Suryaa.co.in

Andhra Pradesh

రేపో, ఎళ్లుండో ఏ జైలుకో జగన్ వెళ్లకు తప్పదు!

• పొట్టేలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావు?
• ప్రజల ఇచ్చిన తీర్పుతో మతిభ్రమించి ప్యాలెస్ లో టీవీలు పగలగొట్టుకుంటూ పిచ్చిగా మాట్లాడతావా?
• ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తావా?
• కూటమి ప్రభుత్వం రాక ముందు జరిగిన సంఘటనకు ప్రభుత్వానికి సంబంధం ఏంటి?
• నీ పర్యటనలో ఇద్దరు మీవాళ్లే చనిపోతే కనీసం పరామర్శించాడనికి కూడా వెళ్లలేదే? నువ్వా మాట్లాడేది
• ఇకనైనా జగన్ రెడ్డి తన కపట నాటకాలకు కట్టి పెట్టాలి
• ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు కాబట్టే జగన్ కు స్వచ్ఛ ఉంది
• దీన్ని అలుసుగా తీసుకుంటే జగన్ రెడ్డి రోడ్డెక్కే పరిస్థితి ఉండదు
– రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరిక

మంగళగిరి: ఖబడ్దార్ జగన్ రెడ్డి.. పొట్టేలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావు? రౌడీలు, గుండాలు, గంజాయి బ్యాచ్ లను వెనకేసుకొస్తూ తలలు నరికితే తప్పెందంటావా? ప్రజల ఇచ్చిన తీర్పుతో మతి భ్రమించి ప్యాలెస్ లో టీవీలు పగలగొట్టుకుంటూ పిచ్చిగా మాట్లాడుతావా? ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తావా?

గత ఐదేళ్లు ఒక నియంతలా పరిపాలించి.. నేడు మళ్ళీ అధికారం కోసం కులాలు, మతాలు, ప్రజలు, ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడతావా? అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

అసలు ప్రజా స్వామ్యం గురించి మాట్లాడే హక్కు నీకు ఉందా? నువ్వు గెలుస్తావని బెట్టింగ్ పెట్టి ఆ డబ్బులు కట్టలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యచేసుకుంటే సంవత్సరం తరువాత పరామర్శకు వెళ్ళి.. మరో ఇద్దరి చావుతో శవరాజకీయాలు చేస్తున్న నీవు.. దమ్ముంటే చర్చకు సిద్ధమా? గత ఐదేళ్ళు నువ్వు ఏమి చేయలేదని చెప్పడానికి నేను సిద్ధం అని బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆయన ఇంకా, ఏమన్నారంటే..

అరాచక ఆటవిక విధానాలకు నాంది పలికి హత్యారాజకీయాలను ప్రోత్సహించి గోబెల్స్ ప్రచారంతో నాడు అధికారం చేపట్టి జగన్ రెడ్డి ఏవిధంగా రాష్ట్రాన్ని భష్టు పట్టించాడో మనం చూశాం. అధికారం కోల్పోవడంతో జగన్ కు మతి భ్రమించినట్లుంది. ఎర్రగడ్డలోనే, విశాఖ మానసిక ఆస్పత్రిలోనే చికిత్స చేయించాల్సి ఉంది. అసెంబ్లీకి రాకుండా, ప్రజల సమస్యలపై మాట్లాడకుండా.. కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి తన పర్యటనలు చేస్తున్నాడు. రౌడీమూకలు, గంజాయి మూకలను వెనకేసుకేసుకొస్తున్నారు.

వారి పరామర్శలకు వెళ్తున్నారు. సత్తెనపల్లి పర్యటనకు 100 మందికి పర్మిషన్ ఉంటే వేలమందిని పోగేసి ఏవిధంగా స్లోగన్స్ ఇప్పించాడో మనం చూశాం. తక్షణమే అధికారం కావాలి, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి, అరాచకం సృష్టించాలి, అవినీతితో దోచుకోవాలనే లక్ష్యంతోనే జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
అభివృద్ధి సంక్షేమంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే.. ప్రజాస్వామ్య హక్కులకు ఎక్కడా భంగం కలిగించకుండా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంటే..

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆభాసు పాలుచేయాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా అరాచకం, ఆటవికం, పోలీసుల మీద దాష్టీకం, ప్రజల మీద దాష్టీకాలకు పాల్పడుతున్నారు. తాజా జరిగిన పర్యటనలో ఇద్దరు మరణిస్తే కనీసం వారిని పరామర్శించడానికి కూడా వెళ్లలేదు. కూటమి ప్రభుత్వం రాక ముందు జరిగిన సంఘటనను తీసుకు వచ్చి ప్రభుత్వానికి అంటగడుతున్నారు.

