Suryaa.co.in

Andhra Pradesh

ఏపీపీఎస్సీ కుంభకోణంలో జగన్-సజ్జల డైరక్షన్.. సవాంగ్-పీఎస్సార్ యాక్షన్

– సవాంగ్, పీఎస్సార్ కనుసన్నలలోనే కుంభకోణం
– జగన్ మాఫియా చివరకు గ్రూప్ 1 ఉద్యోగాల్లో సైతం అక్రమాలకు పాల్పడ్డారు
• గ్రూప్ 1 ఉద్యోగాలు బహిరంగ మార్కెట్ లో అమ్ముకుని హీనపక్షంగా రూ. 150 కోట్ల అవినీతికి పాల్పడ్డారు
• ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టు రూ. 2.50 కోట్లకు, డీఎస్పీ పోస్టును రూ. 1.50 కోట్లకు అమ్ముకున్నారు
• ఈ కుంభకోణం అంతా సీఎం జగన్, సజ్జల డైరక్షన్ లో ఇంటిలిజెన్స్ డీజీ (నాటి ఏపీపీఎస్సీ సెక్రటరీ) సీతారామాంజనేయులు, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కనుసన్నల్లో జరిగింది
• యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారికి దక్కాల్సిన ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్ లో తెగనమ్ముకుంటారా?
• గ్రూప్ -1 నియామకాలలో భారీ అవకతవకలను ధృవీకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ ఏం సమాధానం చెబుతారు?
• మాన్యువల్ మూల్యాంకనం చేయాలని ఎగ్జామ్ నోటిఫికేషన్ లో స్పష్టంగా ఉన్నా నాటి ఏపీపీఎస్సీ సెక్రటరీ సీతారామాంజనేయులు డిజిటల్ మూల్యాంకనం ఎందుకు చేయించారు?
• ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ సారధ్యంలో బరితెగించి రెండు సార్లు హైకోర్టుకు ఎందుకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు?
• మద్యప్రదేశ్ లో జరిగిన వ్యాపమ్ స్కామ్ కంటే, తెలంగాణలో జరిగిన టీఎస్.పీ.ఎస్సీ కుంభకోణం కంటే ఇది అతి పెద్ద భారీ కుంభకోణం
• ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపై విచారణ జరిపిస్తాం
• ఈ స్కాంలో ఎంతటి వారున్నా వదలిపెట్టం
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం

ఐదేళ్లలో జగన్ మాఫియా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ లో లక్షాలాది కోట్లు దోచుకున్నారని, అవి చాలవన్నట్టు చివరకు గ్రూప్-1 ఉద్యోగాల్ని సైతం బహిరంగా మార్కెట్ లో అమ్ముకుని రూ. 150 కోట్ల అవినీతికి పాల్పడ్డారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ద్వజమెత్తారు.

గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….. గత ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారికి దక్కాల్సిన ఉద్యోగాల్ని సైతం బహిరంగ వేలం పెట్టి అమ్ముకోవటం దుర్మార్గం. టీడీపీ ప్రభుత్వం 31.12.20218 గ్రూప్ 1 కు సంబందించి 169 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు.

ఒక్కో డిప్యూటీ కలెక్టర్ పోస్టు రూ. 2.50 కోట్లకు, డీఎస్పీ పోస్టును రూ. 1.50 కోట్లకు అమ్ముకున్నారు. ఈ కుంభకోణం అంతా సీఎం జగన్, సజ్జల డైరక్షన్ లో ఇంటిలిజెన్స్ డీజీ (నాటి ఏపీపీఎస్సీ సెక్రటరీ) సీతారామాంజనేయులు, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కనుసన్నల్లో జరిగింది.

యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారికి దక్కాల్సిన ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్ లో తెగనమ్ముకుంటారా?
యువత ఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్ వారికి ఉద్యోగాలు లేకుండా చేయటమేకాక వారికి దక్కాల్సిన ఉద్యోగాల్ని మార్కెట్ లో తెగనమ్ముకున్నారు. టీడీపీ ప్రభుత్వం 31.12.20218న గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దురదుష్టవశాత్తు ఎన్నికల అనంతరం జగన్ ముఖ్యమంత్రాయ్యారు. తర్వాత నిర్వహించిన ప్రిలిమ్స్,మెయిన్స్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. 169 పోస్టులు తెగనమ్ముకుని రూ. 150 కోట్లు దండుకున్నారు. దాదాపు 9 వేల మంది మెయిన్స్ కి అర్హ త సాధించారు. వీరంతా తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ జగన్ రెడ్డి వాటిని బహిరంగ మార్కెట్ లో తెగనమ్ముకుని పేద బిడ్డలకు అన్యాయం చేశారు.

