ఆ ప్రాంతానికి అన్యాయం చేసిన జగన్, ఈ ప్రాంతాలను ఉద్ధరిస్తాడా?

– అప్పులుచేయడంలో చూపుతున్న ఆసక్తి, సాగునీటిప్రాజెక్ట్ లు పూర్తిచేయడంలో చూపితే బాగుంటుంది
– రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్ట్ ల్ని అటకెక్కించి, ఆ ప్రాంతానికితీరని అన్యాయంచేసిన జగన్ రెడ్డి, ఉత్తరాంధ్ర, కోస్తాప్రాంతాలను ఉద్ధరిస్తాడా?
– తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, కాల్వ శ్రీనివాసులు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక రాయలసీమ అభివృద్ధి స్తంభించిందని, సాగుతాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణం, నిర్వహణ పడకేసిందని, ఆయనపూర్తిచేస్తానన్న ప్రాజెక్ట్ ల పనులు మూడేళ్లలో మూడుశాతంకూడా పూర్తికాలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నెల్లూరుజిల్లాసహా, రాయలసీమ అభివృద్ధి పూర్తిగా స్తంభించింది. సాగు, తాగునీటిప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణం పడకేశాయి. రాయలసీమకు ఏదో చేస్తానంటూ ఆప్రాంత వాసుల్ని రెచ్చగొడుతూ, వైసీపీనేతలు వితండవాదం తెరపైకి తెస్తున్నారు. సొంతజిల్లాకు నీరివ్వలేని జగన్ రెడ్డి, రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడంటే ఎవరునమ్ముతారు? సీమలోని4 జిల్లాలు, నెల్లూరుజిల్లాలోని సాగునీటిప్రాజెక్ట్ లకు చంద్రబాబుగారి హయాంలో రూ.10,747.46కోట్లు ఖర్చుపెడితే, జగన్ రెడ్డి ఈ మూడున్నరేళ్లలో కేవలం రూ.2,737.42 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టాడు.

శతాబ్దాలుగా కరువుపీడనలో ఉన్న రాయలసీమసమస్యకు పరిష్కారం చూపింది స్వర్గీయ ఎన్టీఆర్. ఆయన ప్రారంభించిన హంద్రీనీవా, గాలేరునగరి ప్రాజెక్ట్ ల పనుల్లో ఈ మూడేళ్లనుంచి ఇసుమంత పురోగతిలేదు. టీడీపీప్రభుత్వం అధికారంలోఉన్న ఐదేళ్లలో హంద్రీనీవా ప్రాజెక్ట్ కి రూ.5,738కోట్లు ఖర్చుపెడితే, జగన్ రెడ్డి కేవలం రూ.504కోట్లు మాత్రమే వెచ్చించాడు. ఆ సొమ్ముకూడా అడ్మినిస్ట్రేషన్ ఖర్చు, పాతబిల్లులు చెల్లింపులకే పెట్టారు.

హంద్రీనీవా ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 10వేలక్యూసెక్కులకు పెంచుతానని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి, ప్రాజెక్ట్ తొలిదశ పనులు జూన్ 2020నాటికి, రెండోదశ జూన్ 2021కి పూర్తిచేస్తానని చెప్పాడు. కానీ నేటికి వాటికి అతీగతిలేదు. ఉరవకొండ నియోజకవర్గంలోని కమ్యూనిటీ లిఫ్ట్ కమ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను జూన్ 2020 కి పూర్తిచేస్తానన్న జగన్ రెడ్డి మాటలకు 2023 వస్తున్నా అతీగతీ లేదు.

