Suryaa.co.in

Andhra Pradesh

కొలువుల జాతర పేరుతో వసూళ్ల జాతరకు తెరలేపిన జగన్ రెడ్డి.. ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి

-విశ్వవిద్యాలయాల్లోని ఖాళీల భర్తీకి యూజీసీ ఇచ్చిన కొత్తనోటిఫికేషన్ .. జగన్ రెడ్డి పోస్టుల అమ్మకంలో భాగంగా ప్రకటించిన క్లియరెన్స్ సేల్ ఆఫర్ కు అద్దం పడుతోంది
• యూజీసీ నోటిఫికేషన్ మొత్తం తప్పుల తడకే. ఒక్కోపోస్టుకి తొలుత 12 మందిని ఎంపిక చేయడం.. తర్వాత విశ్వవిద్యాలయం మరలా ఒక్కోపోస్టుకి 4గురిని ఎంపిక చేస్తుందనే నిబంధన ఎందుకు పెట్టారు?
• గతంలో టీడీపీప్రభుత్వమిచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా అర్హత పొందిన అభ్యర్థుల్ని కాదని.. సుప్రీంకోర్టులో ఉన్న ఎస్.ఎల్.పీని తోసిపుచ్చి హడావుడిగా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలి
• జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విశ్వవిద్యాలయాలు ప్రవేశాలు లేక వెలవెలబోతుంటే.. సిబ్బంది ఈగలు తోలుకుంటున్నారు
• జగన్ రెడ్డి తన కలెక్షన్ల కోసం ఇష్టానుసారం విశ్వవిద్యాలయాల్లోని పోస్టుల్ని భర్తీచేసి..అర్హులైన వారికి అన్యాయం చేస్తుంటే టీడీపీ చూస్తూ ఊరుకోదు
• యూజీసీ కొత్త నోటిఫికేషన్ ను సమగ్రంగా పరిశీలించాలని.. నవీన విద్యాలయాలైన విశ్వవిద్యాలయాలను కాపాడాలని గవర్నర్ ను కోరుతున్నాం
– టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్

దేశభవిష్యత్ ను నిర్దేశించే విశ్వవిద్యాలయాలు.. నవీన దేవాలయాలను జగన్ రెడ్డి రాజకీయాలు.. అక్రమాలు.. అరాచకాలకు నిలయంగా, వ్యాపారకేంద్రాలుగా మార్చాడ ని, రాష్ట్రంలోని విశ్వవి ద్యలయాల్లో కొలువుల జాతరపేరుతో వసూళ్లజాతర జరుగు తోందని, 17 విశ్వ విద్యాలయాలు.. ఆర్.జీ.కే.యూ.టీల్లోని 3,200ల పోస్టుల్ని జగన్ రెడ్డి అమ్మకానికి పెట్టాడని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ దసరా, దీపావళి పండుగల సందర్భంగా పెద్దపెద్ద మాల్స్.. దుకాణాల్లో డిస్కౌంట్లు ఇచ్చినట్టు… విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపక, అధ్యాపకేతర కొలువుల అమ్మకంతో జగన్ రెడ్డి భారీ క్లియరెన్స్ సేల్ కు తెరలేపాడు. విశ్వవిద్యాలయాల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీతో పాటు.. ఇతరత్రా ఉద్యోగాల అమ్మకానికి తెరలేపి జగన్ ప్రభుత్వం, రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టడానికి సిద్ధమైంది.

