, కుమారుడు జయంత్ సాయి లతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల చెక్కును అందించి..కుటుంబానికి తెలుగుదేశంపార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. భువనేశ్వరితో పాటు పార్టీ నేతలు ఉండి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.

Leave a Reply