అమరావతిలో దొంగతనాలు సిగ్గుచేటు

– ఎంపీ నందిగం అనుచరులు మట్టి , కంకర దోచుకుంటున్నారు
-టీడీపీ మహిళా నాయకురాలు పాలడుగు వినీల

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీ జీవనాడి పోలవరాన్ని నాశనం చేశాడు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని ప్రశ్నార్థం చేశాడు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని చంపేశారు. రాజధానిపై పగబట్టి ఆనవాళ్లు చెరిపేశారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా అమరావతిలో దొంగతనాలు జరుగుతున్నాయి. అమరావతిలో అరాచకాలను చూస్తూ జగన్ పాలన ఎలా ఉందో తెలుసుకోవచ్చు.

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కనుసన్నల్లో మట్టి, కంకర తవ్వేస్తున్నారు. సరస్వతి పవర్ ప్రాజెక్టుకు యుద్ధ ప్రాతిపదికన అనుమతులు తెచ్చుకున్నరే కానీ అమరావతిని పట్టించుకున్నారా? హైకోర్టుకు వెళ్లే మార్గంలో కనీసం రోడ్లు సరిగా వేయలేదు. రాత్రి సమయంలో లైట్లు లేవు. దీనిపై న్యాయవాదులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. తన సొంత పనులు కోసం మాత్రం ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ కేవలం 9 కిలోమీటర్ల దూరానికి ఫైట్లలో వెళుతున్న జగన్ రెడ్డిని ఏమనాలి?

మూడు రాజధానులు తెరపైకి 30 లూటీలు,60 కబ్జాలు చేశారు. ప్రపంచస్థాయిలో ఎక్కడా జరగని విధంగా 53 రోజుల వ్యవధిలో 29 వేల మంది రైతులు 34,600 ఎకరాల భూమి రూపాయి తీసుకోకుండా రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. గతంలో చంద్రబాబు గారు అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ ఫీల్డ్ సిటీగా అమరావతిని నిర్మించాలని నిర్ణయించారు.

కానీ జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే మొత్తం సర్వనాశం చేశారు. రాజధాని అంటే రాష్ట్ర ప్రగతికి చిహ్నంగా నిలవాలని , రాష్ట్ర అభివృద్ధిలో గ్రోత్ ఇంజన్ గా ఉండాలనే ఉద్దేశంతో సింగపూర్ కన్సోడియన్ సంస్థతో ఒప్పందం చేసుకుని 1600 ఎకరాలు వారికి అప్పగించి అంతర్జాతీయ స్థాయి టాప్ 50 లో MNC కంపెనీలను రాజధానిలో నిర్మించేలా ఒప్పందం చేసుకున్నారు.

కొన్ని లక్షలమందికి ఉపాధి దొరికి దానిలో వచ్చే ఆదాయం రాష్ట్రాభివృద్ధి ఉపయోగపడాలని ఆలోచించారు. 130 సంస్థలకు సంబంధించి రూ. 44 వేల కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు కుదుర్చుకుని 2 లక్షలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించేలా ప్రణాళికలు రూపొందించారు. యూస్ లో ఉన్న ఆర్కిటెక్చరల్ డైజస్ట్ మాగ్జైన్ లో భవిష్యత్ లో అత్యాధునిక ప్రమాణాలతో ఉన్న రాజధానుల్లో అమరావతికి టాప్ 10లో స్థానం దక్కింది.

దాదాపు రూ. 10 వేల కోట్ల నిర్మాణ పనులు జరిగాయి. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. అమరావతిలో 2 లక్షల కోట్ల రూపాయిల విలువచేసే 10 వేల ఎకరాల భూమిని భవిష్యత్ లో రాష్ట్ర అభివృద్ధిలో ఉపయోగించుకునేలాగా చంద్రబాబు గారు సిద్ధం చేశారు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చా ఏపీ ప్రజల ఆశలను అడియాశలు చేశాడు. అమరావతిని ధ్వంసం చేశాడు.

రాష్ట్రాన్ని కుల, మత, ప్రాంతాలుగా విభజించాడు. అమరావతి పురుడు పోసుకుంది చంద్రబాబు చేతులమీదగానే. మళ్లీ 2024లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తారు.

Leave a Reply