– మంత్రి అనగాని
అమరావతి: గుంటూరు జైలు వద్ద జగన్ తీరు చూసిన ప్రజలు ఆ 11 సీట్లు మాత్రం ఎందుకు ఇచ్చాం అని బాధపడే పరిస్థితి కనిపించిందని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ అబద్ధంతో జన్మించారు…ఫేక్ తో పెరిగారు…. అసత్యాలతో రాజకీయ జీవితం సాగిస్తున్నరు అనేది ప్రతి రోజూ రుజువు చేసుకుంటున్నాడరన్నారు. దేశంలో సీఎం గా చేసిన ఎవరూ కూడా ఇంత నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పలేరు. బురద రాజకీయం చేయలేరని అన్నారు.
బుడమేరు ఎక్కడ ఉంది. బుడమేరు డైవర్షన్ కెనాల్ఎక్కడ ఉంది. రెగ్యేలేటర్ ఎక్కడ ఉంది. గండ్లు ఎప్పుడు ఎక్కడ పడ్డాయి.. కృష్ణా నదీ ప్రవాహాలు ఎలా వచ్చాయి అనేది కనీస అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మొన్నంటే తెలీయక ఏదోదే అన్నాడు అనుకోవచ్చు… కానీ మళ్లీ అదే రాగం తీశారు. అంటే….జగన్ ఒక ఫేక్ ను పట్టుకుని దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తె
లుగు దేశం పార్టీ కార్యాలయం పై దాడిని కూడా సమర్థించుకునే నీచమైన వ్యక్తి ఒక మాజీ సీఎం అని చెప్పుకోవడానికి కూడా బాగోలేదని అన్నారు. జనం కష్టాల్లో ఉంటే…జైలుకు వెళ్లి క్రిమినల్ ను పరామర్శించే జగన్ కు తమను ప్రశ్నించే హక్కు లేదన్నారు. పంటలు మునిగి ప్రజలు కష్టాల్లో ఉంటే పంటలు దగ్ధం చేసినే చరిత్ర ఉన్నవారికి వద్దకు వెళ్లడం జగన్ కు మాత్రమే చెల్లిందన్నారు. 6 లక్షల మంది వరదలో చిక్కుకోవడానికి జగన్ చేసిన పాపాలే కారణమని, ముందు దానికి జగన్ ప్రజలను క్షమాపణ కోరాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు.