Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి వికృత క్రీడలో సొంత చెల్లి.. బాబాయ్ కూతురు కూడా పావులుగా మారారు

– విచక్షణ… విలువల్లేని జగన్ రెడ్డి వికృతక్రీడలో సొంత చెల్లి.. బాబాయ్ కూతురు కూడా పావులుగా మారారు
• చేతిలో ఉన్న లక్షమంది పేటీఎమ్ సైన్యంతో తర తమ బేధాల్లేకుండా నీతిమాలిన ప్రచారం చేయిస్తున్నాడు
• తన తండ్రి హత్యకేసుపై మాట్లాడిందన్న అక్కసుతో జగన్ రెడ్డి అధీనంలోని వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ సునీతపై దారుణమైన విషప్రచారానికి తెగబడింది
• జగన్ తన పేటీఎమ్ బ్యాచ్ తో సొంత చెల్లిని అసభ్య పదజాలంతో అనరాని మాటలనిపిస్తూ.. తన సైకోయిజాన్ని సంతృప్తిపరుచుకుంటున్నాడు
– టీడీపీ మహిళా నేత సందిరెడ్డి గాయత్రి

చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య రాష్ట్రాన్ని పరిశ్రమలకు, ఉపాధి అవకాశాలకు కేంద్ర బిందువుగా మార్చితే, జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి మార్ఫింగ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి, ఉగ్రవాదులు టెర్రరిస్ట్ శిక్షణా కేంద్రాలు నిర్వహించే దానికంటే దారుణంగా జగన్ రెడ్డి యువతను ప్రలోభాలతో లొంగదీసు కొని వారితో దారుణాతి దారుణమైన.. మాటల్లో వర్ణించలేని ఆకృత్యాలు చేయిస్తు న్నాడని టీడీపీ మహిళానేత సందిరెడ్డి గాయత్రి తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ… జగన్ రెడ్డి తన మార్ఫింగ్ ఇండస్ట్రీ ద్వారా ప్రజలు.. ప్రతిపక్షాలతో పాటు.. ఆఖరికి న్యాయస్థానాల్ని.. న్యాయమూర్తుల్ని కూడా వదలడం లేదని, తానంటే గిట్టని వారు..తనను ప్రశ్నించేవారిని అమ్మనా బూతులు తిట్టించడం.. అసభ్యంగా సదరు వ్యక్తుల ఫోటోలు, వీడియాలు మార్ఫింగ్ చేయడం వంటి నీతిమాలిన చర్య లకు పాల్పడుతున్నాడన్నారు.

జగన్ రెడ్డి అండతో పేట్రేగిపోయి హైకోర్టు న్యాయమూర్తులపై దుష్ర్ర్పచారం చేసిన 100 మంది వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ లో 30 మందిని పోలీసులు 3నెలలు జైల్లో పెడితే, 70 మంది పరారీలో ఉన్నారని, వారిలో ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం ఆదుకున్నది లేదని, సదరు వ్యక్తులు పెట్టిన అసభ్యకర పోస్టింగ్స్.. కామెంట్స్ కు అవసరమైన సమాచారమంతా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచే వచ్చినట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయని గాయత్రి తెలిపారు.

తన వికృత క్రీడకోసం లక్షమందితో ప్రత్యేక సైన్యాన్ని నడుపుతున్న జగన్
జగన్ రెడ్డి అవినీతి..దుర్మార్గపు.. విధ్వంస పాలనకు వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా.. ఎవరు తమ అభిప్రాయం వెలిబుచ్చినా వారిని టార్గెట్ చేసి మరీ జగన్ రెడ్డి సైన్యంగా పిలువబడే వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ నిస్సిగ్గుగా దుష్ప్రచారానికి పాల్పడుతోందన్నారు. ప్రత్యేకంగా ఈ విధంగా వ్యక్తుల్ని.వ్యవస్థల్ని దెబ్బతీయడానికి జగన్ రెడ్డి లక్షమందితో ప్రత్యేక వ్యవస్థనే నడుపుతూ.. వేలకొద్దీ హ్యండిల్స్.. వందలకొద్దీ యూట్యూబ్ ఛానళ్లతో తన వికృత క్రీడను కొనసాగిస్తున్నాడన్నారు.

నా అక్కచెల్లెమ్మలు అంటూ బాబాయ్ కూతుర్ని.సొంతచెల్లిని కూడా తన మార్ఫింగ్ వికృతక్రీడకు బలిచేయడం జగన్ రెడ్డికే సాధ్యమైంది
ఆడబిడ్డలకు అన్నగా అండగా ఉంటానని.. నా అక్కచెల్లెమ్మలు అనే జగన్ రెడ్డి.. చివరకు బాబాయ్ కూతురు సునీతను ఏం చేశాడో చూశామని.. తనతో విబేధించి బయటకు వెళ్లిన సొంత చెల్లి షర్మిలను ఏవిధంగా సోషల్ మీడియాలో బదనాం చేస్తున్నాడో చూస్తూనే ఉన్నామన్నారు.

నిన్న వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రిని చంపిన వారికి శిక్షపడాలని.. హంతకులు మనమధ్య నే తిరుగుతున్నా.. వారికి శిక్షపడటం లేదని తన ఆవేదన వెలిబుచ్చితే, ఆమెపై వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ దారుణమైన ట్రోల్స్ కు పాల్పడుతోందన్నారు. చనిపోయిన బాబాయ్ వైవాహిక జీవితం గురించి.. సునీత వ్యక్తిగత జీవితం గురించి అనరాని మాటలంటూ.. దుష్ప్రచారం చేయించడం.. మహిళలనే కనీస గౌరవం లేకుండా వికృతక్రీడకు పాల్పడటం జగన్ రెడ్డికి.. అతని పేటీఎమ్ సైన్యానికే సాధ్యమైందని గాయత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సునీత వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేక ఇలా తన చేతిలో ఉన్న పేటీఎ మ్ బ్యాచ్ తో జగన్ రెడ్డి విషప్రచారం చేయించడం..తన ఆకృత్యాలను కప్పిపుచ్చుకోవడమేనన్నారు. వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు టీడీపీపై..చంద్రబాబుపై దుష్ప్రచారం చేయిం చిన జగన్ రెడ్డి..నేడు సునీత వ్యాఖ్యల్ని కూడా టీడీపీకే ఆపాదిస్తూ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే దురుద్దేశంతో కొత్త కుట్రలకు పాల్పడుతున్నాడన్నారు. తన ఇంట్లోని వారికే భద్రత లేనప్పుడు, రాష్ట్రంలోని మహిళలకు జగన్ భద్రత కల్పిస్తాడనుకోవడం అత్యాశే అవుతుందన్నారు.

జగన్ రెడ్డిని నమ్మి దుష్ప్రచారానికి పాల్పడుతున్న వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ శిక్షింపబడటం ఖాయం….
జగన్ రెడ్డిని నమ్మి.. వెనకాముందు ఆలోచించకుండా దుష్ప్రచారానికి పాల్పడు తున్న వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ లోని ప్రతి ఒక్కరూ శిక్షింపబడతారని, మూడు ట్రోల్స్.. ఆరు మార్ఫ్ లతో రెచ్చిపోతున్న వారంతా కచ్చితంగా కటకటాల పాలు అవుతారని గాయత్రి హెచ్చరించారు. జగన్ రెడ్డిని నమ్మి.. అతని దుష్ప్రచారం ఘట్టంలో పాలుపంచుకున్న యువతీయువకులందరూ తమ జీవితాలు కోల్పో యినట్టేనని, వారి తల్లిదండ్రులు కూడా వారిని ఛీ కొడతారని ఆమె స్పష్టం చేశారు.

టీడీపీ ప్రభుత్వంలో.. చంద్రబాబు నాయకత్వంలో చేసిన అభివృద్ధిని జగన్ రెడ్డి కళ్లకు కట్టేలా సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో తెలుగుదేశం శ్రేణులు బయటపెట్టాయని, అదే విధంగా తన హాయాంలో చేసిన మంచిని ముఖ్యమంత్రి చెప్పుకోగలడా అని గాయత్రి ప్రశ్నించారు.

చేపలమార్కెట్లు…మటన్ దుకాణాలు … లిక్కర్ షాపుల ముందు తప్ప జగన్ రెడ్డి సెల్ఫీ దిగడానికి ఎక్కడైనా ఒక మంచి ప్రాజెక్ట్ గానీ.. ఒక అభివృద్ధి చిహ్నంగానీ ఉందా అని గాయత్రి ఎద్దేవా చేశారు. సింహాన్ని.. సింగిల్ గా వస్తాను అంటున్న జగన్ రెడ్డి లక్షమంది వైసీపీ ఫేక్ బ్యాచ్ ను ఎందుకు నమ్ముకున్నాడో సమాధానం చెప్పాలన్నారు. టీడీపీతో పాటు జనసేన పార్టీని.. పవన్ కల్యాణ్ ను కూడా వదలకుండా తన ఫేక్ బ్యాచ్ తో జగన్ రెడ్డి నీతిమాలిన.. నికృష్టమైన దుష్ప్రచారం చేయిస్తున్నాడన్నారు.

ఆఖరికి తన ప్రచార పిచ్చికోసం జగన్ రెడ్డి ఒక పాఠశాల బాలిక జీవితాన్ని అవహేళన చేశాడని, తనసభలో ఆ బాలికతో ఇంగ్లీష్ లో పొగిడించుకున్న జగన్ రెడ్డి నిర్వాకం.. చిన్నారి మాటల్లోనే బహిర్గతమైందన్నారు. సదరు బాలిక పాఠశాల యాజమాన్యం బెదిరిస్తేనే తనకు ఇష్టంలేకపోయినా అలా చేశానని చెప్పింద న్నారు.

ఇలా చిన్నారుల్ని కూడా తన ప్రచారపిచ్చికి బలితీసుకునే సైకో భావజాలం జగన్ రెడ్డికే సాధ్యమైందని, తన చెల్లిని… బాబాయ్ కూతు ర్నే వదలని వ్యక్తి బయటి మహిళల్ని..చిన్నారుల్ని మాత్రం ఉపేక్షిస్తాడా అని గాయత్రి ప్రశ్నించారు.

LEAVE A RESPONSE