Home » ఉదయభాను..ప్రశాంత్ ని అక్టోబర్ 1న డ్రగ్స్ పరీక్షలకు తీసుకురాగలవా ?

ఉదయభాను..ప్రశాంత్ ని అక్టోబర్ 1న డ్రగ్స్ పరీక్షలకు తీసుకురాగలవా ?

• అక్టోబర్ 1, శుక్రవారం ఉదయం 10 గంటలకు, నేను మాపార్టీ యువనేతలందరం డ్రగ్స్ పరీక్షలకు హైదరాబాద్ లో సిద్ధంగా ఉంటాము.
• తనకుమారుడిని అదేరోజున ఫోరెన్సిక్ ల్యాబ్ కు తీసుకొచ్చి పరీక్షలు చేయించే ధైర్యం ఉదయభానుకు ఉందా?
• ఉదయభాను నిన్నమాట్లాడింది చూస్తే, ఆయన, ఆయనకుమారుడు ప్రశాంత్ డ్రగ్స్ దందాలో మునిగితేలుతున్నారని స్పష్టమైపోయింది.
• అలా ఉండబట్టే ఉదయభాను నిన్న కల్లు తాగిన కోతి మీడియాముందు పిచ్చికూతలు కూశాడు.
• తెలంగాణ పోలీసులకుపట్టుబడిన గంజాయితో ఉదయభాను కుమారుడు ప్రశాంత్ కు సంబంధంలేకపోతే, చెక్ పోస్ట్ సీసీటీవీ పుటేజ్, టోల్ గేట్ సీసీటీవీపుటేజ్ ను ఎందుకు బహిర్గతంచేయడంలేదు?
• ఉదయభాను తనకుమారుడు ప్రశాంత్ ను హైదరాబాద్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు తీసుకొచ్చి నమూనాలు ఇప్పించడానికి ఎందుకు జంకుతున్నాడు?
• డ్రగ్స్ పరీక్షలకు ఉదయభాను తనకుమారుడుని తీసుకొస్తే, అతనితోపాటు నేను, మా పార్టీ యువనేతలంకూడా పరీక్షలకు సిద్ధం.
• నా తాత, తండ్రి గారి చరిత్ర గురించి తెలిస్తే, ఉదయభాను గుండెలు జారిపోతాయి.
• ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రైన టంగుటూరిప్రకాశం పంతులు న్యాయవాదిగా, 100 సంవత్సరాలక్రితం మాతాతగారి తాలూకా కేసువాదిస్తే, ఆరోజుల్లోనే ప్రకాశంగారికి రూ.70వేల ఫీజుఇచ్చిన చరిత్రమాది.
• ఆ మొత్తం విలువ నేడు ఎన్నికోట్లకుసమానమవుతుందో ఉదయభానుకు ఊహించడానికే కష్టం.
* టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
కొద్దిరోజులుగా డ్రగ్స్ కేంద్రంగానే రాష్ట్రరాజకీయాలు తిరుగుతున్నాయని, ప్రజలంతా సిగ్గుతోతలదించుకునేలా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏపీని డ్రగ్స్ కు అడ్డాగామార్చేసి, యువతభవిష్యత్ తో ఆటలాడుకుంటున్న నేపథ్యం లో బాధ్యతగలప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్న టీడీపీనేతలపై ప్రభుత్వంలోని కొందరుఅవినీతిపరులు ఎదురుదాడికి దిగుతున్నారని, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
గంజాయి అక్రమరవాణాచేస్తూ, జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రెండోకుమారుడు ప్రశాంత్ తెలంగాణ పోలీసులకు పట్టుబడ టం, ఆ విషయం మీడియాలోవెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, నేను నిన్న మీడియాముఖంగా ఉదయభానుని ప్రశ్నించడం జరిగింది. ఆయన రెండో కుమారుడు ప్రశాంత్ నిర్దోషి అయితే, అతనికి మత్తుపదార్థాలకు ఎలాంటి సంబంధంలేకపోతే, తనకుమారుడికి హైదరాబాద్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబోరేటరీలో డ్రగ్స్ పరీక్షలునిర్వహించాలని, అందుకు ఉదయభాను సిద్ధమేనా అని నేను సవాల్ విసరడం జరిగింది. డ్రగ్స్ పరీక్షల్లో ప్రశాంత్ రక్త, వెంట్రుకనమూనాల్లో ఎలాంటి మత్తుపదార్థాల ఆనవాళ్లు లేకపోతే, ప్రశాంత్ కడిగిన ముత్యంలా బయటకువస్తాడని నేను ఉదయభానుకి తేల్చిచెప్పడం జరిగింది. నేను తనను ప్రశ్నించానన్న అక్కసుతో, ఆయన, ఆయన కుటుంబం చేస్తున్న చీకటివ్యాపారాలు బయటపెట్టానన్న దుగ్ధతో కల్లుతాగిన కోతిలా ఉదయభాను నిన్న సాయంత్రం మీడియాముందు చిందులు తొక్కాడు.
