Suryaa.co.in

Andhra Pradesh

98.44 శాతం అమలు చేసిన జగన్‌..!

●కాదని మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి తీసేసిన చంద్రబాబు ఎలా గెలుస్తారు
●ఓ వర్గం మీడియాను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నారు..!
●చంద్రబాబు మాటలకు ప్రజలు మోసపోకండి..!
●లక్ష్యం ఉన్న ప్రకాష్‌రెడ్డిని మరోమారు అత్యధిక మెజార్టీతో గెలిపించండి..!
●వైఎస్‌ఆర్‌సిపి రీజనల్‌ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు..!

ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసిన జగన్‌మోహన్‌రెడ్డిని కాదని 2014 ఎన్నికల్లో 600 హామీలు, వంద పేజీల మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను వెబ్‌సైట్‌లో లేకుండా చేసిన చంద్రబాబు ఎలా గెలుస్తారని వెఎస్‌ఆర్‌సిపి రీజనల్‌ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం అనంతపురం రూరల్‌ మండలం పాపంపేట పంచాయతీలోని రజాక్‌ పంక్షన్‌ హాలులో పార్టీ రాప్తాడు నియోజకవర్ద విస్త్రతస్థాయి సమావేశం జరిగింది.

జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు ఒక వర్గం మీడియాను అడ్డుపెట్టుకుని అసత్యాలు రాయిస్తూ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. చంద్రబాబు మాటలు విని ఎవరూ మోసపోవద్దు. రాష్ట్రంలోనే రాప్తాడు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దౌర్జన్యకాండ తరిమి ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉండేందుకు ఎమ్మెల్యే శాయశక్తులా కృషి చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో హత్యలతో భర్తలు కోల్పోయిన వారికి తాను, ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి ఇద్దరూ సీఎంతో చర్చించి రాజకీయంగా గుర్తింపునిచ్చే పదవులు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటాం. మన కార్యకర్తలపై అక్రమంగా బనాయించిన రౌడీషీట్లను ఎత్తివేసేందుకు కృషి చేస్తా.

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఒక లక్ష్యం ఉన్న వ్యక్తి. తిరుపతి, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించాం. అన్నిచోట్ల సీఎం ఆశించినకంటే కూడా ఎక్కువ మెజార్టీ వచ్చేలా కృషి చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో గతంలో అనేక అక్రమాలు, దౌర్జన్యాలు జరిగాయి. ప్రకాష్‌రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరులు మేమున్నామంటూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. మరోమారు ప్రకాష్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.

మంత్రి ఉషశ్రీచరణ్, హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్, పుట్టపర్తి జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో అరాచక పాలనకు చరమగీతం పాడిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని మరోమారు అత్యధిక మెజార్టీతో గెలించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో చిత్తూరు ఎంపి రెడ్డెప్ప, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

● ఆ కుటుంబాల త్యాగాలను గుర్తించి పదవులు ఇవ్వాలి – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
తెలుగుదేశం పార్టీ దౌర్జన్యానికి అనేకమంది జిల్లాలో బలయ్యారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు.. రాప్తాడు నియోజకర్గంలోనూ ఐదుమంది నాయకులను కోల్పోయాం. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం దౌర్జన్యపరులు, పరిటాల కుటుంబం మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిని, తగరకుంట కొండారెడ్డి హత్య చేయించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత శివప్రసాద్‌రెడ్డిని, కందుకూరు శివారెడ్డిని, ఆత్మకూరు కేశవరెడ్డిని హత్య చేయించారు. ఆయా కుటుంబాల త్యాగాలను గుర్తించి మద్దెల చెరువు సూర్యనారాయణరెడ్డి సతీమణి, తగరకుంట కొండారెడ్డి సతీమణి, శివప్రసాద్‌రెడ్డి సతీమణి, శివారెడ్డి సతీమణి, కేశవరెడ్డి సతీమణికి ప్రభుత్వంలో మంచి పదవులు ఇచ్చి గౌరవించాలి. అనేకమంది కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు. రౌడీషీట్లు ఓపెన్‌ చేయించారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదిమందికి మేలు చేద్దామని ఆలోచించలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎలా నిర్మూలించాలి, కార్యకర్తలు బయటకు రాకుండా ఎలా చేయాలి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని రామగిరి మండలంలోకి అడుగుపెట్టకుండా ఎలా చేయాలి అనే దుర్మార్గమైన ఆలోచనఅలతో కాలం గడుపుతూ వచ్చారు. పరిటాల సునిత మంత్రిగా ఉండి నియోజకవర్గానికి ఏమైనా చేసిందా… అంటే చెప్పుకునేకు ఏమీ లేదు. ఆమె హయాంలో అవినీతి రాజ్యమేలింది. కబ్జాలు, భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు చేస్తూ వందల కోట్లు అక్రమంగా సంపాదించుకున్నారు. మన పార్టీకి ఎవరైతే గట్టిగా ఉన్నారో వారందరిపై రౌడీషీట్లు ఓపెన్‌ చేశారు..అవన్నీ తొలిగించేలా చర్యలు తీసుకోవాలి.

●పార్టీ కోసం నిరంతరం సేవకులుగా పని చేస్తాం – తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి
తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బలైమన వారిని హత్యలు చేసి, వారిని బూర్జువా రాజనీయ నాయకులుగా, ప్రజాద్రోహులుగా చిత్రీకరించిన గత చరిత్రను ఈ ప్రాంత వాసులు మరిచిపోలేరు. పార్టీ కోసం నిరంతరం సేవకులుగా పని చేస్తాం. మన ఆశయం దుర్మార్గులను పారదోలడమే. పోటీ అంటే ప్రజా సేవ చేసే విషయంలో ఉండాలి. అంతేకాని అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. మనలో మనకే విభేదాలు సృష్టించేలా మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు. జగన్మోహన్‌రెడ్డి విధానాన్ని ఆచరించాలి. అహంకారానికి పోవద్దండి. జగనన్న పాలనలో రాజనీతి ఉంది. నియోజకవర్గంలో దుర్మార్గులను వ్యతిరేకించేందుకు ఒక కార్యకర్తగా సమిధలయ్యేందుకు కూడా సిద్దం. ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్మార్గులను వ్యతిరేకించే విషయంలో రాజీయపడం. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, యూత్ కన్వీనర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

LEAVE A RESPONSE