Suryaa.co.in

Andhra Pradesh

జగన్ అంటే జైలు… బాబు అంటే ఒక బ్రాండ్

– జగన్ యువత ను మోసం చేశాడు
– జైలు కి వెళ్ళిన ఆర్ధిక ఉగ్రవాది ని చూసి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు?
– కోడి గుడ్డు మంత్రి ని చూసి ఎవరు వస్తారు?
– బాబాయ్ ని లేపేసిన వాళ్ళు మాకు నీతులు చెబుతున్నారు
– ఉడ్తా పంజాబ్ చూశాం. ఇప్పుడు ఉడ్తా ఏపి చూస్తున్నాం.
– తంబళ్లపల్లె ను దోచుకుంది పెద్ది రెడ్డి కుటుంబం
– పార్లమెంట్ లో ఎంపీ మిథున్ రెడ్డి ఏం చేస్తున్నాడు
– తంబళ్లపల్లె లో తాలిబాన్ పరిపాలన
– అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం
– తంబళ్లపల్లె నియోజకవర్గం మద్దయ్యగారిపల్లి విజయగణపతి ఫంక్షన్ హాల్ లో యువత తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్

రాధాకృష్ణ
ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక ఇబ్బందులు పడుతున్నాం. టిడిపి హయాంలో శాంక్షన్ అయిన కాలేజీ పనులు ఇప్పుడు ఆపేశారు.
రమేష్..
వైసిపి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఆపేసింది.
నాగేష్ బాబు
యువత మత్తు కి బానిస అవుతున్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చాకా కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు.
శ్రీకాంత్
బీటెక్ చేసి ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నాం. స్థానికంగా ఉద్యోగాల కల్పన కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటారు.
విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు రావడం లేదు. ఫీజులు ఎక్కువ ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చే సహాయం చాలా తక్కువగా ఉంది.
స్వయం ఉపాధికి ప్రోత్సాహం లేదు.
క్రీడలకు ఎటువంటి సహకారం ప్రభుత్వం నుండి అందడం లేదు.
– తంబళ్లపల్లె నియోజకవర్గం యువత

వారి సమస్యపై స్పందించిన లోకేష్‌ ఏమన్నారంటే…
వైసిపి పాలనలో ఎక్కువ నష్టపోయింది ఏపి యువత.బాబు పాలనలో ఏపి జాబ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉండేది.జగన్ పాలనలో ఏపి ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మార్చేశారు.పాలిచ్చే ఆవుని వద్దని తంబళ్లపల్లె లో తన్నే దున్నపోతు ను తెచ్చుకున్నారు.60 వేల మెజారిటీ తో గెలిచిన ఎమ్మెల్యే కనీసం గత ప్రభుత్వం కేటాయించిన డిగ్రీ కళాశాల పూర్తి చెయ్యలేని పరిస్తితి. టిడిపి వచ్చిన మొదటి ఏడాది లో బి . కొత్త కోట లో డిగ్రీ కళాశాల పూర్తి చేస్తాం.జగన్ యువత ను మోసం చేశాడు.2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని మోసం చేశారు. ప్రతి ఏడాది 6,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తానని మోసం చేశారు. ప్రతి ఏడాది డిఎస్సీ అన్నారు. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం అన్ని ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం. నాలుగేళ్లు ఇంట్లో పడుకొని ఇప్పుడు సమిట్ అంటూ మోసం చెయ్యాలని చూస్తున్నారు.ఉన్న కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమేశారు జగన్. పెద్ద కంపెనీలు అన్ని వీళ్ళ బెదిరింపులకు భయపడి ఏపికి బై బై చెప్పేశారు.

రాయలసీమకి రావాల్సిన రిలయన్స్ వెళ్ళిపోయింది. అమరరాజా కంపెనీ తెలంగాణకు వెళ్ళిపోయింది. టిడిపి హయాంలో 6 లక్షల ఉద్యోగాలు, 40 వేల కంపెనీలు వచ్చాయని వైసిపి ప్రభుత్వం శాసనసభ సాక్షిగా అంగీకరించింది. ఉడ్తా పంజాబ్ చూశాం. ఇప్పుడు ఉడ్తా ఏపి చూస్తున్నాం. గంజాయి సప్లయ్ అంతా వైసిపి నాయకుల ద్వారానే జరుగుతుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి లేని రాష్ట్రంగా మార్చేందుకు యుద్దప్రాతపధికన చర్యలు తీసుకుంటాం.తంబళ్లపల్లె లో కంపెనీలు రావాలి అంటే ప్రజలు పెద్దిరెడ్డి కుటుంబం కి బై బై చెప్పాలి. పార్లమెంట్ లో ఎంపీ మిథున్ రెడ్డి ఏం చేస్తున్నాడు. ఒక్క కంపెనీ అయినా తెచ్చారా? వాళ్ళ సొంత కంపెనీ అభివృద్ది తప్ప ఒక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగం ఇప్పించలేదు.

