Suryaa.co.in

Editorial

ఉద్యోగ నేతకు జగనన్న సర్కారు ‘రెడ్డి’ కార్పెట్

– ఏపీఎన్జీఓ మాజీ నేత చంద్రశేఖర్‌రెడ్డికి సలహాదారు
– మాజీలకు ఏపీ పునరావాసకేంద్రమా?
– ఉద్యోగ సంఘ మాజీ నేతల అభ్యంతరం
( మార్తి సుబ్రహ్మణ్యం)
మాజీ ఉద్యోగులు, అధికారులకు ఆంధ్రా అడ్డా అవుతోంది. పాల‘కుల’పతులకు పునరావాస కేంద్రమవుతోంది. ఉద్యోగంలో ఉండగా.. దొడ్డిదారిన పాలకులకు అనుకూలంగా వ్యవహరించిన వారంతా, ఇప్పుడు రాజమార్గంలో సలహాదారుల అవతారమెత్తుతున్నారు. రిటైరయిన వారిని సలహాదారులుగా నియమిస్తున్న జగనన్న సర్కారు.. తాజాగా మరో రెడ్డి గారికి రెడ్‌కార్పెట్ వేయడం వివాదం సృష్టిస్తోంది. అసలు కంటే కొసరు ఎక్కువన్నట్లు.. ఇప్పటికే మంత్రుల కంటే ఎక్కువమంది సలహాదారులను నింపేసిన జగన్ సర్కారు.. తాజాగా చంద్రశేఖర్‌రెడ్డి అనే ఉద్యోగసంఘ మాజీ నేతకు సలహాదారు విస్తరు వేసింది. ఆ మేరకు సీఎంఓ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే రెడ్డి కులానికి చెందిన సలహాదారులతో సర్కారు కిటకిటలాడుతుండగా, ఇప్పుడు మరో రెడ్డి గారు సలహాదారుల ‘జంబో బస్’లో చేరడం విమర్శలకు దారితీసింది. సలహాదారులు, ప్రధానంగా రెడ్డి కులానికి చెందిన వారికి జగన్ సర్కారు ‘రెడ్డికార్పెట్’ వేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా, ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్న’ చందంగా.. పాల’కుల’ నియామకాలు విజయవంతంగా సాగుతున్నాయి. టీడీపీ జమానాలో సలహాదారుల వ్యవస్థను ప్రశ్నించిన వైసీపీ.. ఇప్పుడు ‘అంతకుమించి’ వ్యవహరించమే వింత. చెప్పడానికే నీతులంటే ఇదే మరి!
తాజాగా ఏపీఎన్జీఓ సంఘ మాజీ నేత చంద్రశేఖర్‌రెడ్డిని ‘ఉద్యోగుల మంచిచెడ్డలు’ చూసే సలహాదారు పద వి కట్టబెడుతూ, జారీ చేసిన ఉత్తర్వు ఉద్యోగుల్లో నిరసనకు దారితీసింది. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రశేఖర్‌రెడ్డి.. తర్వాత ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ తీసుకున్న ఎన్నికల నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు, ఆయనకు ప్రతిఫలం దక్కిందన్న వ్యాఖ్యలు ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఠంచనుగా ఒకటో తేదీన జీతాలు రాకపోయినా.. పీఆర్సీ, సీపీఎస్‌పై నిర్ణయం తీసుకోకపోయినా.. జగన్ సర్కారును నిలదీయని చంద్రశేర్‌రెడ్డి సేవలకు, ఆలస్యంగా ప్రతిఫలం దక్కిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో అశోక్‌బాబుతో కలసి టీడీపీకి అనుకూలంగా పనిచేసి, హైదరాబాద్‌లో 300 మంది ఆంధ్రా ఉద్యోగులకు స్వంత ఇళ్లు లేకుండా చేసిన చంద్రశేఖర్‌రెడ్డికి, పదవి ఇవ్వడంపై ఏపీ ఎన్జీఓ మాజీ కార్యదర్శి వరప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రశేఖర్‌రెడ్డికి ప్రభుత్వ పదవి ఇవ్వడం ఒక అవినీతిపరుడుని, ఉద్యోగ ద్రోహిని ప్రోత్సహించడమేనని ఆయన దుయ్యబట్టారు. ఉద్యోగ సంఘంలో కోట్లు తిని, బెయిల్‌పై తిరుగుతున్న చంద్రశేఖర్‌రెడ్డికి పదవి ఇవ్వడం దారుణమని వరప్రసాద్ విమర్శించారు. ఆ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

వరప్రసాద్ ప్రకటన యథాతదంగా….