హైకోర్టు తీర్పుపై జగన్ ఏం సమాధానం చెబుతారు?
గ్రూప్ -1 ఉద్యోగాల పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీ అనేక అవకతవకలకు పాల్పండిదని నిన్న జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పు ఇచ్చారు. మెయిన్స్ ఎగ్జామ్ జవాబు పత్రాలను 3 సార్లు వాల్యూయేషన్ (ఒకసారి డిజిటల్, రెండు సార్లు మాన్యువల్ ) చేసి వారికి కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారు. ఈ విషయం హైకోర్టు చెప్పింది. ఏపీపీఎస్సీ రూల్ 3(9) ప్రకారం 3 సార్లు వాల్యూయేషన్ చేయటం చట్ట విరుద్దమని గతంలో నియమించిన వారి నియామకాలు చెల్లవని తిరిగి 6 నెలల్లోపు మెయిన్స్ ఎగ్జామ్ నిర్హహించి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది.

దీనికి సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారు? తెలంగాణలో గ్రూప్ 1,2 ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడితే అక్కడ యువత ప్రభుత్వాన్ని కూకటి వేల్లతో పెకలించివేశారు. రేపు జగన్ పరిస్ధితి అదే. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, పరిశ్రమలు తీసుకురాకుండా ఉన్న ఉద్యోగాల్ని జగన్ రెడ్డి తెగనమ్మకుంటున్నారు. పోస్టుకొక రేటు కట్టి యువత జీవితాలతో ఆడుకున్నారు.

మాన్యువల్ మూల్యాంకనం చేయాలని నోటిఫికేషన్ లో స్పష్టంగా ఉన్నా…డిజిటల్ మూల్యాంకనం ఎందుకు చేయించారు సీతారామాజంనేయులు గారూ?
డిసెంబర్ 31.2018న నాటి చంద్రబాబు ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ లో పేరా. నెం. 1.5 లో మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలు మాన్యువల్ (కన్వెన్షనల్) విధానంలో దిద్దాలని స్పష్టంగా ఉంది. కానీ తాడేపల్లి ప్యాలెస్ ఈ ఉద్యోగాల్లో డబ్బులు దండుకునేందుకు ప్లాన్ రూపొందించింది.

టీడీపీ హయాంలో మంచి ట్రాక్ రికార్ట్ ఉన్న వ్యక్తి, రిటైర్డ్ ప్రొ. పి.ఉదయ్ భాస్కర్ ని ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమిస్తే..జగన్ రెడ్డి ఆయన్ని డమ్మీగా మార్చి పి.ఎస్.ఆర్ ఆంజనేయులు కి ఏపీపీఎస్సీ సెక్రటరీగా నియమించి ఈ కుంభకోణానికి తెరలేపారు. మాన్యువల్ వాల్యుయేషన్ విధానం పక్కన పెట్టి డిజిటల్ వాల్యూయేషన్ చేసి తమకు నచ్చిన వారిని ఎంపిక చేశారు. దీనిపై అనేక మంది అభ్యర్దులు కోర్టుకెళ్లారు. నోటిఫికేషన్ కి విరుద్దంగా డిజిటల్ వాల్యుయేషన్ చేయటం చట్ట విరుద్దమని మాన్యువల్ వాల్యుయేషన్ చేయాలని 2021 అక్బోబర్ 1న హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పుకు లోబడి ఆనాటి ఏపీపీఎస్సీ సెక్రటరీ సీతారామాంజనేయులు డిసెంబర్ 2021 నుంచి పిబ్రవరి 14 -2022 మద్య సీతారామాంజనేయులు డైరక్షన్ లో మాన్యువల్ వాల్యూయేషన్ జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 24- 2022న గౌతమ్ సవాంగ్ చైర్మన్ గా నియమితులయ్యాక మొత్తం సీతారామాంజనేయులు దోచుకుంటే నా పరిస్థితి ఏంటని, మరలా మాన్యువల్ వాల్యూయేషన్ చేసి మరో లిస్ట్ తయారు చేశారు. అంటే వాళ్ల ధన దాహం కోసం ఒక జవాబు పత్రాన్ని 3 సార్లు వాల్యుయేషన్ (ఒకసారి డిజిటల్ వాల్యుయేషన్ రెండు సార్లు మాన్యువల్ వాల్యూయేషన్) చేసి మన బిడ్డల జీవితాల్ని నాశనం చేశారు.