టిడిపి హయాంలో అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించాం.రాయలసీమకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ పరిశ్రమలు తీసుకొచ్చాం.విశాఖపట్నం కు ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం.తంబళ్లపల్లె ను అభివృద్ది చేసింది టిడిపి. 1500 కోట్లు నిధులు ఇచ్చి అభివృద్ది చేసింది టిడిపి. తంబళ్లపల్లె ను దోచుకుంది పెద్ది రెడ్డి కుటుంబం. ఎన్నికల ముందు జగన్ కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నాడు.జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా దీవెన, వసతి దీవెన అంటూ మోసం చేశారు.గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా నేరుగా కాలేజీలకు ఫీజు చెల్లించి తల్లితండ్రులు పై ఎటువంటి భారం లేకుండా చేసాం.ఇప్పుడు అరకొరగా డబ్బులు వేసి తల్లితండ్రుల పై సుమారుగా లక్ష రూపాయిలు భారం పడేలా చేశారు. ఫీజులు కడితే కానీ పిల్లలకు హల్ టికెట్, సర్టిఫికేట్లు రాని పరిస్థితి.టిడిపి గెలిచిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తాం.బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం ను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.విదేశీ విద్య పథకాన్ని రద్దు చేసి పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేశారు.జీఓ 77 ద్వారా పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేశారు.

జగన్ అంటే జైలు… బాబు అంటే ఒక బ్రాండ్.జైలు కి వెళ్ళిన ఆర్ధిక ఉగ్రవాది ని చూసి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు. కోడి గుడ్డు మంత్రి ని చూసి ఎవరు వస్తారు. జగన్ పాలన లో వచ్చిన ఒక్క పరిశ్రమ చూపించమని ఛాలెంజ్ చేస్తున్నా. టిడిపి తెచ్చిన కంపెనీలకి రిబ్బన్ కటింగ్ చెయ్యడం తప్ప మీరు తెచ్చిన కంపెనీ ఒక్కటి అయినా ఉందా. అనంతపురానికి కియా వస్తుంది అని ఎవరైనా ఊహించారా? పాపాల పెద్ది రెడ్డి కుటుంబాన్ని సాగనంపండి జిల్లా లో యువత కు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ని అడ్డంగా దోచుకుంది పాపాల పెద్ది రెడ్డి కుటుంబం. 10 వేల కోట్ల ప్రజా ధనం దొబ్బేసారు.పాడి రైతులు, మామిడి రైతుల్ని దోచుకున్నారు. ఇసుక, మైన్లు, భూమి, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం సొంత కంపెనీనే… ఇలా అన్ని పెద్ది రెడ్డి కుటుంబమే దోచుకుంటుంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు పరిశ్రమలు రావాలి అంటే పెద్ది రెడ్డి కుటుంబం కి ప్రజలు బై బై చెప్పాలి. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత స్వయం ఉపాధి కి పెద్దపీట వేస్తాం. రుణాలు పెద్ద ఎత్తున ఇచ్చేలా చేస్తాం. తంబళ్లపల్లె లో తాలిబాన్ పరిపాలన సాగుతుంది. ఇక్కడ అరాచక పాలన సాగుతుంది. గతంలో జగన్ వలన ఐఎఎస్ లు జైలు కి వెళ్ళారు. ఈ సారి జగన్ తనతో పాటు కొంత మంది ఐపిఎస్ అధికారులను కూడా జైలుకి తీసుకెళ్లబోతున్నాడు. వ్యవసాయం, అనుబంధ రంగాల పట్ల ఆసక్తి ఉన్న యువత ను ప్రోత్సహిస్తాం.ఉమ్మడి చిత్తూరు జిల్లాకు స్పోర్ట్స్ యునివర్సిటీ తీసుకొస్తాం. సక్సెస్ కి షార్ట్ కట్ లేదు… యువత కష్టపడితేనే విజయం సాధిస్తారు.యువత ను టిడిపి లో రాజకీయంగా ప్రోత్సహిస్తాం.

టిడిపి వేసిన సిసి రోడ్ల మీద వైసిపి వాళ్ళు గడప గడపకు కార్యక్రమం చేస్తున్నారు. నేను తెచ్చిన కంపెనీలు ఇవి…మేము పూర్తి చేసిన ప్రాజెక్టుల గురించి చెప్పి పెద్ది రెడ్డి కుటుంబానికి ఛాలెంజ్ చేశాను. మూడు సార్లు ఎంపి ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక్క కంపెనీ తీసుకొచ్చాను, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశాను అని చెప్పగలిగాడా? అధికారుల పై ఒత్తిడి తెచ్చి నాకు నోటీసులు ఇచ్చి జిల్లా నుండి పంపించి ఛాలెంజ్ కి వచ్చానని ఎంపీ గొప్పలు చెప్పుకున్నారు. బెయిల్ తీసుకొని బ్రతికే బ్యాచ్ జగన్ రెడ్డి. ఇప్పటికీ జగన్ బెయిల్ పైనే బ్రతుకుతున్నారు. కోర్టుకు వెళ్లి అరెస్టు చేయ్యోదు అని ఉత్తర్వులు తెచ్చుకునే వాళ్ళు కూడా, మాకు నీతులు చెబుతున్నారు. దమ్ము, ధైర్యం తో ప్రజల్లో తిరుగుతున్నా మేము ఏం చేశామో చెబుతున్నా. మీకు సత్తా ఉంటే ఏం పీకారు చెప్పండి.తండ్రి తో సమానం అయిన బాబాయ్ ని లేపేసిన వాళ్ళు మాకు నీతులు చెబుతున్నారు. చెల్లికి న్యాయం చెయ్యలేని జగన్ రాష్ట్రం లోని యువత కు న్యాయం చేస్తానంటూ చెవిలో పువ్వు పెడుతున్నాడు.

LEAVE A RESPONSE