అసభ్యకర పదజాలంతో నన్ను దూషించాడు. నిన్న ఉదయభాను హావభావాలు, మాటతీరుచూశాక చాలా స్పష్టంగా ఆయనలోని నిరాశానిస్పృహలు ఏమిటో నాతోపాటు రాష్ట్రప్రజలందరూ గమనించారు. మత్తుపదార్థాల దందాకు సంబంధించి ఎప్పుడైతే తన కుటుంబసభ్యులపాత్ర బయటబ పడిందో, అప్పుడే ఉదయభాను అసభ్యకరంగా, తనస్థాయి మర్చిపోయి, తానొక ప్రజాప్రతినిధి అన్నవిషయం విస్మరించి మాట్లాడాడు. డ్రగ్స్ పరీక్షలకు నారాచంద్రబాబునాయుడు, నారా లోకేశ్ రావాలని ఉదయభాను అడగడం, ఆయన వ్యాఖ్యల్లోని డొల్లతనాన్ని బహిర్గతంచేసింది. తనకుమారుడుని ఉదయభాను డ్రగ్స్ పరీక్షలకు తీసుకొస్తే, వారితోపాటు నేను, టీడీపీయువనేతలందరం పరీక్షలకు సిద్ధమని సవాల్ చేస్తే, ఉదయభాను చంద్రబాబునాయుడు, లోకేశ్ లపేర్లు ప్రస్తావిస్తూ ఏదేదో మాట్లాడాడు. తన కుమారుడు ప్రశాంత్ ను డ్రగ్స్ పరీక్షలకు తీసుకొచ్చే దమ్ము, ధైర్యం ఉదయభానుకి లేవని నిన్న అతని మాటలతోనే తేలిపోయింది.
తొలిసారి మత్తుపదార్థాల దందాలో ఉదయభాను కుటుంబసభ్యుల వ్యవహారం బయటపడ్డాకనే నేను నిన్నమీడియాతో మాట్లాడుతూ, ఉద యభాను రెండోకుమారుడు ప్రశాంత్ గురించి కచ్చితంగా తాను ప్రశ్నించ డంజరిగింది. గంజాయి రవాణాలో తెలంగాణపోలీసులకు పట్టుబడింది ఉదయభాను రెండోకుమారుడు ప్రశాంత్. తెలంగాణ ప్రగతి భవన్ తో సంప్రదింపులుజరిపిన తాడేపల్లి ప్యాలెస్ ప్రశాంత్ ను సదరువ్యవహారం నుంచి తప్పించినమాట వాస్తవం. తనకుమారుడికి, మత్తుపదార్థాలకు ఎలాంటి సంబంధంలేదని ఉదయభాను నిరూపించుకోవాలని భావిస్తే, అతని ముందు తాము రెండు డిమాండ్లు ఉంచుతున్నాం. వాటిలో ఒకటి ఉధయభాను తనకుమారుడు ప్రశాంత్ ను తీసుకొనినేరుగా హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పరీక్షలకురావడం. రెండోది తెలంగాణ ఆంధ్రా సరిహద్దుల్లోని చెక్ పోస్ట్ వద్దఉన్న సీసీటీవీ పుటేజ్, టోల్ గేట్ సీసీటీవీ పుటేజ్ ను బయటపెట్టడం. ఈ రెండుడిమాండ్లే తాము ఉదయభాను ముందుంచాము.