ఒక్కసారే మాన్యువల్ వాల్యూయేషన్ చేశారనేది పచ్చి అబద్దం కాదా గౌతమ్ సవాంగ్ గారూ?
మాన్యువల్ వాల్యుయేషన్ ఒక్కసారి (మార్చి 2022)లో మాత్రమే చేశామని డిసెంబర్ 21 నుంచి పిబ్రవరి 2022 మద్య ఎలాంటి వాల్యుయేషన్ చేయలేదని ఏపీపీఎస్సీ హైకోర్టుకు రెండు సార్లు తప్పుడు అఫడవిట్ ఇచ్చారు. సీతారామాంజనేయులు ఏపీపీఎస్సీకి సెక్రటరీగా ఉన్నపుడు హాయ్ ల్యాండ్ రిసార్ట్ లో ఒకసారి మాన్యువల్ వాల్యూయేషన్ చేయించారా లేదా? ఆ ఫలితాలు విడుదల చేయకుండా మరలా గౌతమ్ సవాంగ్ మాన్యువల్ విధానంలో పేపర్లు ఎందుకు దిద్దించారు? పంపకాల్లో తేడావచ్చిందనా? దీనికి సమాధానం చెప్పాలి.

మొదటి సారి సీతారామాంజనేయులు మాన్యువల్ వాల్యుయేషన్ చేయించలేదన్నది పచ్చి అబద్దం. గ్రూప్ 1 కి మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ ప్రారంభిస్తున్నామని, అందుకు సంబందించిన కంట్రోల్ బండిల్ స్లిప్స్ ని మాకు సప్లై చేయండని డేటాటెక్ మెధడెక్స్ కి 2021 నవంబర్ 25న సీతారామాంజనేయులు లేఖ రాయటం వాస్తవం కాదా? వాళ్లు సప్లై చేసిన కంట్రోల్ బండిల్ స్లిప్స్ కి పేమెంట్స్ కి ప్రొసీడింగ్స్ కు (29.12.2021) ఇచ్చారు. జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూంకి తరలించాలని అందుకు తగిన పోలీసు భద్రత కావాలని నాటి గుంటూరు ఎస్పీకి 03.12.2021 సీతారామాంజనేయులు లేఖ రాయటం నిజంకాదా?

అసలు మాన్యువల్ వాల్యుయేషన్ జరగకపోతే సీతారామాంజనేయులు ఈ లేఖలు ఎందుకు రాశారు? హాయ్ ల్యాండ్ లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన అధికారులకు రూమ్స్ కి, లంచ్, బ్రేక్ పాస్ట్ వీటంన్నిటీ హాయ్ ల్యాండ్ (ఆవాస) రిసార్ట్ కి రూ. 20 లక్షలు చెల్లించటం నిజం కాదా? స్ట్రాంగ్ రూం వద్ద భధ్రతకు కర్నూలు నుంచి 32 మంది కానిస్టేబుళ్లు 05- డిసెంబర్ నుంచి ఫిబ్రవరి 2022 వరకు పంపిన లిస్ట్ కూడా మా వద్ద ఉంది. ఇవే కాకుండా మేం వాల్యుయేషన్ పూర్తి చేశామని దానికి సంబందించిన పోస్ట్ వాల్యుయేషన్ చేయడానికి రావాలని 2022 పిబ్రవరి 2-న డేటాటెక్ మెదడాలజీకి రామాంజనేయులు లేఖ రాశారు.

సాక్షి పత్రికలో సైతం 2022 ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు అని రాశారు. ఈ లేఖలన్నీ తాను రాయలేదని చెప్పే సాహసం నేటి ఇంటలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు చేయగలరా? పైన పేర్కొన్న ఆధారాలన్నీ విశ్వసించే కోర్టు సీతారామాంజనేయులు సెక్రటరీగా ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ జరిగిందని నిర్ధారణకు వస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ ఆధారాలన్నీ మీడియాకు విడుదల చేస్తున్నాం.