తన సొంత బాబాయిని హత్య చేయించి ఆ నేరాన్ని మాఫీ చేయించుకోవడానికి జగన్ రెడ్డి పడుతున్న తిప్పలు అందరూ చూస్తున్నారు. పరిటాల రవి హత్య దగ్గర నుండి అనేక హత్యల్లో సంబంధం ఉన్న జగన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలతో ముందుకు వెళ్తున్న జగన్ కు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది.

దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా అలజడి సృష్టిస్తున్నారు. అసలు గత అయిదేళ్ళు రైతులకు ఏం చేశాడని జగన్ రెడ్డి పొగాకు రైతుల పరామర్శకు వెళ్లాడు? నీటిపారుదల వ్యవస్థను నాశనం చేశాడు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వులేదు. కొన్న ధాన్యంకు డబ్బులు ఇవ్వలేదు?

బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం ముసుగులో అప్పులు తెచ్చి దోచుకోవడం తప్ప జగన్ చేసింది ఏమీ లేదు. తన అధికార దాహం కోసం రౌడీ మూకలను వెంటేసుకొని అలజడులు సృష్టిస్తున్నారు. ఇదే విధానం కొనసాగితే ఎలా కట్టడి చేయాలో మాకు తెలుసు. కులాలు, మతాల పేరుతో విభజించు పాలించు విధానంతో వెళ్తూ కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి ఇష్టారాజ్యంగా సాగుతామంటే కుదరదు జగన్ రెడ్డి.

మా ఓపిక నసించి మా కార్యకర్తలు తిరగబడితే వైసీపీ మూకల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. మేం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన చేస్తున్నాం. జగన్ రెడ్డి చేసిన తప్పొప్పులను సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఏం చేశారని జగన్ రెడ్డికి ప్రజలు ఓట్లు వేయాలి? ఏ సమస్యపైన అయినా స్పందించారా? ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? ఎవరికైనా ఉపాధి కల్పించారా? ఐదేళ్లలో చేసింది ఒక్కటి లేదు.. ఉత్తుత్తి బటన్ లు నొక్కడం తప్ప.

151 మందితో ప్రజలు అధికారం ఇస్తే, అరాచకం , ముఠా రాజకీయాలు చేశాడు, అవినీతి అక్రమాలను పెంచి పోసించాడు. లిక్కర్ స్కామ్‌లు, మైనింగ్ స్కామ్‌లు, ఆఖరికి టీడీడీ ధర్మశాలను కూడా దోచుకున్నారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి తప్పుడు కేసులతో మా నాయకులను జైల్లో పెట్టారు. ప్రజాస్వామ్యాన్ని, హక్కులను అణచివేశారు. ఉద్యోగులతోపాటు అందరిని మోసం, దగా చేశాడు. జగన్ రెడ్డి వల్లే అనేకమంది దివాళా తీసిపోయారు, అప్పుల పాలైయ్యారు, ఆత్మహత్యలు చేసుకున్నారు.

మేం చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం. ఎంతమంది ఉన్నా తల్లికి వందనం ఇచ్చాం, పింఛన్ ఇచ్చాం. నాడు జగన్ రెడ్డి పెంచిన పింఛన్ ఇవ్వడానికి ఐదేళ్లు పట్టింది. రైతులను ఆదుకుంటున్నాం, ధాన్యం కొన్న వెంటనే డబ్బులు ఇస్తున్నాం. నాడు జగన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదు?

జగన్ రెడ్డి చేసిన అప్పులు పెనుభారమై.. ఆ అప్పులు తీర్చడానికే ప్రభుత్వానికి సమయం సరిపోతుంది. లక్షల ఎకరాలు దోపిడీ చేసి తన అనుంగలకు కట్టబెట్టాడు. దానిపై విచారణ జరుగుతుంది. న్యాయం త్వరలోనే రుజువైతుంది. ఇవాళకాకుంటే రేపో ఎళ్లుండో ఏ చంచల్ గూడ జైలుకో, రాజమండ్రి జైలుకో జగన్ వెళ్లకు తప్పదు. ప్రజలు అరాచక వ్యక్తులు చేస్తున్న విధ్వంసాలకు దూరంగా ఉండాలి.

LEAVE A RESPONSE