ఆ రెండూ చేయకుండా కల్లుతాగినకోతిలా, నిప్పులు తొక్కిన వాడిలా ఉదయభాను సంబంధంలేకుండా ఏదేదో మాట్లాడినంత మాత్రాన ఆయనకుమారుడుప్రశాంత్ నిర్దోషిఅయిపోడు. ప్రజలు ఉదయభానుని, ఆయనకుటుంబాన్ని మంచిఉన్నతమైన కుటుంబమని నమ్మరు. ఇప్పుడే చెబుతన్నా..టీడీపీ జాతీయఅధికారప్రతినిధి అయిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అనేనేను, అక్టోబర్ 1 శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో డ్రగ్స్ పరీక్షలకు సిద్ధంగా ఉంటాను. నాతో పాటు మాపార్టీనేతలు చింతకాయల విజయ్, మద్దిపట్ల వెంకటరాజు, ఎమ్.ఎస్.రాజు, కిమిడి నాగార్జున, బండారు అప్పలనాయుడు, నాదెండ్ల బ్రహ్మం, వంశీసహా, అందరం హైదరాబాద్ లో సిద్ధంగా ఉంటాము. బాధ్యతగలపౌరులుగా, కోట్లాదిమంది యువతకు ధైర్యమిచ్చేందుకు ఈ విషయంలో తామేముందుంటాము.
తమతోపాటు ఉదయభాను, ఆయన కుమారుడు ప్రశాంత్ ను తీసుకొని అక్టోబర్ 1న ఉదయం పదిగంటలకు డ్రగ్స్ పరీక్షలకు తీసుకురాగలడా? ఉదయభాను హైదరాబాద్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు తనకుమారుడిని తీసుకొచ్చి, అక్కడ ప్రశాంత్ రక్త, వెంట్రుకల నమూనాలు ఇవ్వాలి. ల్యాబ్ వారుఇచ్చే నివేదికతో ప్రశాంత్ నిర్దోషిత్వాన్ని ఉదయభాను ఏపీ ప్రజలకు బహిర్గతంచేయాలి. అలాచేయగల దమ్ములేకనే ఉదయభాను చంద్రబాబు నాయుడిగారిపై, లోకేశ్ గారిపై విమర్శలకు దిగాడు. దమ్ము,ధైర్యంతో 10, 12 మంది టీడీపీనేతలమైన తాము డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమంటుంటే, దానికి సై అనకుండా, ఉదయభాను పిరికిసన్నాసిలా నిన్నమీడియాతో మాట్లాడాడు.
నిజంగా ఉదయభానుకి సమాజంపట్ల చిత్తశుద్ధిఉంటే, ఒక ప్రజాప్రతినిధిగా యువతను మంచిమార్గంలో పెట్టాలన్నఆలోచన ఉంటే, ఆయన తనకుమారుడిని హైదరాబాద్ తీసుకెళ్లి డ్రగ్స్ పరీక్షలుచేయించా లి. అంతేగానీ పిచ్చికూతలు కూస్తూ కాలయాపనచేస్తానంటే కుదరదు. నేను ఎన్నోసార్లు మీడియాతో మాట్లాడానుగానీ, ఏనాడూ ఎవరికుటుంబ సభ్యులగురించి కించపరిచేలా మాట్లాడలేదు. కానీనేడు ఉదయభాను కుమారుడు ప్రశాంత్ పై వస్తున్న అనేకఆరోపణలవల్లనే అతన్ని డ్రగ్స్ పరీక్షలకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నా. ఎప్పుడైతే ఉదయభాను ఏమాత్రం సంబంధంలేని చంద్రబాబునాయుడు, లోకేశ్ లపేర్లుప్రస్తావించాడో, అప్పుడే అతను ఎంతలా భయపడుతున్నాడో అందరికీ అర్థమైంది. నిజంగా ప్రశాంత్ కు, డ్రగ్స్ కు సంబంధం లేకపోతే, ఉదయభాను అక్టోబర్ 1న తనకుమారుడితో పాటు హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో డ్రగ్స్ పరీక్షలకు రావాలి.
నిన్న ఉదయభాను నాగురించి చాలాఎక్కువగా మాట్లాడాడు. ఎన్టీఆర్ భవన్లో జీతానికి పనిచేస్తున్నానని కారుకూతలుకూశాడు. ఉమ్మడి ఏపీకి తొలిముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులుగారి జీవితచరిత్ర కు సంబంధించిన పుస్తకంలోని పేజీ నెం-102 ఉదయభానుచదివితే, నేనే మిటో, నాకుటుంబమేంటో బోధపడుతుంది. కొమ్మారెడ్డి వంశం పదిమంది కి పెట్టేకుటుంబమేగానీ, ఉదయభాను కుటుంబంలా పదిమందిని దోచు కొని దాచుకొనే బాపతుకాదు.
