తల్లి- చెల్లికి నయవంచక ద్రోహం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి

-వాడుకుని వదిలేయడం జనగ్ రెడ్డి నైజం
– ప్రశాంత్ కిషోర్ నమ్మకాన్ని కూడా కోల్పోయిన నీకు విశ్వసనీయత లేదు
– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ :అధికారంలోకి రావడానికి సొంత తల్లిని చెల్లిని పావులా వాడుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజలకు నమ్మకద్రోహం చేశారు.ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన కడప ప్రజల్ని మోసం చేసి కడప స్టీల్ ప్లాంట్ లేదు- అన్నమయ్య డ్యాం బాధితుల్ని నట్టేట ముంచిన వ్యక్తి జగన్ రెడ్డి.విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి రూ.64 వేల కోట్ల రూపాయల విద్యుత్ భారాలు రాష్ట్ర ప్రజలపై మోపారు.

మద్యనిషేధం చేసి ఓట్లు అడుగుతానని నమ్మబలికి మద్యం ఆదాయాన్ని బ్యాంకులకు తాకట్టు పెట్టిన మోసకారి జగన్.ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.1.14 లక్షల కోట్లు దారి మళ్లించారు. 120 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు- 14 లక్షల ఎకరాల అసైన్ మెంట్ భూములు కబ్జా చేశారు. బ్యాక్ లాగ్ పోస్టులు 1.40 లక్షలు భర్తీ చేయకుండా సామాజిక న్యాయం గొంతు కోశారు. చివరకు ప్రశాంత్ కిషోర్ నమ్మకాన్ని కూడా కోల్పోయిన నీకు విశ్వసనీయత లేదు- అందుకే జనం జగన్ రెడ్డి ని నమ్మక ద్రోహి అంటున్నారు.

Leave a Reply