మూడు వేల మంది ఆంధ్ర ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల జీవితాలను చీకటి మయం చేసిన చంద్రశేఖర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు, APNGOs అసోసియేషన్.
జంట నగరాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలను ఆనాటి ప్రభుత్వము జీ. వో.850 తేదీ 24.9.91 ద్వారా కేటాయించింది. APNGOs Assn. లో సభ్యులుగా వున్న ఆంధ్ర ఉద్యోగులకు 189 ఎకరాలు కేటాయించ బడినవి. ఈ ఇళ్ళ స్థలాలను ఉద్యోగుల seniority ప్రకారము కేటాయించాలని జీ.ఓ.633 తేదీ 17.11.1992 లో ఉత్తర్వులు జారీ చేశారు. సంఘము లో అనేక పరస్పర కుమ్ములాట ల వలన ఇళ్ళ స్థలాల విషయము పెండింగ్ లో వుండి పోయింది. ఇతర సిస్టర్ సంఘా లతో ఏర్పడిన అవగాహన వలన మన సంఘము హౌసింగ్ సొసైటీ ని 31.5.2003 న రిజిస్టర్ చేయించింది. ఈ హౌసింగ్ సొసైటీ కి తర్వాత కాలములో ఈ చంద్రశేఖరరెడ్డీ ఏ సెక్రెటరీ. సొసైటీ bylaw 3(iii)(e) ప్రకారం ఇళ్ళ స్థలాలను ఉద్యోగుల సర్వీస్ seniority ప్రకారము కేటాయించాలి.
ఇతను ప్రభుత్వము ఇంకను భూమిని సంఘానికి ఇవ్వనప్పటికి ప్రతి 7000 సభ్యుల నుండి అభివృద్ధి పనులు కోసము 30,000 వసూలు చేశాడు. భూమిని ప్రభుత్వము 2008 లో సంఘానికి ఇచ్చింది.
జీవో 633 నకు మరియు సొసైటీ bylaw 3(iii)(e) నకు విరుద్దంగ ఇతను లాటరీ ద్వారా ఇళ్ళ స్థలాలను కేటాయించారు. లాటరీ ఎంపిక మూలాన 30 సంవత్సరాల service వున్న ఉద్యోగి కి ఇళ్ళ స్థలము రాలేదు. అయితే అయిదారు సంవత్సరాల సర్వీస్ వున్న వారికి ఇళ్ళ స్థలాలు ketaayincha బడ్డాయి ఈ లాటరీ ద్వారా. నిబంధనలకు విరుద్ధంగా లాటరీ పద్ధతిలో కేటాయింపు చేయటము వలన నష్ట పోయిన ఉద్యోగులు హై కోర్ట్ ను ఆశ్రయించారు. హై కోర్ట్ వారు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా లాటరోలో కేటాయించిన ఉద్యోగులకు స్థలాలను ఒప్ప చెప్పరాదని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయగూడదని ఆదేశించారు.ఇది ఇలా వుండగా సభ్యుల నుండి వసూలు చేసిన డబ్బులను దుర్వినియోగం జరిగింది.
నేను మొదటి సంతకము దారిగా దాఖలు చేసిన పిటిషన్ ల పై విచారణ జరిపిన cooperative dept. మరియు విజిలెన్స్ కమిషనర్ విడి విడి గా ఇచ్చిన నివేదికల ప్రకారము మొత్తము రూ.17,92,60,436 లను ఇతను దుర్వినియోగం చేశాడని నిర్ధారించి ఇతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పారు. తదననుంగ ఇతని పై FIR No.81/2013 ని cooperative dept. వారు 1.6.13 న నమోదు చేయించారు. ఇతనికి క్రింది కోర్ట్ లో బైల్ నిరాకరించారు. హై కోర్ట్ లో Cr.P. No9878/13 ను అప్పీల్ చేసు కుంటే నేను ఆ పిటిషన్ లో ఇంప్లీడ్ అయి పార్టీ ఇన్ పర్సన్ గా నేనే అతని బైల్ నీ oppose చేసాను. అయినప్పటికీ అతనికి బైల్ మంజూరు చేశారు. ఈ పరిస్థితుల్లో గూడ సొసైటీ లో వున్న ఉద్యోగుల డబ్బును విలాస వంతంగా దుర్వినియోగ పరుస్తుంటే, క్రిమినల్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారికి represent చేసి బ్యాంక్ అకౌంట్ లను freeze చేయించాను. అప్పటి వరకు తిన్నది సరిపొనట్లుగా ఇతను బ్యాంక్ ఖాతాలను ఆపరేట్ చేయటానికి అనుమతించాలని హై కోర్టులో పిటిషన్ వేస్తే నేను .మరల party.in.person గా implead అయి oppose చేసాను. హై కోర్ట్ వారు అనుమతించ లేదు.
