– టీడీపీ హయాం పంచాయతీలకు స్వర్ణయుగం
-న్యాయం, ధర్మమే గెలుస్తుందని అమరావతి ఉద్యమం నిరూపించింది
– బాబాయ్ హత్యపై సిఎం జగన్ నోరు విప్పాలి.
– సర్పంచ్ ల అవగాహన సదస్సులో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
అమరావతి: తెలుగు దేశం హయాం సర్పంచ్ లకు, పంచాయతీ రాజ్ వ్యవస్థ కు స్వర్ణయుగం అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సర్పంచ్ అవగాహన సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు.
సర్పంచ్ లకు చెక్ పవర్ ఇచ్చింది టీడీపీనే అని గుర్తుచేశారు. జగన్ వారి హక్కులను హరిస్తన్నారని..నిధులను మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు గ్రామంలో మరుగుదొడ్ల కు కూడా జగన్ రంగులు వేసుకుంటున్నాడు తప్ప పనులు చెయ్యడం లేదని అన్నారు. 14,15 ఆర్థిక సంఘం నిధులు 7600 కోట్లు దారి మళ్లించారు…. గ్రామ సభ ఆమోదం లేకుండా నేరుగా నిధులు ఖర్చు పెట్ట కూడదు…దీనిపై మీరు పోరాడాలి అని సర్పంచ్ లకు సూచించారు.
అమరావతి రైతుల పోరాటానికి అభినందనలు:
ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని అమరావతి ఉద్యమాన్ని చూస్తే అర్ధం అవుతుంది చంద్రబాబు అన్నారు. రాజధాని విషయం లో ఎందుకు మడమ తిప్పాడో…ఎందుకు మాట తప్పడో జగన్ చెప్పాలి అని నిలదీశారు. జగన్ తాడేపల్లి లో ఇల్లు కట్టుకున్నాడు…రాజధాని ఇక్కడే ఉంటుంది అని చెప్పిన నేతల
మాటలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. అమరావతి రైతులను పెట్టిన ఇబ్బందులు, వైసిపి పెద్దల ఆలోచనలు చూస్తుంటే వీళ్లు మనుషులా పశువులా అనే ఆలోచన వస్తుందని ఘటుగా వ్యాఖ్యానించారు. రాజధాని లో ఒకే వర్గం అని తప్పుడు ప్రచారం చేశారు….ముంపు లేని చోట ముంపు అని ప్రచారం చేశారు అని గుర్తు చేశారు. కృష్ణానది పక్కన ఉండే భూమిని స్మశానం అనడానికి నోరెలా వచ్చిందని ప్రశ్నించారు.
జగన్ లాంటి వారు వస్తారనే పక్కగా CRDA చట్టం చేసామని చంద్రబాబు చెప్పారు. 807 రోజులు రైతులు ఆందోళన చేస్తే అడుగడుగునా అవమానించినా….మహిళా రైతులు వీరోచితంగా పోరాడారని అన్నారు. తప్పుడు నిర్ణయాలతో జగన్ చరిత్ర హీనునుడిగా మిగిలిపోతారని….ఈ రోజు కోర్ట్ ద్వారా వచ్చిన విజయం 5 కోట్ల తెలుగు ప్రజలదని చంద్రబాబు అన్నారు. సిగ్గు లేకుండా నాకు కులం అంట గడుతున్నారు. నాకు ఏ కులం లేదు…పేదలే నా కులం అని చంద్రబాబు అన్నారు.
బాబాయ్ హత్య పై జగన్ నోరు విప్పాలి:
బాబాయ్ హత్య ను గుండెపోటు అని చెప్పింది ఎవరు … .రక్తం మరకలు తుడిచింది ఎవరు? హత్య నేను చేయించాను అన్నట్లు ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడు ఏం చెపుతారని చంద్రబాబు ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కూడా మా మనుషులా అని చంద్రబాబు ప్రశ్నించారు. బాబాయ్ హత్య తో జగన్ రెండు లక్ష్యాలు నెరవేర్చుకున్నారు. హత్యతో వివేకా అడ్డు తొలగించుకున్నారు… నాపై బురద చల్లి రాజకీయ లబ్ధి పొందారు అని వివరించారు. చివరికి ఇప్పుడు వివేకా కూతురు సునీతను కూడా నా పావు అంటున్నారు అని చంద్రబాబు అన్నారు.
సీబీఐ ని కూడా నేనే ప్రభావం చేశానoటున్న వాళ్ళు చివరికి మొగుడు పెళ్ళాం కాపురం చేసుకోపోయినా నేనే కారణం అంటారేమో అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సినిమా టిక్కెట్ల సమస్య, ఉద్యోగుల సమస్యకు నేనే కారణమట…. ఇన్నింటిని నేనే మేనేజ్ చేయగలిగితే ఎన్నికల్లో ఎలా ఓడిపోతాను అని చంద్రబాబు ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్ట్ ను బ్యారేజ్ చేశారు:
పోలవరం ప్రాజెక్టును వైసిపి ప్రభుత్వం చివరికి ఒక సాధారణ బ్యారేజ్ గామార్చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. నిర్మాణం విషయంలో నాడు ఎంతో ప్రాధాన్యం ఇచ్చామని… ఇప్పుడు ఈ ప్రభుత్వం కారణంగా ప్రాజెక్టు మనుగడే ప్రమాదంలో పడిందని అన్నారు.
సర్పంచ్ ల సభలో స్వీట్లు పంచిన మహిళా రైతులు:
సర్పంచ్ ల సభ జరుగుతున్న సమయంలోనే అక్కడికి అమరావతి రైతులు వచ్చారు. హైకోర్ట్ తీర్పు పై
సభలో స్వీట్లు పంచారు. ప్రభుత్వం తమను ఎలా ఇబ్బంది పెట్టిందీ చెపుతూ భావోద్వేగానికి గురయ్యారు. స్వయంగా చంద్రబాబు కూడా మహిళలకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.