వివేకా హంతకులకు జగన్ రక్షకుడు

-జగన్మోహన్ రెడ్డి పెద్ద అబద్ధాలకోరు
-గొడ్డలివేటు వేయించింది అవినాష్ రెడ్డి కాదా?
-చొక్కా విప్పినంత అవలీలగా అబద్దాలు చెప్పగలడు
-వివేకా చీటీ చించేయడం జగన్ కు ముందే తెలుసు
-సీబీఐ ఎంక్వైరీ కోరి వెనక్కి తీసుకోలేదా?
-గుమ్మడి కంటే ఎక్కువగా ఏడుస్తున్నారు
-టీడీపీ పొటిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

జగన్మోహన్ రెడ్డి పెద్ద అబద్దాలకోరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ. . జగన్ చొక్కా విప్పినంత అవలీలగా అబద్దాలు చెప్పగలడు. జగన్ అడుగడుగునా అబద్ధాలు అవలీలగా మాట్లాడగలడు. చొక్కా విప్పినంత సులువుగా చెప్పగలడు. వివేకానందరెడ్డిని చంపిన హంతకులు బయట తిరుగుతున్నారని జగన్ చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. బాబాయిని చంపిన హంతకులు మీ పక్కనే ఉన్నారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

వివేకా హంతకులు తనకు తెలియదని జగన్ గుండెపై చేయివేసుకొని చెప్పగలరా?
బాబాయిని ఎవరు చంపారు మీకు తెలియదని గుండెలమీద చేయి వేసుకొని చెప్పగలరా? వివేకా హంతకులు జగన్ మాటలకు చప్పట్లు కొడుతూ పక్కనే ఉంటే, బయట తిరుగుతున్నారని జగన్ అనడమేంటి? మేనిఫెస్టో మీటింగ్ లో ఉండగా బాబాయిని నరికి చంపారని ఫోన్ వస్తే ఎవరైనా మీటింగ్ కంటిన్యూ చేస్తారా?

బాబాయిని చంపినవారిని పట్టుకోవాలి, వారికి ఉరిశిక్ష వేయించాలని జగన్ కు ఏ కోశాన లేదు. వెంటనే బాబాయి హంతకులను పట్టుకొని చట్టానికి అప్పగించండని చెప్పాల్సిన జగన్, సీబీఐ దర్యాప్తుకు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. పినతల్లి కారుస్తున్న కన్నీరు తుడవాలని జగన్ కు లేదు. చంద్రబాబు వేసిన సిట్ ను జగన్ ఎందుకు మార్చారో చెప్పగలరా? అభిషేక్ మహంతి ఎందుకు ట్రాన్స్ ఫర్ అయ్యారో చెప్పగలరా? వివేకాను హత్య చేసిన అసలు ముద్దాయిని ఎక్కడ బయటికి తెస్తారో అని జగన్ కు భయం.

దస్తగిరి అప్రూవర్ గా మారినందుకు అతన్ని ముఖ్యమంత్రి హింసించలేదా? అసలు ముద్దాయిలను అరెస్టు చేయండని సీఎం ఆర్డర్ వేస్తే సీబీఐ కి ఐదు నిమిషాల పనే. సీబీఐతో ఎస్పీ రాంసింగ్ పై కేసు పెట్టించింది మీరు కాదా?. ‘‘రక్తపు కూడు తింటున్నాడు మా అన్న’’ అని సొంత చెల్లి షర్మిల చెబితే సమాధానం చెప్పలేదు. హూ కిల్డ్ బాబాయ్ అని ప్రశ్నిస్తే అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయనేది వాస్తవం కాదా? మీ బాబాయిని చంపిందెవరో మీకు తెలుసు, ఎందుకు చంపారో మీకు తెలుసు, ఎలా చంపారో కూడా జగన్ కు తెలుసు, కావాలని అబద్ధాలతో మొసలి కన్నీరు కారుస్తున్నారు.

బాబాయిని చంపిందెవరో జగన్ కుటుంబ సభ్యులతోపాటు రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి తెలుసు. జగన్ ప్రజల్ని మభ్య పెడుతున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా జగన్ లాంటి అబద్ధపు కోరును ఎవరూ ఎక్కడా చూసి వుండరు. బాబాయిని చంపింది ఎవరో జగన్ కు బాగా తెలుసు. అయినా దేవుడికే తెలుసు అనటం పెద్ద అబద్దం. వివేకా చీటీ చించేయడం జగన్ కు ముందే తెలుసు.

