Suryaa.co.in

Andhra Pradesh

నవ మోసాలతో జగన్ రెడ్డి కుట్ర

1. దొంగ ఓట్లు చేర్పించడం.. ప్రతిపక్షాల ఓట్లు తొలగించడం మొదటి మోసం
2. అవినీతి సొమ్ముతో పోలీసులు, అధికారులను, ఉద్యోగులను కొనడం రెండవ మోసం
3. రాష్ట్రంలో కులాలు, మతాలు మధ్య చిచ్చులు పెట్టి అశాంతి సృష్టించడం మూడవ మోసం
4. మాధకద్రవ్యాలతో యువతను నాశనం చేయడం నాలుగవ మోసం
5. పోలీంగ్ బూతుల్లో రౌడీలను పెట్టి బూత్ ఆక్రమణలు చేయడం ఐదవ మోసం
6. మాఫీయాల అండ ఉన్నా.. నేకొక్కడినే, నాకెవరూ లేరంటూ ఏడ్వడం ఆరవ మోసం
7. 98.5% హామీలు అమలు చేశానని చెప్పడం ఏడవ మోసం
8. ప్రభుత్వ అధికారులను బయపెట్టి లోబరుకోవడం ఎనిదవ మోసం
9. బూటకపు సామాజిక న్యాయంపై ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం తొమ్మిదవ మోసం

-టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ

మంగళగిరి: జగన్ రెడ్డి ఇప్పటివరకు నవరత్నాలంటూ ప్రజలను మభ్యపెట్టారని.. రాబోయే ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు ‘నవ మోసాలు’ అనే కార్యక్రమాలను ఎంచుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఎద్దవా చేశారు.

జగన్ రెడ్డి ఎన్నికల అక్రమాలకు పాల్పడబోతున్నారంటూ.. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఆదివారం నాడు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘వైకాపా సానుభూతిపరుల పేరుతో దొంగ ఓట్లు చేర్పించడం.. ఫామ్ 7 ధరఖాస్తులతో ప్రతిపక్ష కూటమికి చెందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఓట్లను తొలగించడం జగన్ రెడ్డి మొదటి మోసంగా ఎంచుకున్నారు. జగన్ రెడ్డి ఓట్ల తొలగింపు కార్యక్రమాలపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పోరాడి అడ్డుకుంది.

అయినా, జగన్ రెడ్డికి చెందిన బులుగు బ్యాచ్ ఇంకా ఓట్ల తొలగింపు కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవినీతి సొమ్ము ఎదజల్లి పోలీసులతో పాటు అధికారులను, ఉద్యోగులను కొంటూ రెండవ మోసానికి స్వీకారం చుట్టాడు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో కులాలు, మతాలు మధ్య చిచ్చులు పెట్టి అశాంతి సృష్టించాలని మూడవ మోసానికి తెరలేపారు.

సిటిజన్స్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ) పై దుష్ప్రచారం చేస్తూ ముస్లింలను రెచ్చగొడుతున్నాడు. నాలుగవ మోసంగా మాదకద్రవ్యాలను రాష్ట్ర వ్యాప్తంగా వెదజల్ల్లి యువత ఆలోచనలను నిర్వీర్యం చేసి..వారిని మత్తులోకి నెట్టి వారితో ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నాడు. విశాఖపట్నంలో దొరికిన డ్రైడ్ ఈస్ విత్ కొకైనే ఇందుకు మంచి ఉదాహరణ.

యువత మెదళ్లలో సొంత ఆలోచనలు రానీకుండా ..జగన్ రెడ్డి అవినీతిని ప్రశ్నించకుండా, ఉద్యోగ అవకాశాలు కోరకుండా ఉంచేందకు వారిని జీవచ్ఛవాల్లా చేయాలని చూస్తున్నాడు.
ఐదవ మోసంగా పోలీంగ్ బూతుల్లో రౌడీలను పెట్టి బూత్ ఆక్రమణలు చేసుకుని సామాన్యులను ఓటు వేయడానికి రాకుండా చేసి, జగన్ రెడ్డి ముఠానే ఈవీఎం ఓట్లు నొక్కేసుకునేందుకు కుట్రలు పన్నారు.

జగన్ రెడ్డికి సాక్షి, ల్యాండ్, శాండ్, వైన్, మైన్, డ్రగ్ మాఫీయాలు ఉన్నా.. నేకొక్కడినే, నాకెవరూ లేరంటూ ఏడ్వడం ఆరవ మోసంగా రఫీ పేర్కొన్నారు. జగన్‌కు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5, ఏబీఎన్ లాంటి మీడియాలు లేవని నిరంతరం ఏడుపుగొట్టు మోహంతో ఏడుస్తుంటాడని అన్నారు. ‘జగన్ రెడ్డికి సొంత మీడియా సాక్షి కాక టీవీ-9, ఎన్.టీ.వీ లాంటి అనేక కూలీ, నీలీ మీడియాలు ఉన్నాయి. ఇవి కాకుండా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంటాడు.

అయినా రాజకీయ సభల్లో మాత్రం ఇవేవీ లేవని మాట్లాడుతుంటాడు. పాదయాత్రలో ఇచ్చిన 750 హామీలు అమలు చేయకుండా.. 98.5% హామీలు అమలు చేశానంటూ ఏడవ మోసానికి ఒడిగట్టుతున్నాడు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలలో కనీసం 60 హామీలను అమలు చేయలేదు. జగన్ రెడ్డి పాదయాత్ర హామీలు 85 శాతం అమలు కాలేదని తెలుగుదేశం పార్టీ పుస్తకం వేస్తే వాటిపై నేటికి సమాధానం లేదు.