యూజీసీ నోటిఫికేషన్ మొత్తం తప్పుల తడకే. ఒక్కోపోస్టుకి తొలుత 12 మందిని ఎంపిక చేయడం.. తర్వాత విశ్వవిద్యాలయం మరలా ఒక్కోపోస్టుకి 4గురిని ఎంపిక చేస్తుందనే నిబంధనే ముఖ్యమంత్రి తలపెట్టిన క్లియరెన్స్ సేల్ కు నిదర్శనం
విశ్వవిద్యాలయాల్లోని ఖాళీల భర్తీకి యూజీసీ తాజాగా 30-10-2023న ఇచ్చిన నోటిఫికేషన్ మొత్తం తప్పులతడకే. ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఒక్కో పోస్టుకి 12మందినిఎంపిక చేసి విశ్వవిద్యాలయాలకు జాబితా పంపితే, ఆ జాబితాలోని వారిని ఇంటర్వ్యూలు చేసి మరలా 4 గురిని ఎంపిక చేస్తామనడం ఏమిటి.. అసలు ఇందులోని మతలబు ఏమిటో ప్రభుత్వమే చెప్పాలి. అంటే మొత్తంగా ఈ ఎంపిక ప్రక్రియను అడ్డంపెట్టుకొని నిరుద్యోగు ల నుంచి ఎంతవీలైతే అంత రాబట్టాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని అర్థమవుతోంది.

నోటిఫికేషన్ వెలువడగానే..వైసీపీ దళారీలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే వైసీపీ సానుభూతిపరులు రంగంలోకి దిగి, ఒక్కోపోస్టుకు ఒక్కోధర నిర్ణయించి, వైస్ ఛాన్సలర్ కార్యాలయాలను దళారీ కేంద్రాలుగా మార్చారు. రేషనలైజేషన్ పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకం అంతా ఇంతాకాదు. యూజీసీ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో 200 పోస్టుల్ని, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) లోని 150కు పైగా పోస్టుల భర్తీకి పంపిన ప్రతిపాదనల్ని ఇతర విశ్వవిద్యాలయాలకు మళ్లించే అధికారం జగన్ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?

ఇతర విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది అవసరమైతే.. కొత్తగా నియామకాలు చేపట్టాలి. అందుకోసం అవసరమైతే ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించాలి. అంతేగానీ ప్రధాన విశ్వవిద్యాలయాలకు చెందిన పోస్టుల్ని రోస్టర్ విధానంలో ఇతర విశ్వవిద్యాలయాలకు మళ్లించే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖమంత్రి.. ముఖ్యమంత్రి.. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాలి.

విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టులో ఎస్.ఎల్.పీ పెండింగ్ లో ఉంటే కొత్త నోటిఫికేషన్ ఎలా ఇస్తారు? సుప్రీంకోర్టు తీర్పుతో భవిష్యత్ లో నష్టపోయేవారికి జగన్ రెడ్డి న్యాయం చేస్తాడా?
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని ఉద్యోగాలభర్తీకి సంబంధించి తలెత్తిన వివాదం తాలూకా ఎస్.ఎల్.పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంటే.. ప్రభుత్వం ఉద్యోగాలభర్తీకి ఎలా నోటిఫికేషన్ ఇచ్చింది? ఎస్.ఎల్.పీ నెం- 15973/ 2023 పెండింగ్ లో ఉంటే.. 3,200 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం ముమ్మాటికీ పోస్టుల్ని అమ్ముకోవడానికే. కొందరు నిరుద్యోగులు తమకు అన్యాయం జరిగిందని గతంలో సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే.. దానిపై న్యాయస్థానంలో విచారణలు జరు గుతుండగానే జగన్ ప్రభుత్వం ఎందుకు తొందరపడింది?

యూజీసీ ఇచ్చిన నోటిఫికేష న్ లోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ తదితర వ్యవహారాలు అన్నీ.. సుప్రీం కోర్టు తుది ఉత్తర్వులకు లోబడే ఉంటాయని కూడా పేర్కొన్నారు. అంటే జగన్ రెడ్డి. ..అతని ప్రభుత్వం అన్నీ తెలిసే..కేవలం నిరుద్యోగుల్ని మభ్యపెట్టి.. వారినుంచి అందిన కాడికి దండుకొని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి.. తరువాత తప్పించుకుంటే.. వారే కోర్టుల చుట్టూ తిరుగుతారు.. తరువాత వచ్చే ప్రభుత్వాలు వాటిచావు అవి ఛస్తాయిలే అన్న దురుద్దేశంతోనే ఇంతకు దిగజారింది. హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చి విశ్వవిద్యాలయాల్లోని ఉద్యోగాలు భర్తీచేసేస్తే.. భవిష్యత్ లో సుప్రీంకోర్టు ఆ భర్తీ చెల్లదని తీర్పు చెబితే.. లక్షల రూపాయలు చెల్లించి ఉద్యోగాల్లో చేరిన వారిని పరిస్థితి ఏమిటో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి.