గొడ్డలి వేటు వేయించింది అవినాష్ రెడ్డి కాదా? ఆ విషయం మీకు ముందే తెలియదా? ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, అమెరికా ప్రెసిడెంట్ అయినా వారి బాబాయిని నరికి చంపారని వార్త తెలిస్తే.. మా బాబాయిని నరికి చంపారని చెప్పి మీటింగ్ కంటిన్యూ చెయ్యరు. ఆఘ మేఘాలమీద శవాన్ని చూడటానికి పరిగెత్తుతారు. జగన్ యేమో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. గొడ్డలితోనే నరకబోతున్నారనే విషయం కూడా జగన్ కు ముందే తెలుసు. రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని, నమ్మించాలని చూస్తారా? చంద్రబాబు పై ఈ కేసు వేద్దాము, ఎన్నికల్లో లబ్ది పొందుదాము అని చూశారు.

గవర్నర్ వద్దకు వెళ్లి సీబీఐ ఎంక్వైరీ కావాలని కోరారు. ప్రతిపక్ష నేతగా ఉండి హైకోర్టులో పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రి అవగానే పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. వివేకా ముద్దాయిలను పట్టుకోవాలనే ధ్యాస, లక్ష్యం, ధ్యేయం జగన్ కు ఎప్పుడూ లేదు. చచ్చిపోయాడు మా బాబాయ్ తీసి అవతల పడేయండనే ధోరణితో వ్యవహరించారు. మా బాబాయిని చంపిన వారిని పట్టుకోవాలి, పట్టుకొని ఉరిశిక్ష వేయాలి, శిక్ష వేయించాలనే లక్ష్యం మీకున్నట్లు గుండెలమీద చేయి వేసుకొని చెప్పగలరా? దొంగలు దొరకలేదు కేసు మాఫీ చేయాలని చూశారు.

సీబీఐ ఎంక్వైరీకి ఆటంకం కలిగించలేదా?
వివేకా కుమార్తె సునీతమ్మ ఎంతో కష్టపడి సీబీఐ ఎంక్వైరీ వేస్తే.. సీబీఐ ఎంక్వైరీకి అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. జగన్ నటుడని తెలుసు గానీ ఇంత పెద్ద నటుడని తెలియదు. గుమ్మడి వెంకటేశ్వరరావు కంటే ఎక్కువగా ఏడుస్తున్నారు. నటిస్తున్నారు. బేరం కుదిరినప్పటినుండి వారితో గొడ్డలి వేటు వేయించినంతవరకు వారిని ప్రొటెక్ట్ చేయలేదా?

వివేకా హంతకులకు జగన్ పెద్ద రక్షకుడయ్యారు
హంతకులకు మీరు పెద్ద రక్షకుడు. మీ పాలన మాకొద్దు అని రాష్ట్ర ప్రజలు అంటున్నా.. ప్రజల్ని ఏదో ఒక రకంగా మభ్యపెట్టాలనే చూస్తున్నారు. జగన్ అబద్ధాలాడుతున్న తీరు అభినందనీయం. జగన్ కు చిత్తశుద్ది ఉండివుంటే ఈసరికే కేసు క్లోజ్ అయ్యేది. ముద్దాయిలకు ఉరిశిక్ష పడివుండేది. హంతకులెవరో నాకు తెలియదని ధైర్యం చేసి చెప్పగలరా?

ప్రజలు నమ్మరు. తప్పించుకోవాలని చూస్తే కుదరదు. తప్పు చేశాను,అ డ్డుపడ్డాను, అడ్డు పడను, సీబీఐ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే లోపు పట్టుకొండని చెప్పగలరా? అసలు ముద్దాయిలను పట్టుకోమంటే సీబీఐకి అయిదు నిమిషాల పనే. జగన్ సైగ చేస్తే జగన్ చంకలో తిరిగే మొత్తం బ్యాచ్ జ్యుడిషియల్ కస్టడికి వెళ్లిపోతారు.

Leave a Reply