– నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టింది
– నన్ను టార్గెట్ చేసింది
– సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
అమరావతి: జగన్ ప్రభుత్వ హయాంలో తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేశారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మాత్రమే కాకుండా, చివరికి తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని, వారిపై క్రిమినల్ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. అమరావతిలోని వీఐటీ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి, ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.రాజధాని అమరావతి నిర్మాణం రైతుల కష్టం, త్యాగాల పునాదులపై జరుగుతోందని, దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక రాజధాని కోసం ఇంత సుదీర్ఘంగా పోరాటం చేసిన ఘనత అమరావతి రైతులదేనని జస్టిస్ రమణ కొనియాడారు.