కోట్లాది హిందువుల మనోభావాలను జగన్ గౌరవించాల్సిందే!

-టిడిపి రాష్ట్ర వాణిజ్యవిభాగం అధ్యక్షుడు డూండీ రాకేష్

అన్నికులాలు, మతాలను సమదృష్టితో చూడాల్సిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నుండే హిందూ సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం. జగన్ వ్యక్తిగతంగా ఏ మతాన్ని విశ్వసించినా ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే కోట్లాది హిందూప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఆయన అప్రమత్తంగా, సున్నితంగా వ్యవహరించాల్సి ఉంది. ముఖ్యమంత్రి అన్యమతస్తుడైనందున ఆయన బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలంటే ఎప్పటినుంచో తిరుమలలో ఉన్న ఆచార, సాంప్రదాయాలను గౌరవించాల్సి ఉంది.

ముందుగా జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమల వెళ్లాలి. భార్యాసమేతంగా మాత్రమే ఉత్సవాలకు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉంది. వీటిని తుంగలో తొక్కిన జగన్ కోట్లాదిమంది హిందూప్రజల మనోభావాలను కాలరాశారు. హిందూ ధర్మంపై తిరుమల పవిత్రతపై జగన్ రెడ్డికి నమ్మకం లేదు. హిందూ మత పవిత్రతను కాపాడేందుకు ఏనాడూ జగన్ శ్రద్ధ చూపలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక గత 40నెలల్లో తిరుమలలో యథేచ్చగా అన్యమత ప్రచారం జరుగుతున్నా అడ్డుకోలేదు.

ఉత్సవాల సమయంలో వెంకటేశ్వర స్వామి గుడిపై అన్యమత చిహ్నాలు ప్రదర్శించారు. హైందవ సంప్రదాయంపై జగన్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదు. దేవాలయాలపై దాడులు జరిగితే ఖండించని వ్యక్తి జగన్ రెడ్డి. హిందూ సంప్రదాయంపై ఏమాత్రం గౌరవం ఉన్నా డిక్లరేషన్ ఇవ్వాలి.డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించాలి. హైందవ సంప్రదాయంపై నమ్మకం ఉంటే జెరుసలేం భార్యతో కలిసి వెళ్లిన జగన్ రెడ్డి ఎందుకు తిరుపతి కి భార్యతో దర్శనానికి వెళ్లడం లేదు? కోట్లాదిమంది మనోభావాలతో కూడిన హిందూ సాంప్రదాయాలను పాటించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి విజ్జప్తి చేస్తున్నాను.

Leave a Reply