Home » పులి లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని పిల్లిలా మార్చారు

పులి లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని పిల్లిలా మార్చారు

-ఉద్యోగస్థులకు పెద్ద పీట వేశాం
-దూదేకులను అన్ని రంగాల్లో ఆదుకున్న ఘనత తెలుగుదేశానికే దక్కుతుంది
-ముస్లీం పేద విద్యార్ధులకు అందే విదేశీ విద్యను రద్దు చేశారు
-దుల్హన్ పథకం, రంజాన్ తోఫాలను నిర్వీర్యం చేశారు
-దూదేకులను చట్టసభలకు పంపే బాధ్యత టీడీపీదే
-రెండు కళ్ల లాంటి అమరావతి, పోలవరంలను నిర్వీర్యం చేసి రాష్ట్రానికి గుడ్డిగా మార్చేశారు
– దూదేకులు/నూర్ భాషల సభలో చంద్రబాబు నాయుడు
పులి లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని పిల్లిలా మార్చారు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లీం దూదేకులు ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నారు. దూదేకులను అన్ని రంగాల్లో ఆదుకున్న చరిత్ర టీడీపీకే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన సమక్షంలో మాజీ ఐపీఎస్ అధికారి పి. షేక్ షావలి ఆయన సతీమణి పి. ఆశాభేగంలతో పాటు 100
noor1
మందికి పైగా దూదేకులు/నూర్ భాషాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ… దూదేకుల కులానికి మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో, తెలుగుదేశంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని షేక్ షావలి దంపతులు పార్టీలో చేరారన్నారు. మేథావులు ఇప్పటికైనా కళ్లు తెరిచి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించండని పిలుపునిచ్చారు.
దూదేకుల జాతికి తెలుగుదేశం పార్టీ పెద్ద పీట వేస్తుందన్నారు. ఉర్దూను రెండో భాషగా ప్రకటించిన ఘనత టీడీపీదే. మైనార్టీ విద్యార్ధులకు కాలేజీలు, హజ్ హౌస్ లు కట్టించాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ను ఐటీ రంగంలో అభివృద్ధి చేయడంతో లక్షలాది మంది ముస్లీం యువతకు ఉద్యోగవకాశాలు కల్పించాం. అలాగే అమరావతిని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లాను. నా మీద నమ్మకంతో 34,323 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు.
కాని నేడు జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేశారు. మూడు టాయిలెట్లు కట్టడం చేతగాని వ్యక్తి మూడు రాజధానులు కడతానని పిచ్చి తుగ్లక్ లా మాట్లాడుతున్నాడు. పోలవరం ప్రాజెక్టును 2020 జూన్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో 70 శాతం పూర్తి చేస్తే నేడు పోలవరాన్ని ప్రశ్నార్ధకంలా మార్చారు. అమరావతి, పోలవరం నా రెండు కళ్లుగా భావించి అభివృద్ధి చేస్తే నేడు జగన్మోహన్ రెడ్డి రెండు కళ్లను పొడిచేసి రాష్ట్రాన్ని గుడ్డిగా మార్చేశారు.
2029 నాటికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు అడుగులు వేస్తుంటే నేడు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సర్వనాశనం చేశారు. రైల్వే జోన్ విషయంలో తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారు. నాడు వాజ్ పేయి హయాంలో రూ.1300 కోట్లతో నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల భాటలో పట్టిస్తే నేడు భూములు దోచుకునేందుకు స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి దోచుకోవడం తప్ప ఏమీ తెలియదు.
నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగస్థులకు పెద్ద పీట వేశాం. ఉద్యోగ విరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్ సీ 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్థులను మోసం చేశారు. 7 డీఏలు బకాయిలు పెట్టారు. సీపీఎస్ వారంలో రద్దన్నారు. ఇంకా ఎన్ని వారాలు కావాలి? సీపీఎస్ రద్దు హామీని తెలియక ఇచ్చామని సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతున్నారు. నాడు మ్యానిఫెస్టోను అమలు చేయకపోతే చెప్పుతో కొట్టామన్న వ్యక్తులను నేడు ఎన్ని చెప్పులతో కొట్టాలి.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క ముస్లీంకు ఒక్క రుణ సదుపాయం కల్పించిన ధాఖలాలు ఉన్నాయా? ఓటీఎస్ ఇళ్లు పేదలకు ఉరితాళ్లు. ఒక్క ఇంటిని కట్టించకుండా మేము కట్టించిన ఇళ్లకు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటీఎస్ కట్టాలి? రేపో మాపో మళ్లీ కరెంట్ ఛార్జీలు
noor2పెరగబోతున్నాయి. ప్రజలపై బాధుడు ఆగదు. అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడున్నారు. ప్రతిపక్ష పార్టీపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 6 లక్షల కోట్ల అవినీతి అని తీరా అధికారంలోకి వచ్చిన తరువాత 6 పైసలు కూడా నిరూపించలేకపోయారు.
జగన్మోహన్ రెడ్డి మీద రూ.43వేల కోట్లు అవినీతి జరిగిందని సాక్షాత్తు సీబీఐ తేల్చింది. నా మీద అక్రమ కేసులు బనాయించాలని ప్రయత్నించి అభాసుపాలయ్యారు. రాజశేఖర్ రెడ్డి నా మీద 25 ఎంక్వైరీలు వేసి నన్ను ఏమీ చేయలేకపోయారు. కాని జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికకు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా

రూ.1200 కోట్లు వచ్చాయని సీబీఐ చెప్పింది. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా యాక్షన్ తీసుకోవచ్చు. కాని జగన్మోహన్ రెడ్డి మాత్రం తప్పు చేయని వారిపై అక్రమ కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య విషయంలో సీబీఐ ఎంక్వైరీ కావాలని తరువాత వద్దన్నారు. పరిటాల హత్య కేసులో ముద్దాయులను ఎస్టాబ్లిష్ చేయలేదు.
వైసీపీ నేతల ఒత్తిళ్లకు తాళలేక మైనార్టీకి చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుల మధరసాపై దాడి చేశారు. మైనార్టీలపై విచక్షణారహితంగా దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. వక్ఫ్ భూములు కబ్జాకు గురి చేస్తున్నారు. ఒక్క చాన్స్ అని అధికారంలోకి వచ్చి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారు.
రాజ్యంగ వ్యవస్థలను ఖూనీ చేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తటానికి బులుగు మీడియా పని చేస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన మాజీ న్యాయమూర్తులకు పదవులు ఆశచూపి పరిపాలన బ్రహ్మంఢంగా ఉందని చెప్పిస్తున్నారు. తమిళనాడు నుండి వచ్చిన మాజీ జడ్జికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయం, అక్రమం కనపడలేదా? ఒక ఆర్ధిక ఉగ్రవాది, ఒక నేరస్థుడికి ఎలా మద్దుతును ఇస్తారు.
నేడు రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలోని పరిస్థితులను మేథావులు అర్ధం చేసుకోవాలి. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఛైతన్యవంతులుగా తీర్చిదిద్దాలి.

Leave a Reply