టీడీపీప్రభుత్వంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఎంపికైన అభ్యర్థులకు న్యాయం చేయకుండా.. జగన్ ప్రభుత్వం కొత్తనోటిఫికేషన్ ఇవ్వడం అర్హులకు అన్యాయం చేయడం కాదా?
చంద్రబాబునాయుడి ప్రభుత్వం 2018లో 1200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీపీ ఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తే.. దాదాపు 25వేలమంది పరీక్షరాస్తే.. వారిలో 5 వేలమంది అర్హత పొందితే.. వారిలో కొందరిని ఎంపికచేసి వారంలో ఉద్యోగా లు ఇవ్వడానికి సిద్ధమైంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవ డంతో ఏపీపీ ఎస్సీ ద్వారా అర్హత పొందిన అభ్యర్థులకు న్యాయం చేయకుండా.. కుంటిసాకులు చెప్పి నాలుగేళ్లు తప్పించుకున్న జగన్ ప్రభుత్వం మరలా కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటి? గతంలోపరీక్షలు రాసి అర్హత పొందిన వారంతా ఏపీలోని నిరుద్యోగులే కదా.. అలాంటప్పుడు వారిని కాదని జగన్ రెడ్డి.. అతని ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం వారికి అన్యాయం చేయడం కాదా?

2018లో టీడీపీ ప్రభుత్వమిచ్చిన నోటిఫికేషన్ అసమగ్రంగా ఉందని.. దాన్ని రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లిన జగన్ ప్రభుత్వం.. ఆ నోటిఫికేషన్ లోని నిబంధనలకు వి రుద్ధంగా యూనివర్శిటీని యూనిట్ గా తీసుకొని కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం.. నచ్చిన విధంగా రోస్టర్ పాయింట్లు సిద్ధంచేసి…పోస్టులభర్తీ చేపట్టాలనుకోవడం ముమ్మాటికీ చట్ట విరుద్ధం.. యూ.జీ.సీ నిబంధనలకు విరుద్ధమే.

మహిళలు.. దివ్యాంగుల రిజర్వేషన్లు…వారికి దక్కాల్సిన పోస్టులకు మంగళం. సీ.ఏ.ఎస్ కింద జరిగిన అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీపై టీడీపీప్రభుత్వం రాగానే విచారణజరిపి అనర్హులపై చర్యలు తీసుకుంటుంది
గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. కానీ ఈ ప్రభుత్వం బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి కూడా పరీక్ష నిర్వహించడానికి సిద్ధమైంది. అలానే యూజీసీ కొత్త నోటిఫికేషన్లో మహిళలకు, దివ్యాంగులకు రిజర్వేషన్ల ప్రకారం కేటాయించాల్సిన పోస్టుల్ని ఎందుకు కేటాయించలే దో కూడా జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. భర్తీ చేయాల్సిన పోస్టుల్లో అవసరమై తే 10శాతం పోస్టులు పెంచి వాటిని EWS కోటా కింద భర్తీ చేయాలని నిబంధన ఉంటే.. దాన్ని కాదని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు.. మహిళలు.. దివ్యాంగులకు అన్యాయం చేసేలా విశ్వవిద్యాలయాల్లోని పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం ఆయా అభ్యర్థులకు అన్యాయం చేయడం కాదా?