హైకోర్టుకు గౌతమ్ సవాంగ్ ఎందుకు తప్పుడు అపడవిట్ ఇప్పించారు?
సీతారామాంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఒక సారి మాన్యువల్ వాల్యుయేషన్ చేయిచారు, గౌతమ్ సవాంగ్ చైర్మన్ అయ్యాక మళ్లీ మాన్యువల్ వాల్యుయేషన్ చేశారు. ఇవన్నీ సీఎం జగన్, సజ్జల డైరక్షన్ లోనే జరిగాయి. కానీ సీతారామాంజనేయులు కార్యదర్శిగా ఉన్నపుడు వాల్యుయేషన్ జరగలేదని, కోర్టుకు ఎందుకు రెండు సార్లు తప్పుడు అఫిడవిట్ ఇప్పించారో గౌతమ్ సవాంగ్ సమాధానం చెప్పాలి. రాష్ట్ర డీజీపీగా పనిచేసి ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్నత స్ధానంలో ఉన్న గౌతమ్ సవాంగ్, కోర్టుల్ని తప్పుదారి పట్టించటం క్షమించరాని నేరం. ఏపీపీఎస్సీలో చట్ట విరుద్దంగా అక్రమాలకు పాల్పడి, మన బిడ్డల ఉద్యోగాల్ని తెగనమ్మి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని హైకోర్టు దృవీకరించింది.

గౌతమ్ సవాంగ్ సారధ్యంలో ఏపీపీఎస్సీ డిప్యూటీ సెక్రటరీ సీ.వీ రమణయ్య కోర్టును మాన్యువల్ వాల్యూయేషన్ విషయంలో కోర్టును తప్పుదారి పట్టించేలా రెండు సార్లు అఫిడవిట్ దాఖలు చేయటం జరిగింది. ఆయన సమర్పించిన మొదటి అఫడవిట్ పేరా 4 (I) లో “There is no earlier manual evaluation as alleged by the petitioners between December, 2021 and January 2022. Only one manual evaluation was done” అని సీతారామాంజనేయులు ఏపీపీఎస్సీ సెక్రటరీగా నిర్వహించిన మొదటి మాన్యువల్ వాల్యుయేషన్ ను పూర్తిగా తొక్కి పెడుతూ కోర్టును తప్పుదారి పట్టించారు.

ఇది కాక మరలా రెండవసారి జవవరి 2023 మరొక అఫడవిట్ హైకోర్టులో దాఖలు చేసి మరలా అదే అబద్దాన్ని వల్లె వేశారు. “It is respectfully submitted that this Respondent conducted the evaluation manually as directed by this Hon’ble court from 25th March, 2022 in a very scientific, careful, and in an efficient manner. The whole process was under CCTV surveillance and it was recorded. More than 150 evaluators / examiners were involved in the said process. Really if any earlier manual evaluation took place as alleged by the Petitioners it is not as if this respondent can hide such an exercise of such magnitude”అని తాము ఒక్కసారి మాత్రమే మాన్యువల్ వాల్యూయేషన్ చేశామని రెండవ అఫడవిట్ ద్వారా కూడా కోర్టును దగా చేశారు. దీనికి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ సమాధానం చెప్పాలి. ఒక ఐపియస్ అధికారిగా మాజీ డీజీగా ఇంతగా దిగజారి కోర్టులను కూడా మోసగిస్తారా?

ఈ విధంగా 5 ఏళ్లలో జగన్ కనుసన్నల్లో ఉన్నత స్ధాయి అధికారులు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో, సీఎంవోకు ఎన్ని కోట్లు చేరవేశారో, వీళ్లు ఎన్ని కోట్లు తిన్నారో రాష్ట్ర ప్రజలు గమనించాలి. మద్యప్రదేశ్ లో జరిగిన వ్యాపమ్ స్కామ్ కంటే, తెలంగాణలో జరిగిన టీఎస్.పీ.ఎస్సీ కుంభకోణం కంటే ఇది అతి పెద్ద భారీ కుంభకోణం, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపై విచారణ జరిపిస్తాం.

దీనిలో సీఎం, గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులు వంటి వారు ఎవరున్నా వదలం. బాధ్యులైన వారిని కటకటాల పాలు చేసి మన బిడ్డలకు న్యాయం చేస్తాం. జగన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీచేయకపోగా ఉన్న ఉద్యోగాల్ని ఎలా తెగనమ్ముకుని రూ. 150 కోట్లు దోచుకున్నారనేదానికి గ్రూప్ 1 స్కామే పెద్ద ఉదాహరణ అని కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు.

LEAVE A RESPONSE