మ్యానిఫెస్టో ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవగ్దీత అంటూ చెప్పకునే జగన్ రెడ్డి.. సంపూర్ణ మధ్యనిషేదం, సీపీఎస్ రద్దు, జాబ్ కేలండర్, 45 ఏళ్లకే మహిళలకు పింఛన్, ధరల స్థిరీకరణ నిధి, ఉచిత ఇసుక, చంద్రబాబు కంటే మెరుగైన పీఆర్సీ ఇస్తానన్న అనేక హామీలు అమలు చేయలేదన్నారు.
ప్రభుత్వ అధికారులను భయపెట్టి లోబరుకోవడం ఎనిదవ మోసంగా సయ్యద్ రఫీ పేర్కొన్నారు.

‘ఇప్పటికే వాలంటీర్లను ప్రలోభపెట్టి అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి డబ్బులు ఇచ్చామంటూ ఫాంప్లేట్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నాడు. చివరిగా బూటకపు సామాజిక న్యాయంపై ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ.. తొమ్మిదవ మోసానికి ఒడిగట్టాడని చెప్పారు. ఇలా నవ మోసాలతో రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి గెలవాలని చూస్తున్నారని.. జగన్ రెడ్డి అనే పెద్దమనిషికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు డీజీపీ, డీఐజీ, ఏజీ, ఏఏజీ ఇలా మొత్తం పోలీసు వ్యవస్థనే రెడ్లతో నింపేశారు. చిలకలూరిపేటలో ప్రధానమంత్రి సభను వైఫల్యం చెందించాలని ముగ్గురు రెడ్డి కులానికి చెందిన ఐపీఎస్‌లతో జగన్ రెడ్డి కుట్ర పన్నాడు. 900 వందలకు పైగా నిధులు, అధికారాలు ఉన్న నామినేటెడ్ పదవులు రెడ్లకు ఇచ్చుకుని పనికిరాని వాటిని బీసీలకు ఇచ్చాడన్నారు.

రాష్ట్రంలో 4 శాతం ఉన్న రెడ్లకు 49 సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి 45 నుంచి 50 శాతం ఉన్న బీసీలకు మాత్రం 48 సీట్లు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటాడు. ఈ తొమ్మిది మోసాలే కాక జగన్ రెడ్డి చేసిన, చేస్తున్న అనేక మోసాలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలుసుకునే జగన్ మోహన్ రెడ్డి రెండు, మూడు కి.మీ దూరంకు కూడా హెలీకాప్టర్‌లోనే ప్రయాణిస్తున్నాడు.

గర్భంతో ఉన్న మహిళలు ప్రయాణం చేస్తే..అబార్షన్ అయిపోయే దారుణాతి దారుణ పరిస్థితుల ఏపీ రోడ్లపై కనిపిస్తున్నాయి. బస్సులు, లారీలు, ఆటోలు చక్రాలు విరిగి మనుషులు చనిపోతున్నారు. జగన్ రెడ్డి రోడ్లపై ప్రయాణిస్తుంటే పరధాలు దర్శనమిస్తాయి. ఆయన ఆకాశంలో హెలీకాప్టర్ ప్రయాణిస్తుంటే క్రింద రోడ్లపై ట్రాపిక్ నిలిపేసే వింత పోకడలు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు.

ఈ నెల 27 వ తారీఖున మనమంతా సిద్దం అంటూ చేయబోతున్న బస్సు యాత్రలో ఏం చెబుతావు జగన్ రెడ్డి? సంపూర్ణ మధ్య నిషేదం చేస్తేనే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ రెడ్డి ఏ మొఖం పెట్టుకుని జనం వద్దకు వచ్చి ఓట్లు అడుగుతాడు? జగన్ రెడ్డి బస్సు యాత్ర చేపడితే..ఆయన పాదయాత్రలో ఇచ్చిన 750 హామీల అమలుపై మడమ త్రిప్పిన ఊర్లలోనే జగన్ రెడ్డిని నిలదీస్తాం.

జగన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన రూ.8 లక్షల కోట్లు వెదజల్లి ఏదో ఒక రకంగా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు. జగన్ రెడ్డిలా తెలంగాణలో కేసీఆర్ సైతం గెలవాలని ప్రయత్నించి చతికిలపడ్డాడు. జగన్ రెడ్డి ప్రజలకు నవమోసాలు చేసినా, తొమ్మిది వందల మోసాలు చేసినా గెలిచే పరిస్థితి లేదు. తెలుగు ప్రజలకు పౌరుషం ఎక్కువ. ఇప్పటికే ఒకసారి మోసపోయామని బాధతో ఉన్నారు. వారు జగన్ రెడ్డిని ఎప్పుడు ఓడిద్దామా అని ఎదురు చూస్తున్నారు.

ఎన్నికల షెడ్యూల్ వచ్చేసిందని పాత తేదీలతో భూమి పత్రాలు సృష్టించి వేల ఎకరాల భూములు దోచుకుంటున్నారు. జగన్ రెడ్డికి ఓడిపోతామని తెలిసి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. సొంత చెల్లెళ్లే జగనన్నను ప్రజలు ఓడించాలంటూ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు.

సొంత బాబాయినే చంపించిన జగన్ రెడ్డిని ప్రజలు నమ్మేందుకు సిధ్ధంగా లేరు. జగన్ రెడ్డి మోసం, అవినీతి, దుర్మార్గాలు, దౌర్జన్యాలను, దోపిడీలు చూసిన జనం జగన్ రెడ్డిని ఓడించడానికి ఎన్నికల తేది మే-13 కోసం ఎదురుచూస్తున్నారు. జగన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం.

LEAVE A RESPONSE