మన సంఘము ఎల్లప్పుడూ రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తుంది. ఇతను అశోక బాబు గారి తో పాటు తెలుగు దేశం పార్టీని బలపరచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పని చేశాడు. అతని ఈ దృక్పథాన్ని మనసులో పెట్టుకొని, రాష్ట్రము ఏర్పడగానే, తెలంగాణ ప్రభుత్వము మెమో నం.1088 తేదీ 2.7.14 న ఆంధ్ర ఉద్యోగులకు కేటాయించిన స్థలాన్ని తిరిగి స్వాధీనం లోకి తీసుకుంది. ఈ మెమో నందు ప్రభుత్వము వారు సొసైటీ ని మీరు ఇళ్లను నిర్మించ గుండా స్థలాలను ఎందుకు ఉపయోగించ లేదో వివరణ అదిగినను సొసైటీ తరపున ఇతను ఎటువంటి సమాధానము ఇవ్వనందున స్వాధీనం చేసుకోవడానికి నిర్ణయించినట్లు గా తెలిపారు.
పైన నేను పేర్కొన్నట్లుగా, హై కోర్ట్ వారు ఇల్ల స్థలాలను లాటరీ లోని లబ్ధి దారులకు రిజిస్ట్రేషన్ చేయ వద్దని చెప్పటం వలన ఇల్ల నిర్మాణము చేపట్ట లేక పోయామని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటము లో విఫలమయ్యాడు.
ఈ విధంగా ఇతను నిబంధనలకు వ్యతిరేకంగా లాటరీ ద్వారా ఇల్లు కేటాయింపు చేసి లిటిగేషన్ సృష్టించి, తెలుగు దేశం పార్టీకి మద్దతుగా నిలిచి తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరించి, ఇల్లు ఎందుకు నిర్మించ లేక పోయామో వివరణ ఇవ్వటానికి విఫలమై 3000 ఆంధ్ర ఉద్యోగులు ఇల్ల స్థలాలను పొందలేక కన్నీళ్ళ జీవితాలను గడపటానికి కారకుడు అయ్యాడు ఈ ఉద్యోగ ద్రోహి చంద్రశేఖర్ రెడ్డి. స్థలాలు కేటాయింపు పొందితే స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకోవచ్చని ఆశలు అడియాశలు గా మారి ఎంతో మంది చని పోయారు ఇతను చేసిన droha పూరిత చర్యలవలన.
అదియును గాక ఆంధ్ర ప్రదేశ్ కి తరలి వెళ్ళేటప్పుడు, ఆంధ్ర ఉద్యోగుల గురించి ఏర్పడిన హౌసింగ్ సొసైటీ బాధ్యతలను పదవీ విరమణ చేసి హైదరాబాద్ లో స్థిర పడిన ఆంధ్ర విశ్రాంత ఉద్యోగులకు ఒప్ప చెప్పమని అనేక దఫాలుగా కోరిన వినకుండా, సొసైటీ నీ తెలంగాణ ఉద్యోగులకు ఒప్ప చెప్పి వొచేసాడు.
ఇతని పదవీ విరమణ సందర్భముగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో మాట్లాడుతూ గౌరవనీయులైన సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఇతన్ని ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించే విధముగా ఒక బాధ్యతను ఒప్ప చెప్తామని పేర్కొన్నట్లుగా మీడియా ద్వారా తెలిసింది. హౌసింగ్ సొసైటీ లో ఉద్యోగుల కోట్ల రూపాయలను తినేసి, బైల్ పొంది తిరుగుతున్న అవినీతి పరుడికి, జంటనగరాల్లో పనిచేసిన ఆంధ్ర విశ్రాంత ఉద్యోగులకు/ఉద్యోగులకు ఇల్ల స్థలాలు రాకుండా అడ్డుకొని వాళ్ళ జీవితాలను అంధకారం చేసిన ఉద్యోగ ద్రోహికికి, ఇన్నాళ్లు తెలుగు దేశము పార్టీ తరఫున పని చేసి ఇప్పుడు అధికార పార్టీ జెండా పట్టుకున్న అవిశ్వాస పాత్రుడికి ఎటువంటి హోదాను కల్పించ వద్దని, అల చేయటము వలన ఒక అవినీతి పరుడిని, ఉద్యోగ ద్రోహిని ప్రభుత్వము ప్రోత్సహిస్తున్నది అనే సంకేతము ఉద్యోగుల్లో కి వెళ్తుందని మనవి చేస్తున్నాను.
I am forwarding this message to the P.S. with a request to bring this posting to the notice of Respected Sri Sajjala Ramakrishna reddy garu, Chief Advisor to the CM for favour of information.
Vedaprasad, former Secretary, APNGOs Assn.

LEAVE A RESPONSE