– నువ్వు పరువు నష్టం దావా వేస్తాననడం హాస్యాస్పదం
– పరువు గురించి మాట్లాడే నైతక హక్కు, అర్హత నీకు లేవు జగన్
– నీకు నిజంగా పరువు ఉంటే ఎఫ్.బి.ఐ మీద దావా వేసే దమ్ముందా?
– నువ్వు పరువునష్టం దావా వేయాలని మేం కోరుకుంటున్నాం…కోర్టులో నీ నిజస్వరూపం బయటపెడతాం
– ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవల్మపెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి
అమరావతి: అవినీతే ఆరోప్రాణంగా…అబద్దాలే జన్మహక్కుగా భావించిన జగన్మోహన్‌రెడ్డి విద్యుత్ రంగాన్ని తన లంచాల దాహంతో ఐదేళ్ల పాటు సర్వనాశనం చేశాడు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో జగన్మోహన్‌రెడ్డిని వివిధ దర్యాప్తు సంస్థలు అవినీతిపరుడు అని తేల్చినా జగన్మోహన్‌రెడ్డి ఇంకా అబద్దాలు చెప్పడం దారుణం.
రాష్ట్ర విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన నువ్వు నన్ను సన్మానించండి అని కోరడం ఏంటి జగన్మోహన్‌రెడ్డి? సోలార్ విద్యుత్ ధరలు రోజు రోజుకూ దిగజారిపోతుంటే నువ్వుమాత్రం యూనిట్ విద్యుత్ ధర రూ.2.49కు ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నావు? సెకీ అనేది ఇతర రాష్ట్రాలకు ఎందుకు లేఖ రాయలేదు? ఎందుకు ఏపీ ప్రభుత్వానికే లేఖ రాసిందో చెప్పగలవా జగన్?
రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిన నువ్వు నిర్లజ్జగా సంవత్సరానికి రూ.44వేల కోట్లు ఆదా చేసే ప్రయత్నం చేశామని చెప్పడం నీ దగాకోరు బుద్ధికి నిదర్శనం కాదా? కేవలం రూ.2కే యూనిట్ విద్యుత్ వచ్చే అవకాశాలు ఉన్న పీపీఏలను రద్దు చేసి సెకీ చాటున వేరొక విద్యుత్ ఉత్పత్తి కంపెనీతో ఎందుకు ఒప్పందం చేసుకున్నావు? దాని వెనుక ఉన్న ఆర్థిక నేరాల రహస్యాన్ని ప్రజలకు ఎందుకు చెప్పలేదు జగన్?
ఏపీ ప్రభుత్వం ఇతర విద్యుత్ కంపెనీతో ఒప్పందం చేసుకుందని సెకీ తన లేఖలో స్పష్టంగా చెప్పినా, ఈ ఒప్పందంలో కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఉన్నాయి….థర్డ్ పార్టీకి ఇందులో ఆస్కారం లేదని చెప్పడం ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడం కాదా జగన్మోహన్‌రెడ్డి? నువ్వు సెకీతో ఒప్పందం చేసుకుని ఉంటే ఎఫ్.బి.ఐ నీ పేరును తన ఛార్జిషీట్ లో ఎందుకు దాఖలు చేశారు? సౌరవిద్యుత్ కొనుగోలు వ్యవహారంలో నీపై ఆరోపణలు వస్తే వివరణ ఇవ్వడానికి 3 రోజుల సమయం పట్టిందా? అయినా నేడు ప్రెస్ మీట్ లో చెప్పినవన్నీ అబద్దాలే.
నీ అవినీతి దాహానికి ప్రజలపై దాదాపు రూ.2లక్షల కోట్ల భారం మోపిన జగన్మోహన్‌రెడ్డి నేడు ఏమీ ఎరుగని నంగనాచిలా కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రపంచ ఆర్థిక నేరస్తుడివైన నువ్వు పరువు నష్టం గురించి, పరువు గురించి మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు జగన్మోహన్‌రెడ్డి. నీ అవినీతి బాగోతాన్ని ప్రజలకు చెప్పిన మీడియా సంస్థలపై నీ బెదిరింపులు సిగ్గుచేటు.
పరువు అనే పదం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత రెండూ నీకు లేవు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి జగన్. నీకు నిజంగా పరువు ఉంది అనుకుంటే నిన్ను ప్రపంచ ఆర్థిక నేరగాడివని తేల్చిన అమెరికా సంస్థ ఎఫ్.బి.ఐ మీద పరువునష్టం దావా వేసే దమ్ముందా? నువ్వు పరువునష్టం దావా వేయాలనుకోవడాన్ని మేం స్వాగతిస్తున్నాం… అలాగైనా నీ నిజ స్వరూపం బయటపడుతుంది. నువ్వు త్వరగా ప్రెస్ మీట్ పెట్టి పరువునష్టం దావా వేస్తున్నానని చెప్పాలని కోరుకుంటున్నాం. నువ్వు నిజాయితీపరుడివి అయితే, నీకు నిజంగా దమ్ము ఉంటే పరువు నష్టం దావా వెయ్యి…నీ నిజస్వరూపాన్ని కోర్టులోనే మేం తేలుస్తాం.