టంగుటూరి ప్రకాశంపంతులుగారు బారిస్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో పోతునూరు గ్రామానికి చెందిన మా తాతగారికి తాతగారైన చలసాని పట్టాభిరామయ్య గారి కేసును వాదించానని ప్రకాశంగారు తనజీవితచరిత్రలో రాసుకున్నారు. ఆ కేసును ప్రకాశంగారు వాదించి గెలిపించాక, మా తాతగారి నాయనమ్మగారైన శ్రీమతి చలసాని పట్టాభిరావమ్మగారు. వందసంవత్సరాల క్రితం 1919లో రూ.70వేల ఫీజుగా ఇచ్చారు. ఆ మొత్తం ప్రకాశం పంతులుగారి న్యాయవాదవృత్తిలో ఆయన అందుకున్న అత్యధికఫీజు. 100సంవత్సరాలక్రితమే మా కుటుంబంఆస్తి విలువ రూ.10లక్షలని ప్రకాశం పంతులుగారు ఆయన జీవితచరిత్రలో రాసుకున్నారు. 100 సంవత్సరాలక్రితమే రూ.10లక్షలంటే, నేడు ఆమొత్తం ఎన్ని వందలకోట్లు ఉంటుందో ఉదయభాను ఆలోచించాలి. అంత స్థితిమంతులం కాబట్టే, ఇన్నాళ్లనుంచి పదిమందికి సాయపడగలిగాం.. ఇప్పటికీ గౌరవంగాజీవిస్తున్నాం.
తనశ్రీమతి గురించి నేనేదో తప్పుగా మాట్లాడానని కూడా ఉదయభాను చెప్పాడు. ఉదయభాను తనశ్రీమతిని వెనకేసుకొస్తే సరిపోదు. రేషన్ బియ్యం అక్రమరవాణాలో ప్రజాప్రతినిధి శ్రీమతి ప్రమేయమని తాటి కాయంత అక్షరాలతో పత్రికల్లోరాశారు. జగ్గయ్యపేటతోపాటు, పక్కనున్న నందిగం నియోజకవర్గంలోకూడా ఉదయభాను శ్రీమతి ఎలా రేషన్ బియ్యం అక్రమరవాణా చేయిస్తున్నారో రాష్ట్రమంతా తెలుసు.
ఉదయభాను అవినీతి గురించి, ఆయన కుటుంబసభ్యులఅవినీతి గురిం చి చెబితే ఈరోజు మొత్తంకూడా సరిపోదు. కొంగరమల్లయ్య గట్టుని గ్రావెల్ కోసం నామరూపాలులేకుండా చేసింది సామినేని ఉదయభాను కాదా? పేదలఇళ్లపట్టాల ముసుగులో జగ్గయ్యపేట పట్టణానికి సమీపంలోనే ఉద యభాను చేసిన కుంభకోణం గురించి చెప్పమంటారా? దాదాపు 22ఎకరా ల భూమిని ఇళ్లపట్టాలపేరుతోకొనుగోలుచేసి, కేవలం రూ.20లక్షలు మాత్రమే లబ్దిదారుడికిచ్చి, ఎకరానికి రూ.25లక్షలచొప్పున ఉదయ భాను దిగమింగింది వాస్తవమాకాదా? ప్రభుత్వానికి ఎకరం రూ.45 లక్షలకు అంటగట్టి, రూ.25లక్షలవరకు వైసీపీఎమ్మెల్యే ఉదయభా ను బొక్కేశాడు. ఆ విధంగా ఒక్క డీల్ లోనే రూ.5కోట్లవరకు కాజేశాడు.
చివరకు ఈ ప్రబుద్ధుడు రైతుబజార్లలో కూరగాయలు అమ్మేవారినుంచి కూడా కమీషన్లువసూలుచేస్తున్నాడు. ఉదయభాను వేధింపులు తట్టుకో లేక, ఆయనకుకమీషన్లుసమర్పించుకోలేక వైసీపీకి చెందిన ఇంటూరి చిన్నా అనేవ్యక్తి జగ్గయ్యపేటలోనే మరోరైతుబజార్ ఏర్పాటుచేసింది వాస్తవమా… కాదా? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాపై కేసులున్నాయన్నాడు. ఉదయభా నుపైఎన్నికేసులున్నాయో అతని ఎన్నికల అఫిడవిట్ చూస్తే తెలుస్తుంది. ఆ కేసులన్నీ మాఫీచేయడానికి ఈ దిక్కుమాలినప్రభుత్వం ప్రత్యేకంగా ఒకజీవోనే ఇచ్చింది. 28-05-2021న ప్రభుత్వం విడుదలచేసిన జీవోనెం – 502 పై ఉదయభాను ఏంసమాధానం చెబుతాడు? సదరుజీవోను 420 ముఖ్యమంత్రి ఇచ్చింది, కేవలం ఉదయభానుపైఉన్న కేసులను కొట్టేయడానికే. అలాంటిచరిత్రలేవీ నాకు, నా కుటుంబానికి లేవు.
ఎక్కడా పోటీ చేయనివ్యక్తి, ఎన్నడూప్రజాక్షేత్రంలోకి దిగని వ్యక్తి నాపై ఆరోపణలుచేశాడని కూడా ఉదయభాను వాగాడు. ఇప్పుడు సవాల్ చేస్తున్నా. చంద్రబాబునాయుడు గారు ఆదేశిస్తే, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడినుంచైనా నేను పోటీకి సిద్ధం. నాపై పోటీకి ఉదయభానుసిద్ధమా? ఉదయభాను లాంటి అవినీతి బకాసు రులను తుదముట్టించడానికి రాష్ట్రంలో ఎక్కడినుంచైనా పోటీచేస్తాను. నేను ఒక్కడినే కాదు. నాలాంటియువకులు ఎందరోమంది ఈ అవినీతి, కుంభకోణాల ప్రభుత్వాన్ని కాలరాయడానికి, ఉదయభాను లాంటి అవినీతి తిమింగలాలను కటకటాల్లోకి నెట్టడానికి, ఎన్నికలక్షేత్రంలోకి దిగడానికి సిద్ధంగాఉన్నారని ఉదయభాను ఎంతత్వరగా తెలుసుకుంటే, అంతమంచిది. చంద్రబాబునాయుడు గారుఆదేశిస్తే, ఉదయభాను లాంటి అవినీతిపరులను రాజకీయంగా భూస్థాపితంచేయడానికిఎందరు సిద్ధంగా ఉన్నారో త్వరలోనే ఈ 420ప్రభుత్వానికి అర్థమవుతుంది.
సోషల్ మీడియాలో నాపైన, నాకుటుంబసభ్యులపైనా సిగ్గులేకుండా ఉద యభాను తన చిల్లరబ్యాచ్ తో వాగిస్తున్నాడు. నా తండ్రిగారి గొప్పతనం, ఈ అవినీతి తిమింగలమైన ఉదయభానుకు ఏం తెలుస్తుంది? నా తండ్రిగారు కొమ్మారెడ్డి దుర్గాప్రసాద్, ఆయనొక ఎంటిమాలజిస్ట్. అసలు ఆపదానికి అర్థమేంటో ఉదయభానుకి తెలుసా? తనతండ్రి రీసెర్చ్ పేపర్స్ ను ప్రముఖ విశ్వవిద్యాలయం హార్వర్డ్ వారు ఆయన పేరుతో ముద్రించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన కార్నల్ యూనివర్శిటీ నా తండ్రిని గుర్తించి మెచ్చుకుంది. నాతాతగారి పేరు కొమ్మారెడ్డి వెంకటపట్టాభిరామయ్య. ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమనాయకుడు. పుచ్చలపల్లిసుందరరామయ్య గారితో కలిసిపనిచేశారు.
కమ్యూనిస్ట్ భావజాలంతో ముందుకునడిచిన కుటుంబంలో జన్మించి, ఆ తరువాత తెలుగుదేశం సిద్ధాంతాలను నమ్ముకొని చంద్రబాబుగారినాయకత్వంలో పనిచేస్తున్నాను. అలాంటి నా గురించి, నాకుటుంబ సభ్యులగురించి, బావిలో కప్పల్లాగా అవినీతిసామ్రాజ్యంలోపడి కొట్టుకుంటున్న ఉదయభా ను లాంటి వాళ్లు మాట్లాడతారా?
ఉధయభాను తనపై భౌతికదాడులకు దిగుతానంటున్నాడు. ఆయన తాటాకుచప్పుళ్లకు నేనుభయపడను, ఉదయభాను తన పేటీఎం బ్యాచ్ కు చెప్పాలి.. సోషల్ మీడియాలో నాపైనే, నాకుటుంబంపైనా పిచ్చి రాతలు, జుగుప్సాకరమైన కామెంట్స్ పెట్టినంత మాత్రాన భయపడనని చెప్పాలి. ఉదయభానుకి నిజంగా తనకొడుకు ప్రశాంత్ నిర్దోషని నిరూపిం చుకునే దమ్ము,ధైర్యముంటే, అతన్ని డ్రగ్స్ పరీక్షలకు తీసుకురావాలి. ఆయనతనకుమారుడితో వస్తే, నేను, మాపార్టీ యువనేతలంకూడా వచ్చి నమూనాలుఇస్తాము. అక్కడే తేలుతుందిఎవరి బండారమేంటో? పరీక్షలు చేయించుకొని, డ్రగ్స్ బారిన పడకుండా, యువతంతా ఆరోగ్యం తో ఉండాలనే సందేశాన్ని ఇవ్వడానికి తామంతా సిద్ధమే.
ఇప్పటికైనా ఉదయభాను పలాయనం చిత్తగించేలా చంద్రబాబు నాయుడు, లోకేశ్ లపై పిచ్చికూతులకూయకుండా, తన కుమారుడు ప్రశాంత్ ను డ్రగ్స్ పరీక్షలకు తీసుకురావాలి. అంతేగానీ ఉదయభాను తనసమయం వృథాచేసుకుంటూ, నన్ను బెదిరించినంత మాత్రాన, నిజాయితీపరుడినైన నేను భయపడను. ఇంకా ఉదయభాను నన్నుగెలికితే, కొన్నివాస్తవాలే ఆయన అవినీతికి సంబంధించి ఇప్పుడు బయటకు వచ్చాయి. రేపు ఇంకాపెద్దచిట్టాను పేర్లు, ఆధారాలతోసహా బయటపెడతాను, అప్పుడు ఉదయభాను తనముఖం జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎక్కడపెట్టుకుంటాడోచూస్తాను.
ఏలూరు మున్సిపాలిటీకి సంబంధించి తొలిఛైర్మన్ బడేటి వెంకట్రామయ్య గారు…నేను ఏనాడు కులాలగురించి మాట్లాడలేదు. కానీ సదరు వెంకట్రామయ్య గారు ఉదయభాను సామాజికవర్గానికి చెందినవ్యక్తే, ఆయన మా తాతగారి తాతగారైన చలసాని పట్టాభిరామయ్య గారికి ప్రాణస్నేహితుడు. ఆయన చనిపోతూ ఒకమాటచెప్పారు. “బతికున్నదే పట్టాభిరామయ్య అనుకోండి, వెళిపోతున్నది వెంకటరామయ్య అనుకోండి” అని తన స్నేహితుడిని తనకుటుంబానికి అప్పగించి కాలంచేశారు. ఆ తరువాత బడేటి వెంకటరామయ్యగారు, ఎంతోఉన్నతమైన వ్యక్తిగా ఎదిగి ఏలూరు మున్సిపాలిటీకి మొట్టమొదటిఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించి, ఎంతో పేరుప్రఖ్యాతులు పొందారు. ఆ విధంగా కులాలకు అతీతంగా అనాదినుంచి మా కుటుంబం బడేటి కుటుంబంతో అవినాభావ సంబంధం ఏర్పరుచుకొని ముందుకుసాగుతోంది.
ఇవేవీ తెలుసుకోకుండా, నాపైనే, నాకుటుంబంపైనే పిచ్చికూతలుకూసినా, తప్పుడురాతలురాయించినా ఉదయభానును వదిలేదిలేదని హెచ్చరిస్తున్నా. ఉదయ భానుకి ధైర్యముంటే అక్టోబర్ 1న తనకుమారుడిని తీసుకొని డ్రగ్స్ పరీక్షలకు హైదరాబాద్ రావాలని మరోసారి తేల్చిచెబుతున్నా. ఉదయభానుకు దమ్ముంటే అక్కడికివచ్చి, తనకుమారుడికి డ్రగ్స్ పరీక్షలు చేయించాక, అతని నిర్దోషిత్వం తేలాక మాట్లాడాలి.

Leave a Reply