దోపిడీ సొమ్ముతో మళ్లీ గెలవాలన్న జగన్ ఆశ అడియాసే

• ‘కార్యకర్తకు జగనన్న భరోసా’ పేరుతో పులివెందులలో విచ్చలవిడిగా డబ్బుపంపిణీ
• జగన్ రెడ్డి నేత్రత్వంలో ఎంపీ అవినాశ్ రెడ్డి ఒక్కో కార్యకర్తకు రూ.30వేల నుంచి రూ.10లక్షల వరకు పంచుతున్నారు
• వైనాట్ 175 అన్న జగన్ రెడ్డి, నేడు టీడీపీ-జనసేన కూటమి దెబ్బతో సొంత నియోజకవర్గంలో డబ్బులు పంచే దుస్థితికి దిగజారాడు
• జగన్ ఎంతగా పాకులాడినా, ఎన్ని కుయుక్తులు పన్నినా డబ్బుతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేడు
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

నోట్ల వరదతో ఓట్ల వరదను అడ్డుకోలేరని, అవినీతిసొమ్ముతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరనే సత్యాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలని పులివెందుల ప్రజలు కూడా తన సీటుని చించుతారన్న భయంతో జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

’కార్యకర్తకు జగనన్నభరోసా’ పేరుతో పులివెందులలో డబ్బుపంపిణీకి తెరలేపిన జగన్ రెడ్డి…అవినాశ్ రెడ్డి
“ అధికారం అడ్డుపెట్టుకొని దోచేసిన అవినీతిసొమ్ముతో ఎన్నికల్లో గెలవడానికి జగన్ రెడ్డి అతని పార్టీ సిద్ధమయ్యాయి. ఎంపీ అవినాశ్ రెడ్డి నిర్వహిస్తున్న ‘కార్యకర్తకు జగనన్న భరోసా’ కార్యక్రమానికి నిధులు ఎక్కడినుంచి వచ్చాయో సమాధానం చెప్పాలి. అధికారపార్టీ ఎంపీ మార్గదర్శకత్వంలో నేరుగా ఓటర్లకు డబ్బులివ్వడం అవినీతి సొమ్ము ప్రజలకు పంచడం కాదా? వైనాట్ 175 అన్న జగన్ రెడ్డి చివరకు మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాలతో ఎన్నికల్లో గెలవడానికి కుట్రలు పన్నుతున్నాడు.

ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఇసుక, మద్యం, ఖనిజ సంపద, భూదోపిడీతో కొట్టేసిన లక్షలకోట్ల సొమ్ముని జగన్ రెడ్డి అతని పార్టీ నేతలు నేరుగా ప్రజలకు పంచుతున్నారు. పులివెందులలో ఇప్పటికే ‘కార్యకర్తకు జగనన్న భరోసా’ ద్వారా ఒక్కో వ్యక్తికి రూ.30వేల నుంచి 10లక్షల వరకు పంచుతున్నారు. ఈ విధంగా డబ్బుతో ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు జగన్ రెడ్డి ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికే పెనుప్రమాదంగా పరిగణించాలి.

దోపిడీ సొమ్ముతో అధికారంలోకి రావాలంటున్న జగన్ రెడ్డి ఆశ అడియాసే అవుతుంది
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు ఎవరూ జగన్ రెడ్డిని ఒకటి… రెండుసార్లకు మించి కలిసిందిలేదు. కొందరైతే అసలు ఆయన ముఖం కూడా చూడలేదు. ప్రజలకు సొంతపార్టీనేతలకు ముఖం చూపించకుండా ఇన్నేళ్లు జగన్ నియంత్రత్వ పాలన సాగించడానికి కారణం డబ్బు వల్ల వచ్చిన అహంకారమే. 5 ఏళ్లలో దోచుకున్న సొమ్ముని పంచి అధికారంలోకి రావాలని చూస్తున్న జగన్ రెడ్డి ఆశ అడియాశే అవుతుంది. ప్రజలు ఇప్పటికే తెలుగు దేశం-జనసేన ప్రభుత్వం ఎప్పడు ఏర్పడుతుందా అని ఎదురుచూస్తున్నారు. జగన్ రెడ్డి పంచే అవినీతి సొమ్ము తీసుకొని ప్రజలంతా టీడీపీ-జనసేన అభ్యర్థుల కే ఓట్లేస్తారు.

జగన్ అవినీతిని అవినీతిని, నియంత్రత్వాన్ని వైసీపీ నేతలే భరించలేక ఇతరపార్టీల వైపు చూస్తున్నారు
ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ప్రజలకు..రాష్ట్రానికి చేసిన అన్యాయం, ద్రోహం ఎప్పటికీ మాసిపోవు. జగన్ రెడ్డి అవినీతి, నియంత్రత్వాన్ని సొంతపార్టీ నేతలే భరించలేక ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇక ప్రజలు ఆయన్ని నమ్ముతా రా? రాష్ట్రంలో త్వరలోనే తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం.

విలేకరుల ప్రశ్నలకు పుల్లారావు స్పందన…!
చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడుకుంటే ఇరుపార్టీల మధ్య సీట్ల వ్యవహారం సమసిపోతుంది
టీడీపీ-జనసేన పార్టీల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు. ఇరుపార్టీల అధినేతలు కూర్చొని మాట్లాడుకుంటే సీట్ల వ్యవహారం త్వరలోనే సమసిపోతుం ది. టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు అచ్చెన్నాయుడు ఇప్పటికే జనసేన వ్యాఖ్యలపై చంద్రబాబుతో మాట్లాడారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తనను అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తల ముఖం చూశాడా?

బలహీనవర్గాలకు చెందిన వైసీపీ ఎంపీ సంజీవ కుమారే ఇన్నేళ్లలో జగన్ ను రెండుసార్లు కలిశానని చెప్పాడు. ఎంపీలు, ఎమ్మెల్యేలను కలవని వ్యక్తి, ఇప్పుడు సిద్ధం అంటూ కార్యకర్తల ముందుకొస్తే వారెవరూ జగన్ మాటలు నమ్మే పరిస్థితి లేదు.” అని పుల్లారావు తేల్చిచెప్పారు

Leave a Reply