గాలేరునగరి ప్రాజెక్ట్ కి టీడీపీప్రభుత్వం రూ.2394కోట్లు ఖర్చుపెడితే, జగన్ వచ్చాక కేవలం రూ.758కోట్లుమాత్రమే ఖర్చుచేశాడు. టీడీపీహాయాంలో జరిగినపనులు ఎక్కడివక్కడే నిలిపేసిన జగన్ రెడ్డి, హంద్రీనీవా, గాలేరునగరి పూర్తిచేయని జగన్ రెడ్డి రాయలసీమకు ఏంచేస్తాడోచెప్పాలి?అప్పులు, దోపిడీ చేయడంలోచూపుతున్న శక్తిసామర్థ్యాలను, ప్రాజెక్ట్ లు పూర్తిచేయడంలోముఖ్యమంత్రి ఎందుకుచూపడంలేదు?

చంద్రబాబు హాయాంలో మొదలైన పేరూరు, భైరవానితిప్ప ప్రాజెక్ట్ లపనులు కూడా జగన్ రెడ్డి అంగుళంకూడా కొనసాగించలేదు. రాజశేఖర్ రెడ్డేమో గతంలో కృష్ణాజలాలఆధారంగా నిర్మాణంలోఉన్న తెలంగాణ ప్రాజెక్ట్ ల నుంచి నీటిహక్కు కోరబోనని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు లేఖరాసి, సీమప్రాజెక్ట్ లకు మరణశాసనం రాశాడు.

జగన్ రెడ్డేమో నేడు సీమలోని సాగు, తాగుప్రాజెక్ట్ లను పండబెట్టి, ఆప్రాంత వాసుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. రాయలసీమ దుర్భిక్షనివారణ పథకంకింద రూ.43వేలకోట్లు ఖర్చుపెడతానని డబ్బాలుకొట్టిన జగన్ రెడ్డి, ఈ మూడున్నరేళ్లలో రూ.4వేలకోట్లు కూడా ఖర్చుపెట్టలేదు. రాయలసీమ ప్రాజెక్ట్ లను పూర్తిచేయకపోతే, ఆప్రాంత వాసులు ఎలా బతుకుతారో ముఖ్యమంత్రి చెప్పాలి.గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏర్పాటు చేస్తానంటున్న జేఏసీ ఎక్కడ గడ్డిపీకడానికి పనికొస్తుంది? జగన్ పాలనలో అటుఉత్తరాంధ్రలో, ఇటు రాయలసీమలో కొందరు కుహానారాజకీయనేతలు, తమస్వార్థంకోసం జేఏసీలు ఏర్పాటుచేస్తున్నారు.

రాయలసీమలోని బడుగు, బలహీనవర్గాలప్రజలు ఉపాధిలేక, పొట్టకూటికోసం పక్కరాష్ట్రాలకు వలసపోతున్నారు. జగన్ రెడ్డి, సీమప్రాంత వైసీపీ నేతల ఆస్తులు అధికంగా బెంగుళూరు, చెన్నైలోనే ఉన్నాయి. వారికి సీమప్రయోజనాలకంటే పొరుగురాష్ట్రాలతో అంటకాగడం, వేలకోట్లు వెనకేసుకోవడమే ముఖ్యం.

సీమప్రాంత వైసీపీనేతలు, ముఖ్యమంత్రి ముమ్మాటికీ రాయలసీమ ద్రోహులే. దశాబ్దాల నుంచి సీమవెనుకబాటుకి గురికావడానికి కారణం జగన్ రెడ్డి, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డే. దుర్మార్గులబారినుంచి, పాపాత్ములచెరనుంచి సీమను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆప్రాంత ప్రజలపైనే ఉంది.
రాయలసీమ బాధను, అక్కడిప్రజలసమస్యలను పరిష్కరించలేని వారిని తరిమికొట్టాల్సిన సమయంవచ్చింది. సీమ మేలుకోరే మేథావులు, ప్రజాసంఘాల భాగస్వామ్యంతో జగన్ రెడ్డి రాయలసీమకు చేస్తున్న అన్యాయాన్ని తిప్పికొడతాం అని కాల్వ స్పష్టంచేశారు.

Leave a Reply