కొత్త పోస్టుల్ని భర్తీ చేసే ముందు జగన్ రెడ్డికి గతంలో తాను ఇచ్చిన హామీ గుర్తులేదా? దశాబ్దాల నుంచి విశ్వ విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలన్న ఆలోచన విస్మరించి..కొత్తగా సిబ్బందిని నియమిస్తే..ఎప్పటినుంచో పనిచేస్తున్నవారు ఏమైపోవా లి? జగన్మోహన్ రెడ్డి, హేమచంద్రారెడ్డి వైస్ ఛాన్సలర్లుగా తమ వర్గం వారినే నియమించారు. వారి ద్వారా ఇప్పుడు యూజీసీ నోటిఫికేషన్ ను తన ఆదాయవన రుగా మార్చుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు.

సీ.ఏ.ఎస్ (కెరీర్ అడ్వాన్స్ స్కీమ్) కింద నియమించిన అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీలో కూడా గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. పీ.హెచ్.డీ అవార్డు చేయలేని వారిని అసోసియేట్ ప్రొఫెసర్లుగా నియమించి లక్షల రూపాయలు దండుకున్నారు. జగన్ రెడ్డి తన అవినీతికోసం చేపట్టిన ప్రొఫెసర్ల నియా మకంపై టీడీపీప్రభుత్వం రాగానే విచారణ జరిపి.. అసలు దొంగల్ని కఠినంగా శిక్షిస్తుంది.

యూజీసీ కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దుచేయాలి
హేమచంద్రారెడ్డి ఉన్నతవిద్యా మండలి ఛైర్మన్ అయినప్పటినుంచీ రాష్ట్రంలోని విశ్వవి ద్యాలయాలు సర్వనాశనం అయ్యాయి. 27-01-2023న సమాచారహక్కు చట్టం కింద ప్రభుత్వం తమకు అందించిన వివరాలే అందుకు నిదర్శనం. ఒకప్పుడు విద్యార్థులతో కిటకిటలాడిన విశ్వవిద్యాలయాలు నేడు ప్రవేశాలు లేక వెలవెలబోతున్నాయి. విశ్వవిద్యాలయాల్లోని సిబ్బంది ఈగలు తోలుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 2,367 మంది విద్యార్థులు చేరాల్సి ఉంటే, కేవలం 1222 మంది మాత్రమే చేరారు.

అంటే 52శాతం అడ్మిషన్లు జరగలేదు. ఆంధ్రా విశ్వవి ద్యాలయంలో 2511 సీట్లు ఉంటే, కేవలం 1783 స్థానాలు మాత్రమే భర్తీ అయ్యాయి. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో 198 సీట్లుంటే, కేవలం 19 మంది మాత్రమే చేరారు. కేవలం 10శాతమే చేరారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 1212సీట్లు ఉంటే, 534 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఎందుకు చేరడం లేదని జగన్ రెడ్డి ఏనాడైనా ఆలోచించాడా? జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు…ముఖ్యమంత్రి ఒంటెత్తు పోకడలు రాష్ట్ర ఉన్నత విద్యా రంగాన్ని భ్రష్టుపట్టించింది నిజం కాదా? ఫీజు రీయింబర్స్ మెంట్ నిలిపేయడం… విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చడమే.

వాటిలోప్రవేశాలు తగ్గిపోవడా నికి కారణం. విశ్వవిద్యాలయాల్లోని పోస్టులు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్…దానికి సంబంధించిన జీవోని కూడా జగన్ ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వ వెబ్ సైట్లో పెట్టలేదు? ఇదంతా పోస్టుల క్లియరెన్స్ సేల్ భాగంకాక ఏమిటో ముఖ్యమంత్రి చెప్పాలి. రాష్ట్ర యువత సేవ్ యూనివర్శిటీస్.. సేవ్ ఎడ్యుకేషన్ నినాదాలతో రాష్ట్రాన్ని హోరెత్తించాలి. గవర్నర్ తక్షణమే జగన్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లోని పోస్టుల అమ్మకం కోసం తీసుకొచ్చిన యూజీసీ కొత్త నోటిఫికేషన్ ను రద్దుచేయాలి” అని సప్తగిరి ప్రసాద్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE